రోగ నిరోధక వ్యవస్థ
రోగ నిరోధ వ్యవస్థ (Immune system or Immunity) జీవుల శరీరానికి రక్షణ వ్యవస్థ (Defence system). దీనిని అసంక్రామ్య వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దీనిలో తెల్ల రక్తకణాలు (White Blood Cells), ప్రతిదేహాలు (Antibodies), కొన్ని చిన్న అవయవాలు (Organs) కలిసి ఒక బలగంగా పనిచేసి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే హానికర సూక్ష్మజీవులు, వాటి ఉత్పన్నాలకు జీవి చూపే నిరోధకతను అసంక్రామ్యత అంటారు. స్వీయ (Self), పర కణాలను (Foreign), ఉత్పన్నాలను గుర్తించడం వాటి మధ్య భేదాన్ని తెలుసుకోవడం కూడా ఈ వ్యవస్థలో భాగం.
రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఆయుర్వేద చిట్కాలు
మార్చు- రోజూ ఉదయాన్నే నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగండి. తులసిమొక్కకు రోగనిరోధకశక్తిని పెంచే గుణంతోపాటు.. ఇందులోని ఔషధగుణాలు గొంతును, ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతాయి.
- తిప్పతీగ.. ఇది చాలా ప్రాంతాల్లో విరివిగా దొరుకుతుంది. దొరికితే ఒక అడుగు పొడుగున్న తిప్పతీగను తీసుకుని (లేదా ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాల్లో తిప్పతీగ పొడి దొరికే అవకాశం ఉంది. దాన్నైనా వాడుకోవచ్చు), దాంతోపాటు ఐదారు తులసి ఆకులను నీళ్లల్లో వేసి 20 నిమిషాల పాటు మరిగించండి. రుచికోసం ఆ కషాయానికి తగుమోతాదులో నల్లమిరియాలు, సైంధవలవణం, రాతి ఉప్పు, పటిక బెల్లం వంటివి కలుపుకొని ఆ మిశ్రమాన్ని గోరువెచ్చగా తాగండి. రోగ నిరోధక వ్యవస్థను అద్భుతంగా పనిచేయించే శక్తి ఈ కషాయానికి ఉంది.
- పచ్చివెల్లుల్లిని తినగలిగినవారు రోజూ ఉదయాన్నే రెండు రెబ్బల్ని గోరువెచ్చటి నీటితో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- గోరువెచ్చటి పాలల్లో పసుపు కలుపుకొని తాగితే చాలా మంచిది.
- కలబంద ఆకుల నుంచి తీసిన రసాన్ని ఒక టీస్పూన్ మేర నీళ్లతో కలిపి తీసుకుంటే చర్మానికి మంచిది. కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటన్నిటితో పాటు.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- నిమ్మజాతికి చెందిన పండ్లను.. సి విటమిన్ అధికంగా ఉండే పండ్లరసాలను అధికంగా తీసుకుంటే మంచిది.
- నిత్యవ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రాణాయామం, యోగా వంటివి కూడా.. నోరు, గొంతు, ఊపిరితిత్తులపై దాడి చేసే వ్యాధులను నిరోధించే శక్తిని శరీరానికి ప్రసాదిస్తాయి.
అసంక్రామ్యత రకాలు
మార్చుఅసంక్రామ్యత రెండు రకాలు:
స్వాభావిక అసంక్రామ్యత
మార్చు[1]స్వాభావిక అసంక్రామ్యత (Innate immune system) : పుట్టుకతో వచ్చే అసంక్రామ్యతను స్వాభావిక అసంక్రామ్యత అంటారు. దీనిలో కొన్ని రకాల అవరోధాలు పుట్టుకతోనే వస్తాయి. అవి.
- అంతర్నిర్మాణపర అవరోధాలు: ఉదాహరణ: చర్మం, లాలాజలం, కన్నీరు, శ్లేష్మస్రావాలు.
- శరీరధర్మపర అవరోధాలు: ఉదాహరణ: కన్నీటిలోని లైసోజైమ్, ఇంటర్ ఫెరాన్లు, పరిపూరక ప్రోటీన్లు, దేహ ఉష్ణోగ్రత
- భక్షకకణ అవరోధాలు:
- ఉజ్వలనపర అవరోధాలు: ఉజ్వల అనుక్రియలు (Inflammatory response) అయిన రూబర్, ట్యూమర్, కేలర్, డోలర్ అనేవి.
