రోనాల్డ్ కోస్
రోనాల్డ్ కోస్ (29 డిసెంబర్ 1910-2 సెప్టెంబర్ 2013) ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో వర్తక వ్యవహారాల వ్యయం, ఆస్తి హక్కుల ప్రాధాన్యాన్ని విశ్లేషించి 1991 సంవత్సరపు అర్థశాస్త్ర నోబెల్ బహుమతిని పొందిన ప్రముఖ ఆర్థిక వేత్త. 1910లో ఇంగ్లాండులో జన్మించిన రోనాల్డ్ కోస్ లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్, బఫెలో విశ్వవిద్యాలయం, వర్జీనియా విశ్వవిద్యాలయం లలో అద్యాపకుడిగా పనిచేసారు. చివరికి 1964లో స్వేచ్ఛా పారిశ్రామిక ఆర్థిక శాస్త్రానికి పేరెన్నికగన్న చికాగో విశ్వవిద్యాలయంలో ప్రవేశించి అక్కడే స్థిరపడ్డారు.
బాల్యం, విద్యాభ్యాసం, వృత్తిసవరించు
1910 డిసెంబర్ 29 న ఇంగ్లాండులోని మిడిల్‌సెక్స్లో జన్మించిన రోనాల్డ్ కోస్ 1927-29 వరకు లండన్ ఎక్స్‌టర్నల్ ప్రోగ్రాం చేసి 1931 లో లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ పుచ్చుకున్నాడు. 1935-51 వరకు లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ లో అద్యాపకుడిగా చేరిన రోనాల్డ్ కోస్, 1951 లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందినాడు. అదే సంవత్సరం అమెరికాకు పయనమై బఫెలో విశ్వవిద్యాలయంలో ప్రవేశించి 1958 వరకు అక్కడ అద్యాపకుడిగా పనిచేశాడు. 1958 లో వర్జీనియా విశ్వవిద్యాలయంలో చేరి 1964 వరకు అక్కడే పనిచేసాడు. చివరికి 1964 లో ప్రఖ్యాత చికాగో విశ్వవిద్యాలయంలో చేరి అక్కడే స్థిరపడినాడు. చికాగో విశ్వవిద్యాలయంలో ఉన్న రోజుల్లోనే Journal of Law and Economics కు ఎడిటర్ గా పనిచేశాడు.
వర్తక వ్యవహారాల వ్యయంసవరించు
ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్దిష్ట వివరణలతో రోనాల్డ్ కోస్ ఎంతో దోహదంచేశారు. సంప్రదాయిక సూక్ష్మ అర్థ శాస్ర సిద్ధాంతం అసంపూర్ణంగా ఉందని నిరూపించారు. ఈ సిద్ధాతంలో ఉత్పత్తి, రవాణా వ్యయాన్ని మాత్రమే చేర్చుతున్నారని, కాంట్రాక్టుల వ్యయాన్ని, నిర్వహణ వ్యయాన్ని చేర్చడం లేదని రోనాల్డ్ కోస్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక వ్యవస్థ ఉపయోగించే మొత్తం వనరులలో ఈ వ్యయం వాటా గణనీయంగా ఉటుందని రోనాల్డ్ కోస్ నిరూపించాడు.
ఆస్తి హక్కుల సిద్ధాంతంసవరించు
ఆస్తి హక్కుల సిద్ధాంతాన్ని రూపొందించడంలో రోనాల్డ్ కోస్ ఆద్యుడు. ఆస్తి హకుల వివాదానికి సంబంధించిన సామాజిక వ్యయ సమస్య పత్రాన్ని ప్రచురించిన అనంతరం రోనాల్డ్ కోస్ చాలా ప్రసిద్ధి చెందారు.ఆయన రూపొందించిన ఆస్తి హక్కుల సిద్ధాంతానికి జార్జి స్టిగ్నర్ కోస్ సిద్ధాంతం అని పేరు పెట్టినాడు. ఫ్యాక్తరీ వదులుతున్న విష కాలుష్యం కారణంగా వాతావరణం కలుషితమై చుట్టుప్రక్కల ఉన్న ఇండ్ల విలువ పడిపోతుంది. అటువంటి సందర్భాలలో ఫ్యాక్టరీ యజమానిపై చర్యలు తీసుకోవాలని సంప్రదాయిక ఆర్థిక వేత్తలు భావిచేవారు. కాని ఆస్తి హక్కులు స్పష్టంగా నిర్దేశించాలని, కాలుష్యం స్థాయిని మార్కెట్ నిర్థారించాలని రోనాల్డ్ కోస్ వాదించాడు.
ఆర్థశాస్త్రానికి రోనాల్డ్ కోస్ కృషిసవరించు
ఆర్థిక శాస్త్రము ప్రయోజన కరంగా ఉండాలని భావించిన ఆర్థికవేత్తలలో రోనాల్డ్ కోస్ ఒకరు. ఆయన చాలా సరళమైన భాషలో తన రచనలు కొనసాగించాడు. సంప్రదాయిక ఆర్థిక వేత్తల సిద్ధాంతాన్ని కాదని తన పరిశోధనలతో మెరుగైన భావనలను ఉద్ఘాటించాడు. ముఖ్యంగా తాను ప్రవచించిన ఆస్తి హక్కుల సిద్ధాతం, వర్తక వ్యవహారాల వ్యయ సిద్ధాంతం అర్థ శాస్త్రంలోనే ఒక నూతన అద్యయనానికి తెరదీసింది.
అవార్డులు, బహుమతులుసవరించు
అర్థశాస్త్రంలో రోనాల్డ్ కోస్ చేసిన విశిష్ట సేవలకు, ప్రవచించిన రచనలు, సిద్ధాంతాలకు గాను అత్యున్నతమైన నోబెల్ బహుమతి 1991లో లభించింది. అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఇంగ్లాండు ఆర్థీవేత్తలలో రోనాల్డ్ కోస్ నాల్గవ వ్యక్తి. జాన్ హిక్స్ (1972), జేమ్స్ మీడ్ (1977), రిచర్డ్ స్టోన్ (1984) లు మాత్రమే కోస్ కంటే మునుపు ఈ బహుమతులు స్వీకరించారు.
సమాచార వనరులుసవరించు
- Coase, Ronald. "The Nature of the Firm". on-line version.
- Coase, Ronald. "The Nature of the Firm" in Economica, Vol. 4, No. 16, November 1937 pp. 386–405
- Coase, Ronald. "The Nature of the Firm" in Readings in Price Theory, Stigler and Boulding, editors. Chicago, R. D. Irwin, 1952.
- Coase, Ronald. "The Problem of Social Cost" in Journal of Law and Economics, v. 3, n°1 pp. 1–44, 1960 on-line version.
- Coase, Ronald. "Durability and Monopoly" in Journal of Law and Economics, vol. 15 (1), pp. 143–49, 1972.
- Coase, Ronald. "The Institutional Structure of Production", The American Economic Review, vol.82, n°4, pp. 713–719, 1992. (Nobel Prize lecture) on-line version