హన్సిక మోత్వానీ

సినీ నటి
(హన్సికా మోట్వాని నుండి దారిమార్పు చెందింది)

హన్సికా మోత్వాని (మరాఠీ: हंसीका मोटवानी), భారతీయ సినిమా నటి, మాజీ బాల్యనటి

హన్సికా మోట్వాని

జన్మ నామంహన్సికా ప్రదీప్ మోత్వాని
జననం (1991-08-09) 1991 ఆగస్టు 9 (వయసు 32)
ముంబాయి,మహారాష్ట్ర
క్రియాశీలక సంవత్సరాలు 2001-ప్రస్తుతం
భార్య/భర్త సోహైల్‌ కతూరియా

వ్యక్తిగత జీవితం సవరించు

ముంబాయిలో జన్మించిన హన్సికా మోత్వాని ప్రస్తుతం పొద్దర్ అంతర్జాతీయ పాఠశాల ఏ లెవెల్లో 12వ తరగతి చదువుతున్నది. హన్సిక తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తుళు భాషలు మాట్లాడగలదు. ఈమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపరస్తుడు, తల్లి మోనా మోత్వానీ ప్రసిద్ధి చెందిన చర్మవైద్యురాలు (డెర్మటాలజిస్ట్). వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ప్రస్తుతము హన్సిక సంరక్షణా బాధ్యతలను తల్లి మోనా చూసుకొంటున్నది.

వివాహం సవరించు

హన్సిక మోత్వానీ 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో రాజస్థాన్‌ జైపూర్‌లో వివాహం జరిగింది.[1]

నట జీవితం సవరించు

 • హన్సిక చాలా సీరియళ్లలోను, సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్.. హమ్ దో హై.. వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది.
 • అవే కాకుండా హవా, కోయ్ మిల్ గయా, అబ్రక దబ్రా, జాగో.. వంటి సినిమాల్లో కూడా కనిపించింది.
 • 2007లో పూరీజగన్నాధ్ తీసిన 'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది.
 • తర్వాత 2008లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన 'కంత్రీ'లో ఆడిపాడింది. రామ్‌తో 'మస్కా' చిత్రంలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. తర్వాత ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాలో 'ప్రియ'గా గెస్ట్ రోల్‌లో నటించింది.
 • 'జయీభవ'తో కల్యాణ్‌రామ్‌తో జతకట్టినా ఆ చిత్రం వూహించిన అంచనాలను చేరుకోలేకపోయింది. తర్వాత నితిన్‌తో 'సీతారాముల కల్యాణం'లో నటించింది. అది కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దాంతోతన దృష్టిని తమిళ పరిశ్రమ వైపు మళ్లించింది.
 • అలా 2011లో 'మాప్పిళ్త్లె' సినిమాతో తమిళంలో బోణీ కొట్టినా విజయం మాత్రం దక్కలేదు. అయినా వెనుకడుగేయకుండా హిట్ కోసం పట్టు బట్టి మరీ తమిళంలో సినిమాలు చేస్తూనే వచ్చింది.
 • తమిళంలో విజయ్ సరసన నటించిన 'వెలాయుధం' సినిమాతో విజయాన్ని అందుకుంది.
 • అటు తమిళంలో సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు సినిమాల పైనా దృష్టి సారించింది. 'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్', 'దేనికైనా రెడీ..', 'సమ్‌థింగ్.. సమ్‌థింగ్..' వంటి సినిమాలతో తెలుగు ప్రజల్ని పలకరిస్తూ.. హిట్‌లను తన ఖాతాలో జమ చేసుకుంది.
 • కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా 'ఆప్ కా సరూర్' సినిమాతో ఈ అమ్మడి లక్‌ని పరీక్షించుకుంది. అక్కడ కూడా హిట్ కొట్టడంతో 'మనీ హై తో హనీ హై' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.
 • తన అందంతో ఎందరో కుర్రకారు మనసుల్ని ఉర్రూతలూగించిన హన్సిక తను శింభుకే సొంతమని అప్పట్లో ఓపెన్‌గా చెప్పేసింది. తమ గురించి హల్‌చల్ చేస్తున్న పుకార్లన్నిటికీ 'మేం లవ్‌లో ఉన్నమాట నిజమే' అంటూ ఫుల్‌స్టాప్ పెట్టేసిందీ జంట. కానీ, ఆ బంధం కాస్తా బెడిసికొట్టడంతో.. నా దృష్టంతా కెరీర్‌పైనే అని ప్రకటించింది.
 • కేవలం నటన పరంగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా కూడా హన్సికని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి పుట్టిన రోజుకీ ఒక అనాథ అమ్మాయి లేదా అబ్బాయిని దత్తత తీసుకుని ఆదరిస్తుందట! అలా ఈమె దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య 20కి పైగానే ఉంటుంది.
 • ఈమెకు పాలంటే అస్సలు నచ్చవట. ఏ మాత్రం తీరిక దొరికినా వంట చేయడానికి ఆసక్తి చూపిస్తుందట! అలాగే ప్రయాణం చేస్తూ లోకమంతా చుట్టిరావడమంటే చాలా ఇష్టమట. ఇంట్లో ఆమెకున్న పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ తన బ్రదరే అంటూ కితాబిచ్చేస్తోంది.
 • 2013లో విడుదలైన సింగం-2లో నటనకుగాను అందరి ప్రశంసలూ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తమిళంలో 'బిరియాని', 'వాలు', 'వెట్త్టె మన్నన్'.. వంటి ఆరు సినిమా ప్రాజెక్టులతో వూపిరి సలపనంత బిజీ బిజీగా ఉంది. 2014లో తెలుగులో కూడా ఒక సినిమా చేయడానికి అంగీకరించింది.

