లాన్స్ క్లూసెనర్

లాన్స్ క్లూసెనర్ (జననం 1971 సెప్టెంబరు 4) అంతర్జాతీయ క్రికెట్ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. ఆయన తన బ్యాటింగ్ తీరు, ఫాస్ట్-మీడియం స్వింగ్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ఆయన 1990లు, 2000ల ప్రారంభంలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్-రౌండర్‌లలో ఒకడు. అలాగే ఫినిషర్‌గా పవర్ బ్యాటింగ్‌లో అగ్రగామిగా నిలిచాడు.[1][2] భీకర బ్యాటింగ్, డెక్‌ను గట్టిగా కొట్టగల సామర్థ్యం, క్రంచ్ పరిస్థితులలో వికెట్లు తీయగల సామర్థ్యం, భాగస్వామ్యాలను విచ్ఛిన్నం చేయగల సామర్థ్యం ఇలా అన్నీ ఆయన సొంతం.[3]

లాన్స్ క్లూసెనర్
2023లో లాన్స్ క్లూసెనర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లాన్స్ క్లూసెనర్
పుట్టిన తేదీ (1971-09-04) 1971 సెప్టెంబరు 4 (వయసు 52)
డర్బన్, నాటల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
మారుపేరుజులు
ఎత్తు1.75 m (5 ft 9 in)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడి చేయి ఫాస్ట్ బౌలింగ్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 265)1996 నవంబరు 27 - India తో
చివరి టెస్టు2004 ఆగష్టు 8 - Sri Lanka తో
తొలి వన్‌డే (క్యాప్ 40)1996 జనవరి 19 - England తో
చివరి వన్‌డే2004 సెప్టెంబరు 19 - West Indies తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.69
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991–2004KwaZulu Natal
2002Nottinghamshire
2004Middlesex
2004–2007Dolphins
2004–2008Northamptonshire (స్క్వాడ్ నం. 4)
2006–2008Royal Bengal Tigers
2010Mountaineers
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 49 171 197 324
చేసిన పరుగులు 1,906 3576 9,521 6,648
బ్యాటింగు సగటు 32.86 41.10 42.69 40.04
100లు/50లు 4/8 2/19 21/48 3/34
అత్యుత్తమ స్కోరు 174 103* 202* 142*
వేసిన బంతులు 6,887 7,336 31,735 13,459
వికెట్లు 80 192 508 334
బౌలింగు సగటు 37.91 29.95 30.40 31.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 6 20 8
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 4 0
అత్యుత్తమ బౌలింగు 8/64 6/49 8/34 6/49
క్యాచ్‌లు/స్టంపింగులు 34/– 35/– 99/– 82/-
మూలం: Cricinfo, 2016 14 February

జలు భాషలో పట్టు ఉన్నందున అతనికి జులు అని పేరు పెట్టారు. ఆయన రిటైర్మెంట్ తరువాత జులు, జోసా రెండు భాషలలోనూ క్రికెట్‌పై వ్యాఖ్యాతగా పేరుతెచ్చుకున్నాడు.

సెప్టెంబరు 2019లో, ఆయన ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు.[4]

జీవితం తొలి దశలో మార్చు

ఎంపంగేనికి ఉత్తరాన ఉన్న చెరకు పొలంలో లాన్స్ క్లూసెనర్ పెరిగాడు, జులు పిల్లలతో క్వాంబోనాంబిలో ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తరువాత డర్బన్ హై స్కూల్‌లో చదివాడు.[5] ఆయన మూడు సంవత్సరాల పాటు సైనిక సేవను అందించాడు. ఇది ఆయనకు బౌలింగ్‌కు మెళకువలకు దోహదపడింది. నాటల్ డెనిస్ కార్ల్‌స్టెయిన్ మేనేజర్ అతని బౌలింగ్‌లోని సామర్థ్యాన్ని గుర్తించాడు. ఆయనను ప్రొవిన్షియల్ నెట్స్‌కు హాజరు అవమని సిఫార్సు చేశాడు. ఆయన తర్వాత ఫస్ట్-క్లాస్ క్రికెట్ సీజన్‌లో నాటల్ విదేశీ ఆటగాడిగా వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మాల్కం మార్షల్ గుర్తించాడు.[6] దాంతో ఆయన 1993/94 సీజన్‌లో నాటల్ మొదటి XIలోకి డ్రాఫ్ట్ చేయబడ్డాడు. అంతేకాకుండా ఆయనకు మాల్కం మార్షల్ మెంటార్‌గా ఉన్నాడు.[7]

వ్యక్తిగత జీవితం మార్చు

లాన్స్ క్లూసెనర్ చేపలు పట్టడం ఆనందిస్తాడు. ఆయన ఆసక్తిగల వేటగాడు కూడా.[8] 28 సంవత్సరాల వయస్సులో ఆయన డర్బన్‌లో 2000 మే 13న ఇసాబెల్లె పోట్‌గీటర్‌ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు.[9]

ఆయన సింగపూర్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న బ్లాక్‌చెయిన్ ఆధారిత ప్లాట్‌ఫారమ్ అయిన క్రికెట్ ఫౌండేషన్ గుడ్విల్ భాగస్వాములలో ఒకడు.[10]

మూలాలు మార్చు

  1. "Lance Klusener: The ODI beast social media did not get to celebrate". Wisden (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-09-04. Retrieved 9 January 2023.
  2. "Lance Klusener - The ultimate finisher". sportslumo. Retrieved 9 January 2023.
  3. "Lance Klusener: The 'Zulu' who was one of the world's best all-rounders". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-09-04. Retrieved 2 May 2022.
  4. "Lance Klusener appointed head coach of Afghanistan". International Cricket Council. Retrieved 27 September 2019.
  5. Bacher, Ali; Williams, David (2013). Jacques Kallis and 12 Other Great South African All-rounders. ISBN 978-0143538325. Retrieved 27 July 2023.
  6. Kumar, K. C. Vijaya (2013-12-29). "The Marshall effect". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-05-02.
  7. "Malcolm Marshall: The Predator | Cricbuzz.com". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2022-05-02.
  8. Klusener prefers the smell of a goat to a dollar, The Guardian, 13 June 1999
  9. "Family Group Sheet for Lance KLUSENER / Isabella POTGIETER (F21871) : Ancestors Research South Africa". Ancestors.co.za. Retrieved 16 November 2021.
  10. "Akram, Laxman, Klusener join world's first crypto cricket platform 'CricketCrazy.io'". The New Indian Express. Retrieved 2 May 2022.