లడఖ్ పర్వత శ్రేణి

లడఖ్ పర్వత ప్రాంతాలలో ఉన్న పర్వత శ్రేణులు.

లడఖ్ పర్వత శ్రేణి లడఖ్ ప్రాంతపు మధ్య భాగంలో ఉన్న పర్వత శ్రేణి. ఇది సింధు, ష్యోక్ నదీలోయల మధ్య 370 కి.మీ. పొడవున విస్తరించి ఉంది.[1] లడఖ్ రాజధాని నగరం లేహ్, సింధు నదీ లోయలో, లడఖ్ శ్రేణి పాదాల వద్ద ఉంది.

లడఖ్ పర్వత శ్రేణి
లడఖ్ పర్వత శ్రేణి
భౌగోళికం
లడఖ్ పర్వత శ్రేణి is located in Ladakh
లడఖ్ పర్వత శ్రేణి
లడఖ్ పర్వత శ్రేణి
34°40′N 76°53′E / 34.66°N 76.88°E / 34.66; 76.88
లడఖ్ పర్వత శ్రేణి is located in India
లడఖ్ పర్వత శ్రేణి
లడఖ్ పర్వత శ్రేణి
లడఖ్ పర్వత శ్రేణి (India)

భౌగోళికం

మార్చు

లడఖ్ శ్రేణిని కారకోరం పర్వత శ్రేణికి దక్షిణాన కొనసాగింపుగా భావిస్తారు, ఇది బల్టిస్తాన్లోని సింధు, ష్యోక్ నదుల సంగమ స్థానం నుండి ఆగ్నేయ లడఖ్‌లో టిబెట్ సరిహద్దు వరకు 370 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది.[1][2] లడఖ్ శ్రేణికి దక్షిణాన పొడిగింపుగా ఉన్న పర్వతాలను కైలాస్ శ్రేణి అని పిలుస్తారు -ముఖ్యంగా టిబెట్‌లో.[3]

లడఖ్ శ్రేణి సింధు నదికి ఈశాన్య తీరంగాను, ష్యోక్ నదికి పశ్చిమ తీరంగానూ ఉంది.[4]

లడఖ్ శ్రేణి సగటు ఎత్తు 6,000 మీటర్లు. ఇందులో పెద్దపెద్ద శిఖరాలేమీ లేవు. దాని శిఖరాలలో కొన్నిటి ఎత్తు 4,800 మీటర్ల కన్నా తక్కువే.[5]

ప్రధాన కనుమలు చోర్బాట్ (5,090 మీటర్లు), దిగర్ లా (5,400 మీటర్లు), ఖార్దుంగ్ లా (5,602 మీటర్లు), చాంగ్ లా (5,599 మీటర్లు), ట్సాకా లా (4,724 మీటర్లు).[1]

ఆవాసాలు

మార్చు
 
లేహ్ నగరం లడఖ్ శ్రేణిలోని ఒక లోయలో ఉంది
 
లడఖ్, జాన్స్కర్ శ్రేణులతో మధ్య లడఖ్

ఖార్దుంగ్ లా లోయ వెంట సింధు నది నుండి కొంచెం దూరంలో ఉన్న లేహ్ నగరం, ఈ శ్రేణిలో ఉన్న మానవావాసాల్లో ముఖ్యమైనది. ఒక వైపు యార్కండ్, టిబెట్ లకూ, మరోవైపు శ్రీనగర్, భారత ఉపఖండంలోని మిగిలిన ప్రాంతాలకూ వాణిజ్య మార్గాలు కలిగిన చారిత్రిక వాణిజ్య పట్టణం ఇది. లేహ్ నుండి యార్కండ్ వరకు ఉన్న వేసవి మార్గం, ఖార్దుంగ్ లా గుండా నుబ్రా లోయ లోకి వెళ్లి, అక్కడ నుండి కారకోరం కనుమ, సుగేట్ కనుమ (ట్రాన్స్-కరాకోరం ట్రాక్ట్‌లో) ల గుండా యార్కండ్‌కు వెళ్తుంది. శీతాకాల మార్గం దిగర్ లా గుండా షియోక్ నది లోయకు చేరి, అక్కడినుండి కారకోరం కనుమకు వెళ్తుంది. టిబెట్‌కు వెళ్ళే వాణిజ్య మార్గం సింధు నది లోయలో, కైలాస్ శ్రేణి పాదాల వద్ద ఉన్న గార్టోక్ మీదుగా వెళ్తుంది. [6] 1684 లో కుదిరిన టింగ్మోస్గాంగ్ ఒప్పందం ద్వారా, టిబెట్ లో లభించే పష్మినా ఉన్ని వ్యాపారం చేయడానికి లడఖ్‌కు ప్రత్యేక హక్కు లభించిది. ఈ హక్కు, లడఖ్‌లో సంపద వృద్ధికి దారితీసింది. [7]

