లలిత్ నగర్
లలిత్ నగర్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో టిగాన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
లలిత్ నగర్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | కృష్ణన్ పాల్ గుర్జార్ | ||
---|---|---|---|
తరువాత | రాజేష్ నగర్ | ||
నియోజకవర్గం | టిగాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
సంతానం | అభిలాష్ నగర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చులలిత్ నగర్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో టిగాన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కృష్ణన్ పాల్ గుర్జార్ చేతిలో818 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన 2014 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేష్ నగర్‌పై 2,938 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. లలిత్ నగర్ 2019 కాంగ్రెస్ అభ్యర్థిగా, 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో[3] స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేష్ నగర్ చేతిలో ఓడిపోయాడు.[4]
మూలాలు
మార్చు- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Hindustantimes (19 September 2019). "Haryana Assembly Polls: Lalit Nagar, Tigaon MLA". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
- ↑ The Tribune (12 September 2024). "Congress ignores top contenders, fields newcomers from Ballabhgarh, Tigaon" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Elections 2024 - Tigaon". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.