లింగారెడ్డిగారి కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

లింగారెడ్డిగారి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983 నుండి 1985 వరకు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

లింగారెడ్డిగారి కిషన్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 నుండి 1985
నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
లోంకలపల్లి గ్రామం, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం

జననం మార్చు

లింగారెడ్డిగారి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, లింగంపేట మండలం, లోంకలపల్లి గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం మార్చు

లింగారెడ్డిగారి కిషన్ రెడ్డి లోంకలపల్లి గ్రామానికి 15 ఏళ్ల పాటు గ్రామ సర్పంచ్‌గా, 17 సంవత్సరాలు సొసైటీ చైర్మన్‌గా, ఏడేళ్ల డీసీసీబీ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆయన 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి తాడూరి బాలాగౌడ్ పై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. లింగారెడ్డిగారి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా పదవిలో కొనసాగుతున్న సమయంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్టీఆర్‌ అర్ధంతరంగా రద్దు చేయడంతో ఆయన 1983 నుండి 1985 వరకు ఎమ్మెల్యేగా కొనసాగాడు.

కిషన్ రెడ్డి 1989లో జరిగిన ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నేరేళ్ల ఆంజనేయులు చేతిలో 1716 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు మార్చు

  1. Sakshi (13 November 2018). "సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.