రౌతు సూర్యప్రకాశ రావు

రౌతు సూర్యప్రకాశ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004 నుండి 2014 వరకు రాజమండ్రి ఎమ్మెల్యేగా పని చేశారు. 2009 నుంచి 2014వరకు రెండు దఫాలు టిటిడి బోర్డు మెంబర్ గా చేసారు. [1]

రౌతు సూర్యప్రకాశరావు
రౌతు సూర్యప్రకాశ రావు


శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2014
నియోజకవర్గం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 18 జూన్ 1958
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రౌతు తాతాలు, పార్వతమ్మ
జీవిత భాగస్వామి సౌభాగ్యలక్ష్మి
సంతానం వరుణ్‌బాబు, సౌజన్య


జననం, విద్యాభాస్యం

మార్చు

రౌతు సూర్యప్రకాశ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలో 18 జూన్ 1958లో రౌతు తాతాలు, పార్వతమ్మ దంపతులకు జన్మించారు. ఆయన రాజమండ్రి లోని జి.ఎస్.కె.ఎం లా కళాశాల నుండి న్యాయవిద్య పూర్తి చేశారు.

రాజకీయ జీవితం

మార్చు

రౌతు సూర్యప్రకాశ రావు విధ్యర్హి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి స్డూడెంట్స్‌ యూనియన్‌ లీడర్‌గా, ఆంధ్రకేసరి యువజన సమితిలో పలు పదవులు నిర్వర్తించి, కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పదవులు నిర్వర్తించి, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) లొ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2004 - 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. 2009 నుంచి 2014వరకు రెండు దఫాలు టిటిడి బోర్డు మెంబర్ గా చేసారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సూర్యప్రకాశరావు 11 మార్చి 2014లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి, అనంతర పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.[2]

    1992 - 94లొ చాంబర్‌ ఆఫ్‌  కామర్స్‌ అధ్యక్షుడిగా, అతర్వాత  కోస్తా జిల్లాల వర్తక సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. టర్నోవర్ టాక్స్, ఎంట్రీ టాక్స్ వంటి వర్తక సమస్యలపై పోరాటం చేసారు.  ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజీ లో కూడా పలు పదవులు నిర్వహించారు. ఎపెక్స్‌ క్లబ్‌ ఛైర్మన్‌గా 1987 నుండి 1988 వరకు, జిల్లా ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా,
 1995 నుంచి 2002వరకు   అఖిల పక్ష కమిటీ కన్వీనర్ గా వ్యవహరించి  పలు ప్రజా సమస్యలపై స్పందించారు. నిత్యం గోదావరిలో ఈతకొట్టే అలవాటున్న రౌతు ఎమ్మెల్యేగా ఉండగా స్విమ్మర్స్ తో  గోదావరి స్విమ్మర్స్‌ క్లబ్‌ పేరుతో ఒక క్లబ్ ఏర్పాటుచేశారు. దానికి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. 
   ఎమ్మెల్యేగా ఉండగానే స్టేట్‌ ఎస్యూరెన్స్‌ కమిటీ చైర్మన్‌ గా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా చేసిన పదేళ్ల కాలంలో రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా  సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి రోజు  ఏప్రిల్ 16ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటింపజేయడంలో  తనవంతు పాత్ర పోషించారు.  అప్పట్లో రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ కుమార్, మంత్రిగా ఉన్న జక్కంపూడి రామ్మోహనరావు సహకారంతో పేదలకు ఇళ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం అభివృద్ధి, 2008లో నంది నాటకోత్సవాల నిర్వహణ, నల్లా ఛానల్ అభివృద్ధి, ఆర్యాపురం స్టోరేజి ట్యాంక్ ,  డాక్టర్ ఏ.బి. నాగేశ్వరరావు పార్కు, జాంపేట రైల్వే వంతెన  విస్తరణ, ఐ ఎల్ టి డి దగ్గర ఫ్లయ్ ఓవర్ వంతెన, ఈస్ట్ రైల్వే స్టేషన్, గోదావరిపై గామన్ బ్రిడ్జి, ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రెండుసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్దు సభ్యుడిగా పనిచేసారు. టిటిడి బోర్డు మెంబర్ గా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం, శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం టిటిడి కళ్యాణ మండపం  అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేసారు.  2019లొ వైస్సార్ సిపి నుంచి రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందారు. తర్వాత సిటీ వైసిపి కో ఆర్డినేటర్ గా పనిచేసారు. ఎమ్మెల్యేగా శాసనసభలో పలు సమస్యలపై స్పందించిన నేపథ్యంలో "చట్ట సభల్లో గోదావరి గళం" పేరిట  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రౌతు సూర్యప్రకాశరావు ప్రసంగాలు 2004- 2014 పుస్తకాన్ని  శ్రీపాద శ్రీనివాస్ 2023లో  సంకలనం చేసారు.  2023చివరిలో రాజమండ్రి అర్బన్ డవలప్ మెంట్ (రుడా) చైర్మన్ గా నియమితులయ్యారు. 2024ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందడంతో రుడా చైర్మన్ పదవికి రాజీనామా చేసారు.

మూలాలు

మార్చు
  1. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  2. Sakshi (12 March 2014). "వైఎస్సార్ సీపీలో చేరిన ఎమ్మెల్యే రౌతు". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.