లింబారాం లేదా లింబా రామ్ (Limba Ram) భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్చెరీ క్రీడాకారుడు. భారతదేశం తరఫున ఇతడు 3 ఒలింపిక్ క్రీడలలో ప్రాతినిధ్యం వహించాడు. బార్సిలోనా ఒలింపిక్స్‌లో 70 మీటర్ల సెగ్మెంట్‌లోూక్క పాయింటుతో పతకం సాధించే అవకాశం జారవిడుకుకున్నాడు. 1990 బీజింగ్ ఆసియా క్రీడలలో భారత్ 4 వ స్థానం రావడానికి దోహదపడ్డాడు. 1992 బీజింగ్ ఆసియన్ చాంపియన్‌షిప్ లో 30 మీటర్ల ఈవెంట్‌లో ప్రపంచ రికార్డును సమం చేసి స్వర్ణపతకం సాధించాడు.

లింబారాం

భారత ప్రభుత్వం 1991లో ఇతడికి అర్జున అవార్డుతో సత్కరించింది. ఇతడు రాజస్థాన్ కు గిరిజన కుటుంబానికి చెందినవాడు. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. 2008లో బీజింగ్ లో జర్గబోయే ఒలింపిక్ క్రీడలపై అతని దృష్టి ఉంది.

"https://te.wikipedia.org/w/index.php?title=లింబారాం&oldid=3687040" నుండి వెలికితీశారు