లక్ష్మీ బ్యారేజి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ

లక్ష్మీ బ్యారేజి (మేడిగడ్డ బ్యారేజి) కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ.[1] గోదావరి నదిలోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా లక్ష్మీ బ్యారేజి నిర్మించబడింది. దీని పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు.

లక్ష్మీ బ్యారేజి
లక్ష్మీ బ్యారేజి is located in Telangana
లక్ష్మీ బ్యారేజి
లక్ష్మీ బ్యారేజి
లక్ష్మీ బ్యారేజి is located in India
లక్ష్మీ బ్యారేజి
లక్ష్మీ బ్యారేజి (India)
ప్రదేశంమేడిగడ్డ, మహాదేవపూర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
అక్షాంశ,రేఖాంశాలు18°42′13.8″N 80°05′21″E / 18.703833°N 80.08917°E / 18.703833; 80.08917
స్థితివాడుకలో ఉంది
నిర్మాణం ప్రారంభం2016 మే 2
ప్రారంభ తేదీ2019, జూన్ 21
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజి
నిర్మించిన జలవనరుగోదావరి నది
Spillways68
జలాశయం
సృష్టించేదిలక్ష్మీ బ్యారేజి
మొత్తం సామర్థ్యం16.17 టీఎంసీలు
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుతెలంగాణ రాష్ట్రం
Typeబ్యారేజి

ప్రాజెక్టు వివరాలు మార్చు

2016 మే 2న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజి పనులకు శంకుస్థాపన చేశారు.[2] గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 16,50,000 ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా కరీంనగర్ జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్‌ చేశారు.[3]

అంచనా బ్యారేజి వివరాలు:

బ్యారేజి బెడ్ స్థాయి (మీటర్లు) చెరువు స్థాయి (మీటర్లు) స్థూల నిల్వ (TMC లో) గేట్ల సంఖ్య
లక్ష్మీ బ్యారేజి 89.0 100.0 16.17

ప్రారంభం మార్చు

2019, జూన్ 21న ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది. లక్ష్మీ బ్యారేజీ వద్ద పూజ, హోమ క్రతువు జరిపిన తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్ దగ్గర ప్రారంభోత్సవంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మూడు పంపులను ప్రారంభించారు.[4]

నీటి విడుదల మార్చు

  • 2019 నవంబరు 21 నుండి పూర్తిస్థాయిలో ఈ బ్యారేజీ గేట్లను మూసివేసి నీటిని నిలువ చేయడంతో 2020 ఫిబ్రవరి 17న ఈ బ్యారేజీలో మొదటిసారిగా నీటిమట్టం దాదాపు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. దాంతో 11 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోశారు.[5]
  • 2022 జూలై 9న ఈ ప్రాజెక్టులోకి వరద భారీగా చేరి ఇన్‌ఫ్లో 2,26,300 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో నాలుగు లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. దాంతో 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.[6]
  • 2022 జూలై 14న ఈ ప్రాజెక్టులోకి వరద భారీగా చేరి 98,550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద రూపంలో వస్తుండగా బ్యారేజీలోని 84 గేట్లకుగాను 36 గేట్లు ఎత్తి 1,01,218 క్యూసెక్కుల అవుట్‌ఫ్లోతో వరద నీటి దిగువకు విడుదల చేశారు.[7]

కుంగిన వంతెన మార్చు

మేడిగడ్డ బ్యారేజీ వద్ద వంతెన పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా మహారాష్ట్రవైపు నుంచి 356 మీటర్ల దూరంలో 2023 అక్టోబరు 21న ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో తెలంగాణ - మహారాష్ట్రల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.[1][8]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "CM visit to Medigadda Laxmi Barrage - Sri K. Chandrashekar Rao". cm.telangana.gov.in/. Archived from the original on 2023-07-18. Retrieved 2023-07-18.
  2. 10టీవి (1 May 2016). "మేడిగడ్డకు పునాది రాయి..." Retrieved 25 November 2017.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  3. నవతెలంగాణ (30 Apr 2016). "మే 2 న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన". Archived from the original on 22 మే 2019. Retrieved 24 November 2017.
  4. "కాళేశ్వర సంబురం". ఈనాడు. 2019-06-15. Archived from the original on 2019-06-15.
  5. Velugu, V6 (2020-02-17). "కాళేశ్వరం: నీటితో నిండిన లక్ష్మి బ్యారేజ్". V6 Velugu. Archived from the original on 2020-02-17. Retrieved 2023-07-18.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. telugu, NT News (2022-07-10). "లక్ష్మీ బరాజ్‌ 57 గేట్లు ఎత్తివేత". www.ntnews.com. Archived from the original on 2022-07-11. Retrieved 2023-07-18.
  7. telugu, NT News (2023-07-14). "Lakshmi Barrage | లక్ష్మీ బరాజ్‌కు 98,550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. 36 గేట్లు ఎత్తివేత‌." www.ntnews.com. Archived from the original on 2023-07-18. Retrieved 2023-07-18.
  8. "Lakshmi Baraj | లక్ష్మీబరాజ్‌పై పేలుడు శబ్దం.. వివరణ ఇచ్చిన మేడిగడ్డ ఇరిగేషన్‌ ఈఈ తిరుపతిరావు-Namasthe Telangana". web.archive.org. 2023-10-22. Archived from the original on 2023-10-22. Retrieved 2023-10-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)