లలితా పవార్
లలితా పవార్ (1916 ఏప్రిల్ 18 - 1998 ఫిబ్రవరి 24) మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. హిందీ, మరాఠీ, గుజరాతీ సినిమారంగాలలో దాదాపు 700 సినిమాలలో నటించింది. తన 70 ఏళ్ళ నటనా జీవితంలో గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అనారీ సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. భల్జీ పెంధార్కర్ రూపొందించిన నేతాజీ పాల్కర్ (1938), న్యూ హనా పిక్చర్స్ సంత్ దామాజీ, విఎస్ ఖండేకర్ రాసిన నవయుగ్ చిత్రపత్ వారి అమృత్, ఛాయా ఫిల్మ్స్ వారి గోరా కుంభార్ వంటి హిట్ సినిమాలలో నటించింది. అనారి (1959), శ్రీ 420, మిస్టర్ & మిసెస్ 55, రామానంద్ సాగర్ టెలివిజన్ ఎపిక్ సీరియల్ రామాయణంలో మంథర పాత్రలో ప్రసిద్ధి పొందింది.[1]
లలితా పవార్ | |
---|---|
జననం | అంబా లక్ష్మణ్ రావు సగుణ్ 1916 ఏప్రిల్ 18 యోలా, నాశిక్ జిల్లా, మహారాష్ట్ర |
మరణం | 1998 ఫిబ్రవరి 24 | (వయసు 81)
క్రియాశీల సంవత్సరాలు | 1928-1997 |
పిల్లలు | 1 |
పురస్కారాలు | 1960: ఉత్తమ సహాయ నటి ఫిల్మ్‌ఫేర్ అవార్డు - అనారీ (1959) 1961: సంగీత నాటక అకాడమీ అవార్డు - నటన |
జననం
మార్చులలితా పవార్ (అంబా లక్ష్మణ్ రావు సగుణ్) 1916 ఏప్రిల్ 18న నాసిక్‌లోని యోలాలో ఒక సనాతన కుటుంబంలో జన్మించింది.[2] తండ్రి లక్ష్మణ్ రావ్ షగుణ్ గొప్ప పట్టు, పత్తి ముక్కల వ్యాపారి.[3]
సినిమారంగం
మార్చుతన తొమ్మిదేళ్ళ వయసులో రాజా హరిశ్చంద్ర (1928) చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తరువాత ఏడు దశాబ్దాల సినిమా జీవితంలో 1940ల సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించింది. 1932లో కైలాష్ అనే మూకీ సినిమాకు సహ-నిర్మాత వ్యవహరించడంతోపాటు సినిమాలో నటించింది. ఆ తర్వాత 1938లో దునియా క్యా హై అనే టాకీ సినిమాను కూడా నిర్మించింది.
