లిజ్ గోల్డ్‌విన్
లిజ్ గోల్డ్‌విన్, అమెరికన్ సినిమా దర్శకురాలు, నిర్మాత, నటి, రచయిత్రి.[2][3][4][5][6]
లిజ్ గోల్డ్‌విన్ | |
---|---|
జననం | లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా, యుఎస్ | 1976 డిసెంబరు 25
వృత్తి | సినిమా దర్శకురాలు, నిర్మాత, నటి, రచయిత్రి |
బంధువులు |
|
వ్యక్తిగత జీవితం
మార్చుగోల్డ్విన్ 1976, డిసెంబరు 25న రచయిత్రి పెగ్గి ఇలియట్ గోల్డ్‌విన్ - సినీ నిర్మాత శామ్యూల్ గోల్డ్‌విన్ జూనియర్ దంపతులకు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో జన్మించింది. గోల్డ్‌విన్ తాత మూవీ మొగల్ శామ్యూల్ గోల్డ్‌విన్, నానమ్మ సినీ నటి ఫ్రాన్సిస్ హోవార్డ్. ఈమెకు నటుడు టోనీ గోల్డ్‌విన్, నిర్మాత జాన్ గోల్డ్‌విన్ లకు సవతి సోదరి. గోల్డ్‌విన్ న్యూయార్క్ నగరంలోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో చదివింది. ఫోటోగ్రఫీలో బిఎఫ్ఏ డిగ్రీని అందుకుంది.
కెరీర్
మార్చు2005లో ప్రెట్టీ థింగ్స్ అనే డాక్యుమెంటరీకి రచన, దర్శకత్వం వహించింది. ప్రెట్టీ థింగ్స్: ది లాస్ట్ జనరేషన్ ఆఫ్ అమెరికన్ బర్లెస్క్యూ క్వీన్స్ అనే నాన్-ఫిక్షన్ పుస్తకాన్ని, 2015లో స్పోర్టింగ్ గైడ్ అనే నవలన రచించింది. అండర్ వాటర్ బ్యాలెట్ (2008), ఎల్ఏ ఎట్ నైట్ (2009), ది పెయింటెడ్ లేడీ (2012), డియర్ డైరీ (2013) వంటి షార్ట్ ఫిలింలకు దర్శకత్వం వహించింది.
రన్నింగ్ విత్ సిజర్స్ (2006)తోపాటు ఇతర సినిమాలకు ఆభరణాలను తయారుచేసింది. గోల్డ్‌విన్ 2000-2002 వరకు షిసిడో కాస్మెటిక్స్‌కు గ్లోబల్ కన్సల్టెంట్‌గా ఉన్నది. 2004లో ది బ్రూక్లిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో పాట్రిక్ కెల్లీ రెట్రోస్పెక్టివ్‌పై మ్యూజియం డైరెక్టర్ థెల్మా గోల్డెన్ (స్టూడియో మ్యూజియం ఆఫ్ హార్లెం)తో కలిసి పనిచేసింది. 2008లో లాస్ ఏంజిల్స్ కౌంటీ మ్యూజియం ఫర్ ద ఆర్ట్స్ లో ఒక డాక్యుమెంటరీ కార్యక్రమాన్ని నిర్వహించింది.
సినిమాలు
మార్చు- ప్రెట్టీ థింగ్స్ (2005)
- అండర్ వాటర్ బ్యాలెట్ (2009)
- ఎల్ఏ ఎట్ నైట్ (2009)
- ది పెయింటెడ్ లేడీ (2012)
- డియర్ డైరీ (2013)
మూలాలు
మార్చు- ↑ Goldwyn, Liz (August 8, 2014). "The Hollywood Dynasty: Liz and Tony Goldwyn". Town & Country (magazine).
- ↑ The New York Times
- ↑ Style.com
- ↑ Los Angeles Times
- ↑ Los Angeles Times
- ↑ Los Angeles Times