లింగాపూర్ మండలం (కొమరంభీం జిల్లా)

తెలంగాణ, కొమరంభీం జిల్లా లోని మండలం

లింగాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 12 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 90 కి. మీ. దూరంలో కుమరం భీం జిల్లా నుండి 70 కి.మీ గాను ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు లింగాపూర్ గ్రామం అనేది ఆదిలాబాదు జిల్లా, సిర్పూర్ గ్రామీణ మండలంలో భాగంగా ఉండేది. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా సిర్పూర్ గ్రామీణ మండలం నుండి కొన్ని గ్రామాలను విడదీసి లింగాపూర్ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేసి, ఈ మండలాన్ని కుమరంభీం జిల్లాలో చేర్చారు .ఇది ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగం.ఈ మండలంలో 12  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

లింగాపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, లింగాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, లింగాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, లింగాపూర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం లింగాపూర్
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ 504313

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 161 చ.కి.మీ. కాగా, జనాభా 12,477. జనాభాలో పురుషులు 6,215 కాగా, స్త్రీల సంఖ్య 6,262. మండలంలో 2,840 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. చొర్పల్లి
  2. వంకమద్ది (సిర్పూర్ గ్రామీణ)
  3. ఘుమ్నూర్ (లింగాపూర్)
  4. ఘుమ్నూర్ (బుజుర్గ్)
  5. కంచన్‌పల్లి
  6. కొత్తపల్లి
  7. మామిడిపల్లి
  8. లింగాపూర్
  9. యెల్లపాతర్
  10. జముల్‌ధార
  11. లొడ్డిగూడ

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

  • పిట్టగూడ

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు