టోనీ గోల్డ్‌విన్

అమెరికన్ నటుడు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ కార్యకర్త

ఆంథోనీ హోవార్డ్ గోల్డ్‌విన్, అమెరికన్ నటుడు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ కార్యకర్త.

టోనీ గోల్డ్‌విన్
టోనీ గోల్డ్‌విన్ (2019)
జననం
ఆంథోనీ హోవార్డ్ గోల్డ్‌విన్

(1960-05-20) 1960 మే 20 (వయసు 64)
విద్యాసంస్థ
  • హామిల్టన్ కళాశాల
  • బ్రాందీస్ విశ్వవిద్యాలయం (బిఎఫ్ఏ)
  • లండన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రమాటిక్ ఆర్ట్‌ (ఎంఏ)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
జేన్ ముస్కీ
(m. 1987)
పిల్లలు2
తల్లిదండ్రులు
బంధువులు

టోనీ గోల్డ్‌విన్ 1960, మే 20న నిర్మాత శామ్యూల్ గోల్డ్‌విన్ జూనియర్ - సినిమా, నాటకరంగ నటి జెన్నిఫర్ హోవార్డ్‌ దంపతులకు కాలిఫోర్నియా లోని లాస్ ఏంజిల్స్ లో జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరులు (నిర్మాత జాన్ గోల్డ్‌విన్, ఫ్రాన్సిస్ గోల్డ్‌విన్) ఉన్నారు.

తండ్రి తరఫు తాతలు ఆస్కార్ విజేత నిర్మాత శామ్యూల్ గోల్డ్‌విన్ కాగా, నటి ఫ్రాన్సిస్ హోవార్డ్. తల్లి తరపు వాళ్ళు సిడ్నీ హోవార్డ్ గాన్ విత్ ది విండ్ వంటి 70 ఇతర సినిమాలకు స్క్రీన్ ప్లే రచయిత కాగా, క్లేర్ ఈమ్స్ నటి.[2][3] గోల్డ్‌విన్ న్యూయార్క్‌లోని క్లింటన్‌లోని హామిల్టన్ కళాశాల, మసాచుసెట్స్‌లోని వాల్తామ్‌లోని బ్రాందీస్ విశ్వవిద్యాలయం, లండన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రమాటిక్ ఆర్ట్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. న్యూయార్క్ నగరంలోని హెచ్.బి. స్టూడియో[4] నుండి నటనలో శిక్షణ పొందాడు.

కళారంగం

మార్చు

స్లాషర్ ఫిల్మ్ ఫ్రైడే ది 13వ పార్ట్ VI: జాసన్ లైవ్స్ (1986) సినిమాలో డారెన్‌ పాత్రతో సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. 1990లో ఘోస్ట్ అనే ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలో కార్ల్ బ్రూనర్‌గా నటించి ఉత్తమ సహాయ నటుడు విభాగంలో సాటర్న్‌ అవార్డుకు నామినేట్ అయ్యాడు. 1995లో నిక్సన్ అనే సినిమాలో హెరాల్డ్ నిక్సన్‌గా కూడా నటించాడు. ఈ సినిమాకు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. హెచ్.బి.ఓ. మినిసిరీస్ ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్ (1998)లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ పాత్రలో నటించాడు.

1999లో వచ్చిన టార్జాన్ డిస్నీ యానిమేషన్ సినిమాలోని ప్రధాన పాత్రకు గాత్రదానం చేశాడు. 2003లో ది లాస్ట్ సమురాయ్ సినిమాలో కల్నల్ బాగ్లీ, 2009లో ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్ జానాథాన్ "జాన్" కాలింగ్‌వుడ్, ఆండ్రూ ప్రియర్ డైవర్జెంట్ ఫిల్మ్ సిరీస్ (2014–2015), 2021లో కింగ్ రిచర్డ్ లో పాల్ కోహెన్, రెండోది అతనికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్‌కి రెండవ నామినేషన్‌ను సంపాదించిపెట్టింది. ఎబిసి లీగల్/పొలిటికల్ డ్రామా స్కాండల్ (2012–2018)లో ప్రెసిడెంట్ ఫిట్జ్‌గెరాల్డ్ గ్రాంట్ IIIగా నటించాడు. ఈ సిరీస్ కోసం అనేక ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించాడు, పీబాడీ అవార్డును గెలుచుకున్నాడు.

