లంక (2017 సినిమా)

సీనియర్ హీరోయిన్ రాశి కీలక పాత్రలో నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం 'లంక'. ఈ సినిమా 14 ఏప్రిల్ 2017న విడుదలైంది.[1]

లంక మూవీ పోస్టర్

కథసవరించు

స్వాతి(ఐనా సాహ) అనే సినిమా హీరోయిన్తో సాయి(సాయి రోనక్) అనే షార్ట్ ఫిల్మ్ మేకర్ ఓ లఘు చిత్రం చేయాలనుకుంటాడు. సిటీకి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్లో షార్ట్ ఫిల్మ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. టీం మొత్తం కలిసి గెస్ట్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. ఆ బిల్డింగ్ ఓనర్ రెబాకా విలియమ్స్(రాశి)కు స్వాతికి మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. టెలీపతిలో నిపుణురాలైన రెబాకా.. స్వాతి ఏదో విషయానికి భయపడుతుందని తెలుసుకొని టెలీపతి ద్వారా ఆ సమస్యను అధిగమించమని సలహా ఇస్తుంది.

ఆమె చెప్పినట్లుగా స్వాతి తన మైండ్ను కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇదిలా ఉండగా మరికొన్ని రోజుల్లో అమెరికా వెళ్లాలనుకున్న స్వాతి సడెన్గా కనిపించకుండా పోతుంది. స్వాతి ఏమైందో తెలుసుకోవడానికి పోలీసులు సాయిని అతడి స్నేహితులను అరెస్ట్ చేస్తారు. అదే సమయంలో నేనే స్వాతిని అంటూ పోలీస్ స్టేషన్కు రెబాకా వస్తుంది. అసలు స్వాతి ఏమైంది..? ఆమె కనిపించకుండా పోవడానికి గల కారణాలు ఏంటి..? స్వాతిని నేనే అని రెబాకా చెప్పడం వెనుక ఆమె ఉద్దేశం ఏంటి..? అనే అంశాలతో సినిమా నడుస్తుంద [2]

తారగణంసవరించు

రెబెకాగా రాశి

సాయిగా సాయి రోనక్

స్వాతిగా ఐనా సాహ

పోలీసుగా సుప్రీత్

సత్యం రాజేష్

సత్య

సుదర్శన్

సాంకేతిక నిపుణులుసవరించు

  • కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని
  • నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్
  • సంగీతం: శ్రీచరణ్ పాకాల
  • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
  • కెమెరా: వి.రవికుమార్

మూలాలుసవరించు

  1. The Times of India (2017). "Lanka Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
  2. CineJosh (21 April 2017). "Lanka Movie Review సినీజోష్‌ రివ్యూ: లంక". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.