రొటీన్ లవ్ స్టోరీ

రొటీన్ లవ్ స్టోరీ 2012లో విడుదలైన తెలుగు చలనచిత్రం. చాణక్య బూనేటి నిర్మించగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు.[1] సందీప్ కిషన్, రెజీనా ప్రధాన పాత్రలలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.[2] 2012 నవంబరు 23న విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

రొటీన్ లవ్ స్టొరీ
దర్శకత్వంప్రవీణ్ సత్తారు
రచనప్రవీణ్ సత్తారు
నిర్మాతచాణక్య బూనేటి
తారాగణంసందీప్ కిషన్
రెజీనా
ఛాయాగ్రహణంసురేష్ భార్గవ్
కూర్పుధర్మేంద్ర
సంగీతంమిక్కీ జే మేయర్
విడుదల తేదీ
2012 నవంబరు 23 (2012-11-23)
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్2.5 crore (US$3,10,000)
బాక్సాఫీసు12.5 crore (US$1.6 million)

తారాగణం మార్చు

కథ మార్చు

సంజు (సందీప్ కిషన్) ఇంజనీరింగ్ స్టూడెంట్. తొలిచూపులోనే అతను తన్వి (రెజీనా)తో ప్రేమలో పడతాడు. అయితే ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా, ఆ ప్రేమను ఒంటరిగా ఆస్వాదిస్తూ ఉంటాడు. ప్రేమను వ్యక్తం చేసిన దగ్గర నుండి లేనిపోని చిక్కులు వస్తాయన్నది అతని భయం. కానీ తప్పని పరిస్థితుల్లో, స్నేహితుల ఒత్తిడిమేరకు తన్వికి తన మనసులో మాట చెప్పేస్తాడు. 'నీ గురించి ఏమీ తెలియకుండా ఎలా ప్రేమిస్తాను' అంటుంది తన్వీ. ఆమె వాదనలోనూ పాయింట్ ఉందంటారు స్నేహితులు. కాలేజీ ట్రిప్‌లో ఊహించని ప్రమాదంలో పడిన ఈ యువ జంటకు ఒకరి పట్ల ఒకరికి అభిమానం పెరుగుతుంది. కానీ తన ప్రేమను వ్యక్తం చేయడానికి మరికాస్త సమయం కోరుతుంది తన్వీ. దాంతో సంజు ఆమెతో తెగతెంపులు చేసుకుంటాడు. తిరిగి స్నేహితుల సహకారంతో వీరిద్దరూ ఎలా ఒకటి అయ్యారన్నది మిగతా కథ.[3]

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "నా మనసుపై"  శ్రీరామచంద్ర 4:16
2. "నీతోనే ఉన్నా"  మిక్కీ జె మేయర్ 4:41
3. "వేల తళుకుతారలే"  కార్తిక్ 4:43
4. "ఎప్పతికైనా"  నరేష్ అయ్యర్ 4:42
5. "నీ వరస నీదే"  కార్తిక్ 4:38
6. "Routine Love Story Theme"  దీపు 1:28
24:28

మూలాలు మార్చు

  1. "Routine Love Story to release on November 23". Times of India. Archived from the original on 2013-01-03. Retrieved 9 November 2012.
  2. "Routine Love Story – Quirky humour". The Hindu. Archived from the original on 8 నవంబరు 2012. Retrieved 9 November 2012.
  3. వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. ""పేరుకు తగ్గట్టుగానే 'రొటీన్ లవ్ స్టోరీ" !". ఓంప్రకాశ్ రాతలు గీతలు. Retrieved 15 February 2024.