నేరేళ్ల ఆంజనేయులు

నేరేళ్ల ఆంజనేయులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

నేరేళ్ల ఆంజనేయులు

మాజీ, మంత్రి & మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 2004
నియోజకవర్గం ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 3 జులై 1953
గాంధారి గ్రామం, గాంధారి మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు Indian Election Symbol Cycle.pngతెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నేరెళ్ల భాగయ్య, గౌరమ్మ
జీవిత భాగస్వామి అంజలి బాయి
సంతానం 4
నివాసం కామారెడ్డి
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యంసవరించు

నేరేళ్ల ఆంజనేయులు తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, గాంధారి గ్రామంలో 3 జులై 1953లో జన్మించాడు. ఆయన బీఎస్సీ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితంసవరించు

నేరెళ్ల ఆంజనేయులు 1981లో ఎల్లారెడ్డి పంచాయతీ సమితి కో–ఆప్షన్‌ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి టీడీపీలో చేరాడు. ఆయన 1987లో గాంధారి సహకార సంఘం చైర్మన్‌గా, 1988లో గాంధారి సర్పంచ్‌గా, గాంధారి సోసైటీ చైర్మన్‌గా, ఎన్‌డీసీసీబీ డైరెక్టర్‌గా, గాంధారి సర్పంచ్‌లఫోరం మండల ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆంజనేయులు 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాడు.[2]

నేరెళ్ల ఆంజనేయులు 1998లో ప్రభుత్వ విప్‌గా పని చేశాడు. ఆయన 2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ చైర్మన్‌గా పని చేసి, 2002 నుండి 2004 వరకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు.[3] ఆయన 2009లో టీడీపీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరి, సెప్టెంబర్ 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.

మూలాలుసవరించు

  1. Sakshi (5 November 2018). "ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలకు ఉన్నత పదవులు". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  2. Sakshi (13 November 2018). "సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  3. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.