రౌడీ ఫెలో (2014 సినిమా)

కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన 2014 చిత్రం

రౌడీ ఫెలో 2014 లో పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని మూవీమిల్స్ & సినిమా 5 పతాకంపై టి. ప్రకాష్ రెడ్డి నిర్మించాడు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నారా రోహిత్, విశాఖ సింగ్ ప్రధాన పాత్రలని పోషించగా రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, ప్రవీణ్, ఆహుతి ప్రసాద్, మధునందన్ తదితరులు నటించారు.[3][4][5][6] ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతాన్ని అందించగా, అరవిందన్ పి. గాందీ ఛాయాగ్రాహకుడిగా పనిచేసాడు. ఈ చిత్రం 21 నవంబర్ 2014న విడుదలయ్యింది.[7]

రౌడీ ఫెలో
దర్శకత్వంకృష్ణ చైతన్య
నిర్మాతటి. ప్రకాష్ రెడ్డి
తారాగణంనారా రోహిత్[2]
విశాఖ సింగ్
ఛాయాగ్రహణంఅరవిందన్ పి. గాందీ
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంసన్నీ ఎం.ఆర్
నిర్మాణ
సంస్థ
మూవీమిల్స్ & సినిమా 5
విడుదల తేదీ
21 నవంబరు 2014 (2014-11-21)[1]
దేశంఇండియా
భాషతెలుగు

నటీనటులు

మార్చు

మూడేళ్ళ క్రితం విదేశాలకు వెళ్ళి కోట్లు సంపాదించి... ఇండియాకు తిరిగొస్తాడు రానా ప్రతాప్ జయదేవ్. ఇగోకి బానిస అయిన ఈ కుర్రాడికి ఊహించని విధంగా ఎస్.పి.తో గొడవౌతుంది. తన కాలర్ పట్టుకున్న ఆ ఎస్.పి.కి బుద్ధి చెప్పాలని... యాభై లక్షలు లంచం ఇచ్చి... ఎస్.ఐ. పోస్టును కొనేస్తాడు. అనుకోకుండా పక్క జిల్లాలో పోస్టింగ్ వచ్చిందని తెలిసి... అక్కడ అల్లరి చేసి... పశ్చిమ గోదావరిలో పోస్టింగ్ వేయించుకుంటాడు. ఆ పనిలోనే ఎస్.పి. కూతురు మేఘకు లైన్ వేస్తాడీ ఇగోయిస్టిక్ పోలీస్ ఆఫీసర్! అయితే... కాబోయే మామగారు కాబట్టి ఎస్.పి.తో వైరాన్ని వదులుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి అసురగణం దుర్గాప్రసాద్‌తో ఇగో ప్రాబ్లమ్ తలెత్తుతుంది. అంతే... ముందుగా ఈ పార్లమెంటేరియన్ పని పట్టాలనే నిర్ణయానికి వస్తాడు. కేంద్రమంత్రి పదవి చేజారిపోయిందనే అక్కసుతో ఉన్న దుర్గాప్రసాద్‌కు, కొల్లేరు ప్రాంతాన్ని కాపాడాలనుకున్న రానా ప్రతాప్ జయదేవ్‌కు మధ్య ఎలాంటి పోరు జరిగిందన్నదే మిగతా సినిమా![8]

పాటల పట్టిక

మార్చు

ఈ చిత్ర సంగీతాన్ని 16 సెప్టెంబర్ 2014 నాడు నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా విడుదల చేసారు. సన్నీ ఎమ్.ఆర్ సంగీతాన్ని అందించాడు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."రా రా రౌడీ"కృష్ణ చైతన్యఅర్జీత్ సింగ్, అదితి సింగ్ శర్మ3:27
2."ఏదో"కృష్ణ చైతన్యఅర్మాన్ మాలిక్, హర్షిక గుడి3:57
3."ఆ సీతాదేవి నవ్వులా"కృష్ణ చైతన్యఅర్జీత్ సింగ్4:16
4."ఎంత వారు గానీ - రీమిక్స్"సింగిరెడ్డి నారాయణరెడ్డినాకాశ్ అజీజ్, నటాషా పింటో3:07
5."రెడ్ & యెల్లో"వశిష్ట శర్మశల్మలి ఖోల్గడే, సాంరాట్ కౌశల్3:05
6."కాల్ అఫ్ ది రౌడీ - థీమ్ మ్యుజిక్" (ఇంస్ట్రుమెంటల్) జెన్నిఫర్ అబ్రహమ్, సన్నీ ఎం.ఆర్2:09
మొత్తం నిడివి:20:01

స్పందనలు

మార్చు
  • నారా రోహిత్ బాగానే చేశాడు. అయితే బాడీలో ఉండాల్సిన ఫెక్సిబిలిటీ ఏ మాత్రం లేదు! ఈ విషయంలో కాస్తంత జాగ్రత్త పడితే ఇంకాస్త బాగుండేది! హీరోయిన్ విశాఖా సింగ్‌ది అంతగా ప్రాధాన్యం లేని పాత్ర. సన్నీ ఎం.ఆర్. అందించిన సంగీతం, ఓం సినిమాటోగ్రఫీ సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. మాటలు ఫిలసాఫికల్ గా బాగున్నాయి. అయితే చాలా సందర్భాలలో సన్నివేశాన్ని ఇవి డామినేట్ చేశాయి. కథ బాగానే ఉన్నా.. దానిని తెర మీద ప్రెజెంట్ చేసే విషయంలో జాగ్రత్త తీసుకోక పోవడంతో సినిమా స్లోగా భారంగా నడుస్తున్నట్లనిపిస్తుంది. ఈ విషయంలో కేర్ తీసుకుని ఉంటే మంచి సినిమా అయిఉండేది.[8] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్, ఫిల్మ్ జర్నలిస్ట్

మూలాలు

మార్చు
  1. "Rowdy Fellow Grand release on 21st Nov". supergoodmovies.com. 16 November 2014. Archived from the original on 4 మే 2016. Retrieved 4 August 2019.
  2. "Nara Rohit Exclusive Interview on Rowdy Fellow Movie - Gulte.com". youtube.com. 20 November 2014. Retrieved 4 August 2019.
  3. "Rowdy Fellow's next schedule in Hyderabad". 123telugu.com. Retrieved 4 August 2019.
  4. "Nara Rohit New Film Rowdy Fellow Launched". strikingsoon.in. Archived from the original on 1 డిసెంబరు 2013. Retrieved 4 August 2019.
  5. "Nara Rohit as Rowdy Fellow". idlebrain.com. 30 November 2013. Retrieved 4 August 2019.
  6. "Nara Rohit set to surprise all in 'Rowdy Fellow'". 123telugu.com. Retrieved 4 August 2019.
  7. "Nagarjuna pleased with Uyyala Jampala". timesofindia.com. Retrieved 4 August 2019.
  8. 8.0 8.1 వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. "'Rowdy Fellow' movie review". ఓంప్రకాశ్ రాతలు గీతలు. Retrieved 21 February 2024.