1942లో, జంగ్-ఎ-ఆజాదీ సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగా, కొత్త నటుడు మాస్టర్ భగవాన్ లలితను గట్టిగా కొట్టాడు. దాంతో ముఖ పక్షవాతం వచ్చి, ఎడమ కంటి సిర పగిలిపోయింది. మూడు సంవత్సరాల చికిత్స తీపుకున్న తర్వాత, లలిత ఎడమ కన్ను చూపు కోల్పోయింది. అప్పుడు ప్రధాన పాత్రలను మానేసి, క్యారెక్టర్ రోల్స్‌కు మారవలసివచ్చింది. అయినప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఖ్యాతిని సంపాదించింది.[4]
లలిత ముఖ్యంగా తల్లి, అత్త పాత్రలలో ప్రసిద్ధి చెందింది. రాజ్ కపూర్‌తో అనారీ (1959)లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకుంది.[5] రామానంద్ సాగర్ టెలివిజన్ ధారావాహిక రామాయణంలో మంథరగా నటించింది. 1961లో భారత సినిమా తొలి మహిళగా భారత ప్రభుత్వం సత్కరించింది.[6]
వ్యక్తిగత జీవితం
మార్చుగణపత్రావ్ పవార్‌తో లలిత మొదటి వివాహం జరిగింది. కానీ, ఆమె చెల్లెలితో అతని అనుబంధంతో విసిగిపోయిన లలిత, తర్వాత బొంబాయిలోని అంబికా స్టూడియోస్‌కు చెందిన సినీ నిర్మాత రాజ్‌ప్రకాష్ గుప్తాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం తన మనవడు సంజయ్ పవార్, తన భర్తతో కలిసి జుహులో నివసిస్తోంది. తన కుమారుడు జై పవార్ నిర్మాతగా కొనసాగుతూ మంజిల్ వంటి సినిమాల్లో లలితతో కలిసి పనిచేశాడు. తన కుమారుడు జై పవార్‌కు సంజయ్ పవార్, మనోజ్ పవార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.[7] 1998 ఫిబ్రవరి 24న పూణేలోని ఔంధ్‌లో మరణించింది.[8]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
1944 | రామ్ శాస్త్రి | ఆనందీబాయి (పీష్వా రఘునాథరావు భార్య) |
1950 | దహేజ్ | శ్రీమతి బిహారిలాల్ (సూరజ్ తల్లి) |
1951 | ది ఇమోర్టల్ సాంగ్ | వితాబాయి |
1952 | దాగ్ | శంకర్ (దిలీప్ కుమార్) తల్లి |
పర్చైన్ | బడి రాణి | |
1955 | శ్రీ 420 | గంగా మాయి |
మిస్టర్ & శ్రీమతి 55 | సీతా దేవి, అనిత అత్త | |
1957 | నౌ దో గయారా | |
1959 | అనారీ | శ్రీమతి ఎల్. డిసౌజ |
ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు | ||
సుజాత | గిరిబాల, బుయాజి/అత్త | |
1960 | ఝుమ్రూ | ఝుమ్రూ తల్లి |
జిస్ దేశ్ మే గంగా బేహ్తీ హై (1960) | ||
1961 | జంగ్లీ (సుబోధ్ ముఖర్జీ తీసిన చిత్రం) | శేఖర్ తల్లి |
హమ్ దోనో[9] | మేజర్ తల్లి | |
సంపూర్ణ రామాయణం | మంథర | |
మేమిడిది | ||
1962 | ప్రొఫెసర్ | సీతాదేవి వర్మ |
బనార్సీ తుగ్ | ||
1963 | సెహ్రా | అంగార తల్లి |
గ్రహస్తి | హరీష్ ఖన్నా సోదరి | |
ఘర్ బసకే దేఖో | శ్రీమతి శాంతా మెహ్రా | |
1964 | షరాబి | |
1966 | ఫూల్ ఔర్ పత్తర్ | శ్రీమతి జీవన్ రామ్ |
లవ్ ఇన్ టోక్యో | గాయత్రీ దేవి | |
ఖండన్ | ఫుఫీ | |
1967 | బూంద్ జో బాన్ గయీ మోతీ | షెఫాలీ తల్లి |
నూర్ జెహాన్ | ||
1968 | అంఖేన్ | మేడమ్/నకిలీ అత్త |
నీల్ కమల్ | ఠాకురైన్ | |
అబ్రూ | శ్రీమతి వర్మ | |
తీన్ బహురానియన్ | సీత తల్లి | |
1969 | మేరీ భాభి | గంగాజలి |
1970 | ఆనంద్ | మాట్రాన్ |
పుష్పాంజలి | రాణి సాహిబా | |
