లతీఫ్ సాహెబ్ దర్గా
లతీఫ్ సాహెబ్ దర్గా తెలంగాణ రాష్ట్రం, నల్గొండ పట్టణంలోని లతీఫ్‌షా గుట్టపై ఉన్న దర్గా. వెయ్యేండ్ల చరిత్ర కలిగి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ దర్గా వద్ద ప్రతి శుక్రవారం, ఆదివారం కందూరు నిర్వహించబడుతుంది.[1]
లతీఫ్ సాహెబ్ దర్గా | |
---|---|
పేరు | |
ప్రధాన పేరు : | లతీఫ్ సాహెబ్ దర్గా |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నల్లగొండ జిల్లా |
ప్రదేశం: | నల్లగొండ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సయ్యద్ హజ్రత్ లతీఫుల్లాఖాద్రీ |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ముస్లీం |
చరిత్ర
మార్చుఇరాక్ దేశపు రాజధాని బాగ్దాద్ నగరానికి చెందిన లతీఫుల్లాఖాద్రీ అనే మత గురువు తమ మతప్రచారం చేసేందుకు, ప్రజలకు మంచి బోధనలు చేయడానికి సా.శ. 960 నుండి 1050 సంవత్సరాల మధ్యకాంలో నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి వచ్చాడు. కొంతకాలం తరువాత నల్లగొండ పట్టణానికి వచ్చి అక్కడి గుట్టపైన నివాసం ఏర్పాటుచేసుకున్నాడు. అలా అక్కడ అతను అనేక సంవత్సరాలు ఉండడంవల్ల ఆ గుట్టకు లతీఫ్‌షా గుట్ట అని పేరు వచ్చింది. లతీఫ్ చెప్పే బోధనలు వినడానికి భక్తులు 500 మెట్లు సులభంగా ఎక్కి గుట్టపైకి వచ్చేవారు. అలా మత బోధనలు చేస్తూ కొతంకాలం గడిచిన తరువాత లతీఫ్‌షా, అతని అన్నకుమారులైన ఎస్‌కె అల్లావుద్దీన్, ఎస్‌కె ఫరీద్‌లు గుట్టపైనే సమాధి అయ్యారు.
ఉర్సు ఉత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో వారం రోజులపాటు దర్గా కింద మెట్ల వద్ద ఉర్సు ఉత్సవాలు నిర్వహించబడుతాయి..[2] ఉమ్మడి హైదరాబాదు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన భక్తులతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలకు చెందినవారు కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో బెంగుళూరు కవ్వాళి బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉర్సు తొలిరోజున హైదరాబాద్ రోడ్డులో ఉన్న మదీనా మసీదు నుండి గంధాన్ని ఊరేగింపుగా లతీఫ్‌షా గుట్టపై ఉన్న దర్గా వద్దకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు తీసుకెళ్తారు. 60ఏండ్లుగా లతీఫ్‌షా దర్గా చైర్మన్లుగా హిందూ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఉండడం ఇక్కడి విశేషం.
మూలాలు
మార్చు- ↑ నవ తెలంగాణ, నల్లగొండ (21 January 2017). "మత సామరస్యానికి ప్రతీక లతీఫ్‌సలాబ్ ఉర్సు". Archived from the original on 10 May 2019. Retrieved 10 May 2019.
- ↑ The Hindu, Andhra Pradesh (9 March 2012). "Urs begins on colourful note". Retrieved 10 May 2019.