 
2013లో పీబాడీ అవార్డుతో
 
మార్చి 2014లో డైవర్జెంట్ ఫిల్మ్ ప్రీమియర్‌లో గోల్డ్‌విన్

దర్శకుడు

మార్చు
సంవత్సరం పేరు ఇతర వివరాలు
1999 ఎ వాక్ ఆన్ ది మూన్ నిర్మాత కూడా
2001 సమ్ వన్ లైక్ యు
2004 వితౌట్ ఎ ట్రాస్ ఎపిసోడ్: "అమెరికన్ గాడెస్"
2004–2005 ది ఎల్ వర్డ్ 3 ఎపిసోడ్‌లు
2006 గ్రేస్ అనాటమీ 2 ఎపిసోడ్‌లు
2006 ది లాస్ట్ కిస్
2006 లా అండ్ ఆర్డర్ ఎపిసోడ్: "థింకింగ్ మేక్స్ ఇట్ సో"
2006–2007 డెక్స్టర్ 4 ఎపిసోడ్‌లు
2007 ప్రైవేట్ ప్రాక్టీస్ ఎపిసోడ్: "దీనిలో సామ్ ఊహించని సందర్శకుడిని స్వీకరించాడు. . ."
2007 సిక్స్ డిగ్రీస్ ఎపిసోడ్: "రే'స్ బ్యాక్"
2007 కిడ్నాప్డ్ ఎపిసోడ్: "అక్నాలెడ్జ్‌మెంట్"
2007 అలీబి
2007 డర్టీ సెక్సీ మనీ ఎపిసోడ్: "ది నట్‌క్రాకర్"
2010 కన్వీక్షన్ నిర్మాత కూడా
ఫిలడెల్ఫియా ఫిల్మ్ ఫెస్టివల్ ఫర్ ఆడియన్స్ అవార్డు — గౌరవప్రదమైన ప్రస్తావన
2010 డ్యామేజేస్ ఎపిసోడ్: "ఫ్లైట్ 11:08కి"
2010–2012 జస్టిఫైడ్ 3 ఎపిసోడ్‌లు
2011 హౌథ్రోన్ ఎపిసోడ్: "టు టెల్ ది ట్రూత్"
2012–2017 స్కాండల్ 8 ఎపిసోడ్‌లు
2014 ది డివైడ్ నిర్మాత కూడా
TBA ఇన్ అప్రోప్రియేట్ బిహేవియర్ నిర్మాత కూడా

నాటకాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర వేదిక
1988 టామ్ జోన్స్
1989 ది సమ్ ఆఫ్ అస్
1990 కార్తజీనియన్స్
1991 పిక్నిక్
1992 స్పైక్ హీల్స్ ఆండ్రూ సెకండ్ స్టేజ్ థియేటర్
1994 లేడీ ఇన్ ది డార్క్ చార్లీ జాన్సన్ న్యూయార్క్ సిటీ సెంటర్
1995–1996 హాలీడే జానీ కేసు సర్కిల్ ఇన్ ది స్క్వేర్ థియేటర్‌
2006 ది వాటర్స్ ఎడ్జ్ రిచర్డ్ సెకండ్ స్టేజ్ థియేటర్
2010–2011 ప్రామిసెస్, ప్రామిసెస్ జెడి షెల్డ్రేక్ బ్రాడ్‌వే థియేటర్
2010 24 హవర్స్ ప్లేస్ బ్రాడ్‌వే
2010 బ్రాడ్‌వే బ్యాక్ వర్డ్ 5
2012 ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కెప్టెన్ వాన్ ట్రాప్ కార్నెగీ హాల్
2018 నెట్‌వర్క్ మాక్స్ షూమేకర్ బెలాస్కో థియేటర్
2020 ది ఇన్ హెరిటాన్స్ హెన్రీ విల్కాక్స్ ఎథెల్ బారీమోర్ థియేటర్

డిస్కోగ్రఫీ

మార్చు
సంవత్సరం శీర్షిక ఆల్బమ్ ఇతర వివరాలు
2010 "వాంటింగ్ థింగ్స్" ప్రామిసెస్, ప్రామిసెస్
2010 "క్రిస్మస్ డే" ప్రామిసెస్, ప్రామిసెస్ ఫీట్. యాష్లే అంబర్
2010 "ఇట్స్ అవర్ లిటిల్ సీక్రెట్" ప్రామిసెస్, ప్రామిసెస్ ఫీట్. సీన్ హేస్

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
1991 సాటర్న్ అవార్డులు ఉత్తమ సహాయ నటుడు ఘోస్ట్ నామినేట్
1996 స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులు చలనచిత్రంలో నటీనటుల అత్యుత్తమ ప్రదర్శన నిక్సన్ నామినేట్
2013 పీబాడీ అవార్డులు రేడియో, టెలివిజన్‌లో నిష్ణాతులు స్కాండల్ విజేత
2014 ప్రిజం అవార్డులు డ్రామా సిరీస్‌లో ప్రదర్శన నామినేట్
2022 బ్లాక్ రీల్ అవార్డులు అత్యుత్తమ సమిష్టి కింగ్ రిచర్డ్ నామినేట్
2022 హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు ఉత్తమ తారాగణం సమిష్టి నామినేట్
2022 NAACP చిత్ర అవార్డులు చలన చిత్రంలో అత్యుత్తమ సమిష్టి తారాగణం నామినేట్
2022 స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులు చలనచిత్రంలో నటీనటుల అత్యుత్తమ ప్రదర్శన నామినేట్

మూలాలు

మార్చు
  1. Goldwyn, Liz (August 8, 2014). "The Hollywood Dynasty: Liz and Tony Goldwyn". Town & Country (magazine).
  2. Pfefferman, Naomi (25 March 1999). "Rediscovering His Jewish Roots". The Jewish Journal of Greater Los Angeles. Archived from the original on 2012-07-08. Retrieved 2023-06-06.
  3. "Clare Eames Dead". The New York Times. 9 November 1930. p. 31. Retrieved 2023-06-06.
  4. "HB Studio - Notable Alumni | One of the Original Acting Studios in NYC".

బయటి లింకులు

మార్చు