లక్కున్నోడు 2017లో విడుదలైన తెలుగు సినిమా.

లక్కున్నోడు
దర్శకత్వంరాజ్‌కిరణ్‌
రచనరాజ్‌కిరణ్‌
(కథ)
డైమండ్‌ రత్నబాబు
(మాటలు)
స్క్రీన్ ప్లేడైమండ్‌ రత్నబాబు
కథరాజ్‌కిరణ్‌
నిర్మాతఎం.వి.వి.సత్యనారాయణ
తారాగణంమంచు విష్ణు
హన్సికా మోట్వాని
ఛాయాగ్రహణంపి.జి. వింద
సంగీతంఅచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు
నిర్మాణ
సంస్థ
ఎం.వి.వి.సినిమా
పంపిణీదార్లులైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ
26 జనవరి 2017 (2017-01-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

లక్కీ (మంచు విష్ణు) దురదృష్టవంతుడు. అతని దురదృష్టం కారణంగా అతని తండ్రి కూడా లక్కీతో మాట్లాడడు. అలాంటి లక్కీ ఓ రోజు పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. పద్మావతి ప్రతి విషయాన్ని మంచి కోణంలోనే ఆలోచించే మనస్తత్వం గల అమ్మాయి. కథ ఇలా సాగుతుండగా లక్కీ తన చెల్లి పెళ్ళి కోసం తీసుకెళ్తున్న డబ్బు సంచి ఎక్కడో పోతుంది. ఆ సంచిలో పాతిక లక్షల రూపాయలు ఉంటాయి. ఏం చేయాలో తెలియక లక్కీ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అంతో ఓ వ్యక్తి లక్కీకి ఓ సంచి ఇచ్చి దాన్ని ఓ రోజు జాగ్రత్తగా దాస్తే కోటి రూపాయలిస్తానని చెబుతాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆ సంచిలో ఏముంటుంది? లక్కీకి కోటి రూపాయలు వచ్చిందా? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.[1]

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
 • రావేరా , రచన: కృష్ణకాంత్, గానం.లీప్సికా, రేవంత్
 • ఐసాలాగా , రచన: పల్లవి గీత పూట్నిక్ , శ్రీజో, గానం.మోహన భోగరాజు, సింహా, ప్రవీణ్ లక్కరాజు
 • వాట్ డాఫ్, రచన: శ్రీజో, గానం. అధనాన్ సామి, ప్రవీణ్ లక్కరాజు
 • ఓ సిరిమల్లె , గానం.బప్పిలహరి , అనురాగ్ కులకర్ణి .

సాంకేతికవర్గం

మార్చు
 • నిర్మాణ సంస్థ:ఎం.వి.వి.సినిమా
 • సంగీతం: అచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు
 • కళ: చిన్నా
 • సినిమాటోగ్రఫీ: పి.జి. వింద
 • స్క్రీన్‌ప్లే, మాటలు: డైమండ్‌ రత్నబాబు
 • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్‌
 • నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
 • కథ, దర్శకత్వం: రాజ్‌కిరణ్‌

మూలాలు

మార్చు
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-01-28. Retrieved 2017-02-03.
 2. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.