ఆర్జిత అసంక్రామ్యత
మార్చుఅనుకూలన అసంక్రామ్యత (Adaptive immune system) : పుట్టిన తర్వాత వచ్చే అసంక్రామ్యతను అనుకూలన లేదా ఆర్జిత అసంక్రామ్యత అంటారు. దీని ముఖ్య లక్షనాలు నిర్దిష్టత, వైవిధ్యం, జ్ఞప్తి.
- క్రియాశీల అసంక్రామ్యత: ఒక జీవిలో ప్రతిజనకాలు ప్రవేశించడం వల్ల ప్రతిదేహాలు ఏర్పడి అసంక్రామ్యత కలిగితే అది క్రియాశీల అసంక్రామ్యత అవుతుంది.
- స్తబ్దతా అసంక్రామ్యత: ఒక జీవిలో ఏర్పడిన ప్రతిదేహాలను మరో జీవిలోకి ప్రవేశపెట్టబడడం వల్ల ఆ జీవిలో కలిగేది స్తబ్దతా అసంక్రామ్యత.
అవయవాలు
మార్చు- ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు (Primary Lymphoid Organs): ఏ అవయవాలలోనైతే కణాలు అసంక్రామ్యతా అర్హత కణాలుగా యోగ్యతను పొందుతాయో వాటిని ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అంటారు. ఉదా: ఎముక మూలుగ లేదా మజ్జ, థైమస్ గ్రంథి, పక్షుల్లో బర్సా ఫాబ్రికస్
- ద్వితీత లింఫాయిడ్ అవయవాలు (Secondary Lymphoid Organs): ఈ అవయవాలలో అసంక్రామ్యతా అర్హత కణాలు క్రియాత్మక కణాలుగా మారతాయి. ఉదా: ప్లీహం, శోషరస గ్రంధులు, శ్లేష్మానుబంధ శోషరస కణజాలం (MALT)
కణాలు
మార్చుఅసంక్రామ్యతలో వివిధ రకాల కణాలు పాల్గొంటాయి. వీనిలో శోషరస, భక్షక, ఉపక్రియా కణాలు ముఖ్యమైనవి.
శోషరస కణాలు
మార్చు- B కణాలు (B cells): ఇవి ప్రతిదేహాలను తయారుచేసే కణాలు. ఇవి ఎముక మూలుగలో అసంక్రామ్యతా కణాలుగా మారతాయి. పక్షుల్లో బర్సా ఫాబ్రికస్ లో ఏర్పడతాయి. ఇవి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో క్రియాత్మక జ్ఞప్తి కణాలు, ప్లాస్మా కణాలుగా మారతాయి. ఈ B కణాల ఉపరితలంపై B కణ గ్రాహకాలు (B Cell Receptors) ఉంటాయి. ఇవి ప్రతిజనకం లేదా T కణాలతో సంధితమై వాటిని ప్రేరేపిస్తాయి.
- T కణాలు (T cells): ఇవి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పాల్గొంటాయి. ఇవి థైమస్ గ్రంథిలో అసంక్రామ్యతా అర్హత కణాలుగా మారతాయి. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో TH, TC కణాలు, జ్ఞప్తి కణాలు (Memory cells) గా మారతాయి.
ఏకకేంద్రక భక్షక కణాలు
మార్చు- మోనోసైట్లు (Monocytes), స్థూలభోజక కణాలు (Macrophages): రక్తంలో ఉండే మోనోసైట్లు, కణజాలాలలో ఉండే స్థూలభోజక కణాలు కలిసి ఏక కేంద్రక భక్షక వ్యవస్థ (Mononuclear Phagocytic System) ఏర్పరుస్తాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన మోనోసైట్లను వివిధ కణాలుగా పిలుస్తారు. ఉదా: సంయోజక కణజాలాలలో హిస్టియోసైట్లు (Histiocytes), ఊపిరితిత్తులలో వాయుకోశ స్థూలభక్షక కణాలు (Alveolar Macrophages), కాలేయంలో కుఫర్ కణాలు (Kupfer cells), మెదడులో మైక్రోగ్లియల్ కణాలు (Microglial cells) గా ఏర్పడతాయి. స్థూలభోజక కణాలు ప్రతిజనక సమర్పిత కణాలు (Antigen Presenting Cells) గా పనిచేస్తాయి.
మూలాలు
మార్చు- ↑ [[s:సహజ నిరోధకత్వం(Innate immunity):|సహజ నిరోధకత్వం(Innate immunity):]]. వికీసోర్స్.
- జీవుల్లో రక్షణ వ్యవస్థ, ఎం.బి.తిలక్ ఈనాడు ఏప్రిల్ 3, 2009 దినపత్రికలో ప్రచురించిన వ్యాసం.