లజ్జా (నవల)
బంగ్లాదేశ్లో హిందువుల పై జరుగుతున్న దాడులు గురించి నాస్తిక రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్రాసిన నవల పేరు లజ్జ (Bengali: লজ্জা Lôjja) (Shame). ఈ నవలని బంగ్లాదేశ్లో నిషేధించడం జరిగింది. భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో ఈ నవలని నిషేధించారు. 1993లో బెంగాలీ భాషలో వ్రాసిన ఈ నవల మొదటి 6 నెలలలోనే 50,000 కాపీలు అమ్ముడుపోయింది. ఈ నవల రాసినందుకు ఆమె స్వంత దేశం బంగ్లాదేశ్ లోనే ఆమె వ్యతిరేకత ఎదుర్కొంది. మైనారిటీలైన హిందువులపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడిని నిరసిస్తూ ఈ నవల రాశారామె.
ఈ నవల తస్లీమా దక్షిణ ఆసియా (భారతదేశం, పాకిస్థాన్,బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు)కు అంకితం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "మానవత్వం అనే ఇంకొక మత ఆవశ్యకత ఉంది" అన్నారు.
నేపథ్యం
మార్చులజ్జ నవల హిందువులపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లపై తస్లీమా నస్రీన్ ఘాటైన ప్రతిస్పందన. డిసెంబరు 6 1992లో భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన అత్యాచారాలను ఆమె ఈ నవల రూపంలో తెచ్చారు. ఈ పుస్తకంలో లౌకికవాదం ఎలా మరుగునపడిపోతోంది అన్న విషయాన్నే ఎక్కువ చర్చిస్తుంది.
కథా సారాంశం
మార్చుఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో డిసెంబర్ 6 1992లో బాబ్రీమసీదు కూల్చివేత జరగడం వల్ల బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులతో మొదలవుతుంది ఈ నవల. ఈ దాడులతో కలవరపడిన బంగ్లాదేశ్కు చెందిన చాలా హిందూ కుటుంబాలు భారతదేశానికి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ దేశభక్తి పరులైన దత్తా కుటుంబ పెద్ద మాత్రం అక్కడే నివాసం కొనసాగించడానికి నిర్ణయించుకుంటారు. కానీ ఇంటిలోని మిగిలిన వారు ఒకొక్కరూ ఒక్కో రకంగా ఆలోచిస్తుంటారు.
ఆ కుటుంబ తండ్రి, సుధామొయ్ దేశభక్తుడు. తన మాతృదేశాన్ని విడిచివెళ్ళనని కచ్చితంగా ఉండే మనిషి. ఆమె భార్య కిరణ్మయి కూడా భర్తను అనుసరిస్తుంది. వారి కొడుకు సురంజన్ మొదట్లో తానూ దేశభక్తుడే కానీ ఆ దేశంలో జరిగే మారణకాండకు చెలించిపోతాడు. తమ కూతురు నిలంజనను రక్షించుకోవడానికి ముస్లిం స్నేహితుల ఇళ్ళలో దాచుకునే స్థితిలో కూడా వారు దేశాన్ని విడిచి రావలనుకోరు. కానీ నీల తన ఇంట్లో ఉండగా కొంతమంది దుండగుల చేత అపహరించబడుతుంది. ఆఖరికి ఆమెను దారుణంగా అత్యాచారం చేసి, చంపబడుతుంది. ఎన్నో తీవ్రమైన భావోద్వేగాల మధ్య దత్తా కుటుంబం తమ మాతృదేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకోవడంతో నవల ముగుస్తుంది.
అనువాదాలు
మార్చులజ్జ నవల దాదాపు 25 భాషలలో అనువాదింపబడింది. ఫ్రెంచి, జర్మన్, ఇంగ్లీషు, స్పానిష్, ఇటాలియన్, స్వీడిష్, నార్వేజియన్, ఫిన్నిష్, ఐస్ లాండిక్, పెర్షియన్, అరబిక్, అస్సామీ, కన్నడ, హిందీ, గుజరాతీ, ఒరియా, ఉర్దూ, మరాఠీ, తెలుగు, తమిళ్, నేపాలీ, మలయాళం, సింహళ భాషలలో ఈ పుస్తకం దొరుకుతుంది.