ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజను

అసిఫాబాద్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కొమంరం భీం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కొమరంభీం జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 8 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఆసిఫాబాద్లో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది. ఈ రెవెన్యూ డివిజను ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాకొమరంభీం

వివరాలు మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[2]

గణాంక వివరాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ రెవెన్యూ డివిజన్ లో మొత్తం 2,65,641 జనాభా ఉంది.

పరిపాలన మార్చు

ఆసిఫాబాద్ డివిజనులోని మండలాలు:[3]

క్ర.సం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 సిర్పూర్ (యు) మండలం 18 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
2 లింగాపూర్ మండలం 11 రెవెన్యూ గ్రామాలు
3 జైనూర్ మండలం 18 రెవెన్యూ గ్రామాలు
4 తిర్యాని మండలం 39 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
5 ఆసిఫాబాద్ మండలం 52 రెవెన్యూ గ్రామాలు
6 కెరమెరి మండలం 46 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
7 వాంకిడి మండలం 37 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
8 రెబ్బెన మండలం 27 రెవెన్యూ గ్రామాలు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Revenue Divisions | Kumuram Bheem Asifabad District | India". Archived from the original on 2022-01-27. Retrieved 2022-03-08.
  3. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-03-08. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)