లేహ్, శతాబ్దాలుగా చక్కటి పష్మినా ఉన్నికి వాణిజ్య కేంద్రంగా ఉండేది (ఒకప్పుడు అది బంగారం లాగా ఎంతో విలువైనది). యాక్, పోనీల బిడారులు టిబెట్ నుండి పష్మినా తెచ్చేవి. యార్కండ్, కష్గర్‌ల నుండి మణులు, పగడాలు, వెండి, సుగంధ ద్రవ్యాలూ కాశ్మీర్ నుండి పట్టు, మిగతా భారతదేశం నుండి బట్టలూ తీసుకు వచ్చేవి.

ఇద్దరు ఆంగ్ల అన్వేషకులు, విలియం మూర్‌క్రాఫ్ట్, జార్జ్ ట్రెబెక్ 1820 లో లేను సందర్శించారు. తడారిపోయిన ఎడారి భూమి మధ్యలో ఉన్న ఈ సంపద్వంతమైన పట్టణాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు.

లడఖ్ శ్రేణిలో జీవించే సంచార చాంగ్పా ప్రజలు, జీవనోపాధి కోసం ఎక్కువగా గొర్రెలు, యాక్ పశువుల పెంపకంపై ఆధారపడతారు. టిబెట్ లోని చాంగ్ టాంగ్ మైదానం, హిమాలయాలలోకెల్లా చాలా మారుమూల విభాగం. చాలా ఎత్తైన ప్రదేశం. ఇక్కడి లోయలు సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తున ఉంటాయి.

లడఖ్ ఒక అందమైన ఎడారి ప్రాంతం. సాంస్కృతికంగా / భౌగోళికంగా టిబెట్‌కు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ, తీవ్రమైన వాతావరణానికి తోడు సహజ వనరులు చాలా తక్కువ. బౌద్ధ లడఖీలకు ఇక్కడి పర్యావరణంపై సన్నిహిత పరిజ్ఞానం ఉంటుంది, మంగోలులు (మధ్య ఆసియా నుండి), బాల్టీలు (పడమటి నుండి), డోగ్రాలు (దక్షిణం నుండి), టిబెటన్లు (తూర్పు నుండి) శతాబ్దాలుగా దండయాత్రలు చేస్తూ ఉన్నప్పటికీ వీళ్ళు మనుగడ సాగించడమే కాక, చక్కగా వర్ధిల్లారు కూడా. మిశ్రమ జాతి మూలాలు వారి ముఖాల్లో ప్రతిబింబిస్తాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Negi, Discovering the Himalaya, Volume 1 1998, p. 14.
  2. Ladakh Range, Encyclopedia Britannica, retrieved 22 April 2018.
  3. Mehra, An "agreed" frontier 1992, end papers.
  4. Mehra, An "agreed" frontier 1992, p. 15.
  5. Kaul, Rediscovery of Ladakh 1998, p. 17.
  6. Warikoo, India's gateway to Central Asia 2009, p. 1.
  7. Warikoo, India's gateway to Central Asia 2009, p. 4.