లీలా పూనావాలా

భారతీయ పారిశ్రామికవేత్త , పరోపకారిణి మరియు ఉపకారిణి
(లీలా పూనావాల నుండి దారిమార్పు చెందింది)

లీలా పూనావాల యంత్ర శాస్త్రవేత్త. 1944, సెప్టెంబరు 16న పాకిస్థాన్ లోని హైదరాబాదులో జన్మించారు. స్వాతంత్ర్యానంతరం కుటుంబం మాతృదేశానికి వచ్చి, పూణెలో స్థిరపడింది. ఈమె కుటుంబం, బంధువుల పిల్లలలో ఈమె ఒక్కరే ఆడపిల్ల. ఇంటర్ పూర్తి చేసి తరువాత ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకుంది. పూణె ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసిన మొదటి అమ్మాయి ఈమె.

లీలా పూనావాల

జీవిత విశేషాలు

మార్చు

ఇంజనీరింగ్ పట్టభద్రురాలై, స్విడ్జర్లాండ్ వెళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్ శాఖలో పరిశోధనలు చేశారు. తదనంతరం అక్కడే ఒక కంపెనీలో ట్రెయినీ ఇంజనీరుగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి 1986 లో ఆ కంపెనీకి మేనేజింగ్ డైరక్టరుగా నియముతులైనారు. ఇది ఈమె జీవితంలో పెద్దమలుపు.

ఆనాటి వరకు నష్టాల్లో ఉన్న తనకంపెనీని లాభాల బాట పట్టించారు. ఉద్యోగ వర్గాలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పి కంపెనీని ప్రగతి పథంలో నడిపారు. 50 ఏండ్లు నిండిన సందర్భంగా 1996 లో కంపెనీ ఘనంగా సన్మానించింది. కంపెనీకి అంకిత భావంతో చేసిన సేవలకు గాను ఈమెకు లక్ష స్విస్ ఫ్రాంక్ లు (సుమారు 30 లక్షలు) గౌరవ పురస్కారం లభించింది. కంపెనీ ఈమెకు జీవిత పర్యంతం గుర్తుండిపోయేలా చేసింది. మరి తాను కూదా సమాజానికి గుర్తుండిపోయే పనిచేయాలి కదా అని తలపోసి తన పేరు మీదనే ఒక ఫౌండేషన్ స్థాపించాలనుకున్నారు. పదవీ విరమణ చేసిన ఈమెకు కంపెనీ నాలుగు లక్షల స్విస్ ఫ్రాంక్ లు అందజేసింది.

లీలగారు తనకు కంపెనీ ఇచ్చిన రెండు మొత్తాలను కలిపి పూణేలో ఒక ఫౌండేషన్ స్థాపించి నిరుపేద అమ్మాయిలను దేశవిదేశాలకు పంపించి, చదివించడానికి గాను స్కాలర్ షిప్ లను ఏర్పాటు చేశారు. పూణే జిల్లాలోని నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఇంటర్, డిగ్రీ లలో మంచి మార్కులు సంపాదించిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నత చదువులు చదవడానికి, అర్హతలను అనుసరించి ఏటా సుమారు 40 మందికి స్కాలర్ షిప్ లను ఈనాటికీ అందిస్తున్నారు.

పురస్కారాలు

మార్చు
 
పద్మశ్రీపురస్కారం

మెకానికల్ ఇంజనీరింగ్ లో పరిశోధకురాలిగా, పరిపూర్ణ వ్యక్తిగా, మహిలగా ఈమెకు పలు పురస్కారాలు లభించాయి. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం నుంచి "దశాబ్ది మహిళ" ( 1978-88), జీవిత సాఫల్య పురస్కారం, 1992 లో "ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ ద యియర్", 1982 లో పద్మశ్రీ, ఉద్యోగరత్న, స్వీడన్ రాజు నుండి "రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్", తదనంతర కాలంలో "ఉద్యోగ భూషణ" మొదలైన అవార్డులు, రివార్దులు లభించాయి.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు