లయాన్ పార్కు, యెరెవాన్

లయాన్ పార్కు (ఆంగ్లం:Lyon park (ఆర్మేనియన్:లయోని ఐగి))ను, ప్రముఖంగా టోక్మాఖ్ అని పిలుస్తారు (ఆర్మేనియన్:Թոխմախ). ఇది ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో ఉన్న ఒక ప్రజా పార్కు. ఇది రాజధానిలో తూర్పున ఉన్న ఎరెబుని జిల్లాలో 17 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 8 హెక్టార్ల విస్తీర్ణంలో వర్దావర్ అని పిలిచే ఒక కృత్రిమ సరస్సు ఉంది.

లయాన్ పార్కు
యెరెవాన్ లయాన్ పార్కు, వర్దావర్ సరస్సు
రకంసార్వజనికం
స్థానంఎరెబుని జిల్లా, యెరెవాన్, ఆర్మేనియా
అక్షాంశరేఖాంశాలు40°19′14″N 44°31′37″E / 40.32056°N 44.52694°E / 40.32056; 44.52694
విస్తీర్ణం17 హెక్టారులు
నవీకరణక్రీ.పూ. 8వ దశాబ్దం (నిర్మాణం)
జులై 2011 (పునఃప్రారంభం)
నిర్వహిస్తుందియెరెవాన్ నగర కౌన్సిలు
స్థితిఏడాది పొడుగునా తెరిచే ఉంటుంది

2010-2011 మధ్యలో, పార్కును లియోన్ సిటీ కౌన్సిల్ పూర్తిగా  పునర్నిర్మించారు. దీనిని జూలై 2011 లో, అప్పటి లియోన్ మేయరు గెరార్డ్ కొల్లంబో, యెరెవాన్ మేయరు కరెన్ కరాపిటీన్ సమక్షంలో ప్రారంభించారు. లియోన్ నగరం పేరిట ఈ పార్కు పేరును మార్చారు. ఇది రెండు నగరాల మధ్య భాగస్వామ్య చిహ్నంగా మారింది.[1]

వర్దావర్ సరస్సు మార్చు

ఈ సరస్సు మూలాలు క్రీ.పూ. 8 వ శతాబ్దంలో రాజా అర్గేషిటీ I కాలం నాటివి. 1578వ సంవత్సరంలో, ఈ సరస్సును యరెవాన్ కు చెందిన టర్కిక్ పాలకుడు మెహ్మెత్ ఖాన్ టోఖ్మాఖ్ కాలంలో పునర్నిర్మించారు. అప్పటినుంచి దీన్ని టోక్మాఖ్ సరస్సు అని పిలిచేవారు. సోవియట్ కాలంలో, ఈ సరస్సును కమ్యూనిస్ట్ పార్టీ యువజన విభాగం పేరిట పిలిచేవారు. 2000వ సంవత్సరం నుండి, సరస్సును ప్రస్తుతమున్న పేరుతో పిలుస్తున్నారు.[2]

8 హెక్టార్ల నీటి ఉపరితల విస్తీర్ణం కలిగిన ఈ సరస్సును తరచుగా విండ్‌సర్ఫింగ్ ప్రేమికులు ఉపయోగిస్తూంటారు.

గ్యాలరీ మార్చు

 
లయన్ పార్కు లోని వర్దావర్ సరస్సు

మూలాలు మార్చు

  1. "Lyon park at Erebuni". Archived from the original on 2018-06-19. Retrieved 2018-07-06.
  2. "Lakes in Yerevan" (PDF). Archived from the original (PDF) on 2012-09-06. Retrieved 2018-07-06.