ప్రవీణ్ సత్తారు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రవీణ్ సత్తారు జాతీయ పురస్కారం పొందిన సినీ దర్శకుడు.[1] అమెరికాలో సాఫ్టువేరు ఉద్యోగియైన ప్రవీణ్ సినిమాల మీద ఆసక్తితో ఆ రంగాన్ని వదిలి వచ్చాడు.[2] 2014 లో ఆయన రూపొందించిన చందమామ కథలు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్నందుకుంది.
ప్రవీణ్ సత్తారు | |
---|---|
![]() సినివారంలో ప్రవీణ్ సత్తారు | |
జననం | |
వృత్తి | సినీ దర్శకుడు నిర్మాత సాఫ్టువేరు ఇంజనీర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2010 - ప్రస్తుతం |
వ్యక్తిగత జీవితం సవరించు
ప్రవీణ్ విజయనగరంలో జన్మించాడు. భారత్ లో ఇంజనీరింగ్ చేశాక అమెరికాలో చిప్ డిజైనింగ్ లో ఎమ్మెస్ చేశాడు. తరువాత అక్కడే ఐబీఎం సంస్థలో పదేళ్ళ పాటు SAP కన్సల్టెంటుగా పనిచేశాడు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి వచ్చాడు. అతని భార్య పేరు అర్చన.[3]
సినీ కెరీర్ సవరించు
ఒకసారి భారత్ కు వచ్చినపుడు తాతగారి సలహా మేరకు విజయనగరంలో బధిరుల కోసం, మూగవారి కోసం ప్రత్యేక పాఠశాల నడుపుతున్న టెంకాయల సత్యనారాయణను కలిశాడు. ఆయనను ఇంటర్వ్యూ చేసి ఆయన కథను కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సినిమాగా తీయాలకున్నాడు. కానీ ఉద్యోగ ఒత్తిడుల వల్ల అది సాధ్యం కాలేదు. తరువాత లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమాతో దర్శకుడిగా ప్రవేశం చేశాడు. ఈ సినిమాకు పూర్వం సినిమాకి సంబంధించిన ఎలాంటి కోర్సు చేయలేదు. అసలు సినిమాల్లో పనిచేసిన అనుభవం లేదు.[4]
దర్శకత్వం వహించిన సినిమాలు సవరించు
మూలాలు సవరించు
- ↑ సాక్షి ప్రతినిథి. "నిజంగానే సినిమా కష్టాలు పడ్డాను!". sakshi.com. జగతి పబ్లికేషన్స. Retrieved 21 September 2016.
- ↑ "ప్రవీణ్ సత్తారు ఇంటర్వ్యూ". business-standard.com. Retrieved 21 September 2016.
- ↑ TNR. "TNR with Praveen Sattaru". youtube.com. iDream Telugu Movies. Retrieved 23 September 2016.
- ↑ TNR. "Praveen Sattaru Exclusive Interview With TNR". youtube.com. iDream Telugu Movies. Retrieved 23 September 2016.