రోహిత్ రాజ్‌పాల్

భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు

రోహిత్ రాజ్‌పాల్ (జననం 1971 జనవరి 22) భారతీయ మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు.

రోహిత్ రాజ్‌పాల్
జననం (1971-01-22) 1971 జనవరి 22 (వయసు 53)
కాన్పూర్, ఉత్తర ప్రదేశ్
సింగిల్స్
సాధించిన రికార్డులు0–1 (డేవిస్ కప్)
అత్యుత్తమ స్థానముNo. 524 (1991 జూలై 15)
డబుల్స్
Highest rankingNo. 353 (1991 ఆగస్టు 19)

రాజ్‌పాల్ 1990లో దక్షిణ కొరియాతో జరిగిన ఒక డేవిస్ కప్ టైలో భారతదేశం తరపున ఆడాడు. డెడ్ రబ్బర్ రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది. అందులో అతను కిమ్ జే-సిక్ చేతిలో ఓడిపోయాడు. [1] డేవిస్ కప్ ప్రదర్శనతో పాటు రాజ్‌పాల్, 1990 బీజింగ్‌లో జరిగిన ఆసియా క్రీడలలో భారత జట్టులో సభ్యుడు కూడా.

2019 లో అతను భారత డేవిస్ కప్ మహేష్ భూపతి స్థానంలో కెప్టెన్‌గా ఉన్నాడు. గతంలో అతను జట్టు సెలెక్టర్‌గా పనిచేశాడు. ఢిల్లీ లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. [2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Lawn Tennis: Seoul:". Kingston Gleaner. 7 May 1990. p. 12.
  2. "Rohit Rajpal to be India's non-playing captain". Deccan Herald (in ఇంగ్లీష్). 4 November 2019.