చిత్రసమాహారం సవరించు

బాల్యనటిగా ధారావాహికలలో సవరించు

 • హమ్ దో హైనా --- కరీనా, కోయల్
 • క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ --- సావ్రీ
 • షక లక బూమ్ బూమ్ --- కరుణ
 • దేశ్ మే నిక్లా హోగా చాంద్ --- టీనా

వ్యాపార ప్రకటనలు సవరించు

బాల్యనటిగా సవరించు

 • ఆబ్ర కా దబ్ర (2004 డిసెంబరు 24)
 • హమ్ కౌన్ హై (2004 సెప్టెంబరు 3) ...... సారా విలియమ్స్
 • జాగో (2004 ఫిబ్రవరి 6) ...... శృతి
 • కోయీ మిల్ గయా (2003 ఆగస్టు 8) ...... ది సూపర్ సిక్స్
 • హవా (2003 జూలై 4)
 • ఎస్కేప్ ఫ్రమ్ తాలిబాన్ (2003 ఫిబ్రవరి 14)...... గున్చా (సీమా మోట్వానీగా)

కథానాయకిగా సవరించు

సినిమా విడుదల తేదీ భాష సహనటులు ఇతరత్రా
దేశముదురు 2007 జనవరి 12 తెలుగు అల్లు అర్జున్
ఆప్ కా సురూర్ 2007 జూన్ 29 హిందీ హిమేష్ రేషమ్మియా
బిందాస్ 2008 ఫిబ్రవరి 15 కన్నడ పునీత్ రాజ్‌కుమార్
కంత్రి 2008 మే 9 తెలుగు జూనియర్ ఎన్.టి.ఆర్
మనీ హై తో హనీ హై 2008 జూలై 25 హిందీ గోవిందా
బిల్లా తెలుగు ప్రభాస్ అతిధిపాత్ర
మస్కా తెలుగు రామ్
కందిరీగ (సినిమా) తెలుగు రామ్
పవర్ (సినిమా) 2014 సెప్టెంబరు 12 తెలుగు రవితేజ
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ 2019 నవంబరు 15 తెలుగు సందీప్ కిషన్
మై నేమ్ ఈజ్ శృతి తెలుగు

మూలాలు సవరించు

 1. Namasthe Telangana (5 December 2022). "కళ్యాణ వైభోగమే". Archived from the original on 5 December 2022. Retrieved 5 December 2022.

బయటి లింకులు సవరించు