లక్కీరామ్ అగర్వాల్

లక్కిరామ్ అగర్వాల్ ( 1932 ఫిబ్రవరి 13 - 2009 జనవరి 24) భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. లక్కీ రామ్ అగర్వాల్ 1990 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు.[1] లక్కీ రామ్ అగర్వాల్ 1990 నుండి 2000 వరకు మధ్యప్రదేశ్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మధ్యప్రదేశ్ విభజన తర్వాత ఛత్తీస్‌గఢ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు.[2]

లక్కీ రామ్ అగర్వాల్
రాజ్యసభ సభ్యుడు
In office
2000 నవంబరు 1 – 2002 ఏప్రిల్ 9
నియోజకవర్గంఛత్తీస్ గడ్
In office
1990 ఏప్రిల్ 10 – 2000 అక్టోబరు 31
నియోజకవర్గంమధ్యప్రదేశ్
వ్యక్తిగత వివరాలు
జననం1932 ఫిబ్రవరి 13
మధ్యప్రదేశ్,, భారతదేశం
మరణం2009 జనవరి 24(2009-01-24) (వయసు 76)
బిలాస్ పూర్, , భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
సంతానంఅమర్ అగర్వాల్
వృత్తిసామాజిక కార్యకర్త వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు

వ్యక్తిగత జీవితం

మార్చు

లక్కీ రామ్ అగర్వాల్ 1932 ఫిబ్రవరి 13న రాయ్‌గఢ్ జిల్లాలోని ఖర్సియాలో మన్షా రామ్ అగర్వాల్ రుక్మణి దేవి దంపతులకు జన్మించారు.[1] లక్కీ రామ్ 1950లో మార్వాన్ దేవిని వివాహం చేసుకున్నాడు లక్కీ రాముకు ఐదుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. లక్కీ రామ్ అగర్వాల్ కుమారుడు అమర్ అగర్వాల్ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశాడు.[2][3] లక్కీ రామ్ అగర్వాల్ ఖర్సియాలోని నహర్‌పల్లిలో మిడిల్ స్కూల్ వరకు చదువుకున్నాడు.[1]

రాజకీయ జీవితం

మార్చు

లక్కీ రామ్ అగర్వాల్ రాజకీయ జీవితం1960లో ప్రారంభమైంది.[2] లక్కీ రామ్ అగర్వాల్ 1964 నుండి 1969 వరకు ఖర్సియా మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్‌గా, 1977 నుండి 1980 వరకు రాయ్‌గఢ్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా 1977 నుండి 1980 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు [1] 1975లో ఎమర్జెన్సీ సమయంలో లక్కీ రామ్ అగర్వాల్ జైలులో నిర్బంధించబడ్డారు.[2] లక్కీ రామ్ ఆగర్వాల్ 1983లో మధ్యప్రదేశ్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యాడు [4] లక్కీ రామ్ అగర్వాల్ 1990 ఏప్రిల్ 10 నుండి 2000 అక్టోబరు 31 వరకు మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు. 2000 నవంబరు 1 నుండి 2002 ఏప్రిల్ 9 వరకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు.[1] ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు లక్కీ రామ్ అగర్వాల్‌ పోరాడారు .[5] 2003 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నవారిలో రమణ్ సింగ్ దిలీప్ సింగ్ జూడియోతో పాటు లక్కీ రామ్ అగర్వాల్ ఒకరని 2010 ఇంటర్వ్యూలో నంద్ కుమార్ సాయి చెప్పారు.[6]

లక్కీ రామ్ అగర్వాల్ బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2009 జనవరి 24 న మరణించారు.[7] ఖర్సియాలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రమణ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాష్ చంద్ర జోషి, సుమిత్రా మహాజన్ విక్రమ్ వర్మ అంత్యక్రియలకు హాజరై అగర్వాల్‌కు నివాళులర్పించారు.[2]

ములాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha. Retrieved 2 January 2016.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Lakhiram Agrawal cremated with state honours". Kharsia: webindia123.com. United News of India. 25 January 2009. Archived from the original on 2 మార్చి 2016. Retrieved 2 January 2016.
  3. "छत्तीसगढ़ मंत्रिमंडल" (in Hindi). Chief Minister Office, Chhattisgarh. Archived from the original on 10 సెప్టెంబరు 2014. Retrieved 2 January 2016.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. "लखीराम अग्रवाल पंचतत्व में विलीन" (in Hindi). Kharsia: Webdunia. Archived from the original on 2016-03-04. Retrieved 2023-12-30.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  5. Louise Tillin (1 October 2013). Remapping India: New States and their Political Origins. Hurst Publishers. p. 139. ISBN 978-1-84904-229-1.
  6. Tariq Thachil (17 November 2014). Elite Parties, Poor Voters. Cambridge University Press. p. 147. ISBN 978-1-107-07008-0.
  7. "Senior BJP leader Lakhiram Agarwal passes away". news.webindia123.com. Bilaspur: webindia123.com. United News of India. 25 January 2015. Archived from the original on 1 ఫిబ్రవరి 2016. Retrieved 2 January 2016.