గోపి | లీలావతి దేవి | |
దర్పణ్ | డాడిమా | |
1971 | జ్వాలా | |
1972 | గావ్ హమారా షహెర్ తుమ్హారా | లజ్వంతి పాండే |
బొంబాయి నుండి గోవా | కాశీబాయి | |
1974 | హమ్రాహీ | |
నయా దిన్ నై రాత్ | మెంటల్ హాస్పిటల్ పేషెంట్ (ప్రత్యేక ప్రదర్శన) | |
దూశ్రీ సీత | ||
1976 | ఆజ్ కా యే ఘర్ | శ్రీమతి శాంతి దీనానాథ్ |
తపస్య | శ్రీమతి వర్మ | |
1977 | జై వెజయ్ | నందిని |
ప్రాయశ్చిత్ | ||
ఐనా | జాంకి | |
1979 | మంజిల్ | శ్రీమతి చంద్ర (అజయ్ తల్లి) |
1980 | యారణ | తల్లి |
కాళీ ఘట | అంబు, హౌస్ కీపర్ | |
ఫిర్ వోహీ రాత్ | హాస్టల్ వార్డెన్ | |
సౌ దిన్ సాస్ కే | భవానీ దేవి (ప్రకాష్ తల్లి) | |
1981 | నసీబ్ | శ్రీమతి గోమ్స్ |
1983 | ఏక్ దిన్ బహు కా | కళావతి |
1986 | ప్యార్ కే దో పాల్ | |
ఘర్ సన్సార్ | సత్యనారాయణ తల్లి | |
1987 | వతన్ కే రఖ్వాలే | రాధ అమ్మమ్మ |
ఉత్తర్ దక్షిణ్ | ||
1988 | జల్జాలా | శిలా తల్లి |
ప్యసి ఆత్మ | ||
1989 | బహురాణి | |
1992 | ముస్కురాహత్ | లాండ్రీ మహిళ |
1997 | భాయ్[10] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | కార్యక్రమం | పాత్ర | ఛానల్ | మూలాలు |
---|---|---|---|---|
1987 | రామాయణం | మంథర | డిడి నేషనల్ |
అవార్డులు
మార్చు- 1960: ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - అనారి[11]
- 1961: సంగీత నాటక అకాడమీ అవార్డు - నటన[12]
మూలాలు
మార్చు- ↑ "Bollywood's most dangerous mother-in-law, a slap caused eye light". Aaj Tak. 24 February 2018.
- ↑ "Lalitha, an actress and a gentlewoman". Rediff.com. 26 February 1998. Retrieved 2022-07-10.
- ↑ "Tribute to Laita Pawar". Screen (magazine). Archived from the original on 2009-06-24. Retrieved 2022-07-10.
- ↑ "Lalita Pawar – Memories". cineplot.com.
- ↑ Anari Archived 19 సెప్టెంబరు 2008 at the Wayback Machine Indian Cinema, University of Iowa.
- ↑ "Lalita Pawar – Memories". cineplot.com.
- ↑ "Lalita Pawar." Indian Express. 26 February 1998.
- ↑ Sakshi (15 April 2024). "ఒక్క చెంపదెబ్బతో జీవితమే తలకిందులు.. సోదరి వల్ల భర్తకు విడాకులు!". Retrieved 16 April 2024.
- ↑ Filmography at Upperstall.com.
- ↑ Pawar, Lalita. "Lalita Pawar Filmography". Muvi. Archived from the original on 12 April 2012. Retrieved 7 May 2014.
- ↑ Awards Internet Movie Database.
- ↑ Sangeet Natak Akademi Award - Acting Archived 27 జూలై 2011 at the Wayback Machine Official listing at కేంద్ర సంగీత నాటక అకాడమీ Official website.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లలితా పవార్ పేజీ
- లలితా పవార్ బాలీవుడ్ హంగామా లో లలితా పవార్ వివరాలు
- లలితా పవార్ కి నివాళి Archived 2009-06-24 at the Wayback Machine స్క్రీన్ మ్యాగజైన్
- లివింగ్ ది రోల్ - లలితా పవార్ దిహిందూ
- లలితా పవార్ తో ముఖాముఖి సినీప్లాట్.కాం