లింగాపురం (మాచర్ల)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, మాచెర్ల మండలానికి చెందిన గ్రామం

లింగాపురం పల్నాడు జిల్లా మాచెర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

లింగాపురం
—  రెవెన్యూయేతర గ్రామం.  —
లింగాపురం is located in Andhra Pradesh
లింగాపురం
లింగాపురం
అక్షాంశరేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం మాచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522426
ఎస్.టి.డి కోడ్ 08642

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

గ్రామంలో పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్ వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామ పంచాయతీ 1959 లో ఆవిర్భవించింది. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జి.మరియమ్మ, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-31వ తేదీ ఆదివారంనాడు, వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీ పోతురాజుస్వామివారి విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులే గాక, చుట్టుప్రక్కల గ్రామాల నుండి గూడా భక్తులు తరలిరవడంతో, ఆలయ ప్రాంగణం కిటకిటలాడినది. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులులు