లక్ష్మి కాలువ

తెలంగాణ రాష్ట్రంలోని ఒక నీటి పారుదల కాలువ

లక్ష్మి కాలువ అనేది తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లాలోని ఒక నీటి పారుదల కాలువ.

లక్ష్మి కాలువ
విశేషాలు
పొడవు4 km (2.5 miles)

ఆయకట్టు

మార్చు

నిజామాబాదు జిల్లాలోని బాల్కొండ, మెండోర, ముప్కాల్‌, వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాలకు చెందిన పలు గ్రామాలలోని 25,763 ఎకరాల వ్యవసాయ భూములకు ఈ లక్ష్మి కాలువ ద్వారా సాగునీరు అందుతోంది.[1]

కాలువ వివరాలు

మార్చు

శ్రీరాంసాగర్ జలాశయం నుండి నిజామాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు దాదాపు 40 సంవత్సరాల క్రితం ఈ కాలువ తవ్వబడింది.[2] నిజామాబాద్ జిల్లాలోని ఏకైక కాలువ ఇది. బాల్కొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న లక్ష్మి కాలువ పొడవు 4 కిలో మీటర్లు కాగా దీనికి నాలుగు డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి.

సాగునీటి తరలింపు

మార్చు

బాల్కొండ నియోజకవర్గంలోని కొత్తపల్లి వరకు ప్రధాన కాల్వగా, అక్కడి నుంచి చిన్న, చిన్న కాల్వల ద్వారా మిగతా గ్రామాల్లోని పంటలకు సాగునీరును తరలిస్తున్నారు. 14.12 క్యూమెక్స్ (500 క్యూసెక్కులు) హెడ్ డిశ్చార్జితో ఈ కాలువ ద్వారా వివిధ మండలాల్లోని 63 చెరువులు తాగు, సాగునీటి కోసం నింపబడ్డాయి.[3]

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2023-04-08). "లక్ష్మి కాలువ.. సాగు భళా." www.ntnews.com. Archived from the original on 2023-04-08. Retrieved 2023-06-29.
  2. telugu, NT News (2021-10-13). "ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న 40వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో." www.ntnews.com. Archived from the original on 2023-06-29. Retrieved 2023-06-29.
  3. "'లక్ష్మి' ఆయకట్టును కరుణించరూ..!". Sakshi. 2023-06-08. Archived from the original on 2023-06-29. Retrieved 2023-06-29.