లుంబినీ పార్క్ 7.5 ఎకరాల వైశాల్యం కలిగిన ఒక చిన్న పబ్లిక్ అర్బన్ పార్క్ (నగరోద్యానవనం). ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. నగరం కేంద్రస్థానంలో ఉన్న ఈ పార్క్ బిర్లామందిర్, నెక్లెస్ రోడ్డు మొదలైన ఇతర పర్యాటక ఆకర్షణలకు సామీప్యంలో ఉంది. ఇది సంవత్సరమంతటా అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. ఇది 1994లో నిర్మించబడింది. ఈ పార్కును తెలంగాణా ప్రభుత్వ డైరెల్టరేట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న " బుద్ధపౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " నిర్వహిస్తుంది. 2007 ఆగస్టు 25 న 44 మంది ప్రాణాలను బలితీసుకున్న హైదరాబాద్ బాంబింగ్‌లో " తీవ్రవాదులు ఎంచుకున్న కేంద్రాలలో లుంబినీ పార్క్ ఒకటి.[1]

Lumbini Park
Lumbini Park
రకంUrban park
స్థానంHussain Sagar, Hyderabad
అక్షాంశరేఖాంశాలు17°24′36″N 78°28′20″E / 17.410°N 78.4722°E / 17.410; 78.4722 (Lumbini Park)
విస్తీర్ణం7.5 ఎకరాలు (3.0 హె.)
నవీకరణ1994
నిర్వహిస్తుందిBuddha Purnima Project Authority
స్థితిOpen all year
దస్త్రం:Gautam Budhha Statue on the Hussain Sagar Lake.jpg
Gautam Budhha Statue on the Hussain Sagar Lake

చరిత్ర

మార్చు

1994 లో లుంబినీ పార్క్ నిర్మాణవ్యయం 2.35 కోట్లు. పార్క్ వైశాల్యం 5 ఎకరాలు. ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. 2000 లో హైదరాబాదులో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ప్రాంతాలను సంరక్షించేందుకు " బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " స్థాపించబడింది. బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ నెక్లెస్ రోడ్డు, ఎన్.టి.ఆర్. గార్డెన్ల నిర్వహణతో లుంబినీగార్డెన్ నిర్వహణకూడా చేపట్టింది.[2] పర్యాటకులను ఆకర్షించడం కొరకు పార్కులో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్, పూలతోటలతో బోటింగ్, లేజర్ షో వంటి ఆకర్షణలను అభివృద్ధి చేసింది. [2] 2006 లో ముఖ్యమంత్రి అంజయ్య గౌరవార్ధం పార్కుకు " అంజయ్య లుంబినీ పార్కు " అని పేరు మార్చబడింది.[3]

దస్త్రం:Buddha statue in lumbini park.jpeg
Buddha Statue of Hyderabad in Lumbini Park

2007 తీవ్రవాద దాడి

మార్చు

2007 ఆగస్ట్ 25న హైదరాబాదులో జరిగిన వరుస బాంబుదాడులలో 44 మంది మరణించారు 60 మంది గాయపడ్డారు.[1] లుంబినీ పార్కులో జరిగిన దాడి లేజర్ అడిటోరియంలో ప్రదర్శనజరుగుతున్న సామ్యంకాల సమయంలో జరిగింది. ప్రదర్శన సమయంలో అడిటోరియంలో 500 మంది ఉన్నారు. [4] కొద్ది రోజులపాటు కేసు విచారణ కొరకు మూసి వేయబడిన పార్కు మెటల్ డిటెక్టర్ మొదలైన ఏర్పాట్ల తరువాత తిరిగి పర్యాటక సందర్శనకు అనుమతించబడింది.[5]

మల్టీమీడియా ఫౌంటెన్ షో

మార్చు

లుంబినీ పార్కులో " ఎమోషన్ మీడియా ఫ్యాక్టరీ " మొట్టమొదటి వాటర్ మల్టీమీడియా షో స్థాపించింది. మల్టీమీడియా ఫౌంటెన్ షో చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రదర్శనలో అద్భుతమైన లేజర్ అనిమేషన్, లైవ్ వీడియో, అద్భుతమైన శబ్ధ నాణ్యత, రిథమిక్ మ్యూజికల్ ఫౌంటెన్, అసాధారణ భీం ఎఫెక్టులు అన్నీ కలిసి ఆశ్చర్యకరమైన చూపరులను మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనను అందిస్తున్నాయి. ఇండియాలోని అతిపెద్ద నీటితెరగా (వాటర్ స్క్రీన్) ఇది వర్ణించబడుతుంది. ఈ ప్రదర్శనలో హైదరాబాదులోని గత, ప్రస్తుత, భవిష్యత్తు సంబంధిత ఆకర్షణీయమైన చారిత్రక, సాస్కృతిక, ఆసక్తికరమైన కధలను తెరకెక్కిస్తుంది. ఈ ప్రదర్శన ప్రతిరాత్రి ప్రేక్షకులను అత్యధికంగా ఆకర్షిస్తుంది.[6]

ఆకర్షణలు

మార్చు
 
Water fall at Lumbini Park
 
Multimedia Show at Lumbini Park
 
One of the ride at Lumbini Park

పార్కుకు ఆనుకుని ఉన్న 2.5 ఎకరాల భూమిని లేజర్ అడిటోరియం నిర్మించడం కొరకు " ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్టుమెంటును " కోరింది. ఇలాటి అడిటోరియాలలో భారతదేశంలో ఇదే మొదటిదని భావించబడుతుంది. ఈ అడిటోరియంలో 2000 మంది ప్రదర్శన తిలకించే సౌకర్యం ఉంది.ఇక్కడ హైదరాబాదు గురించిన చారిత్రకాంశాలు ప్రదర్శించబడుతుంటాయి.[7][8] పార్కుకు ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతేకాక హైదరాబాదుకు గ్లోబల్ అంతస్తు కలిగించిన అంశాలలో ఇది ఒకటి. అంతేకాక ఈ పార్కు నేపాలీ సంస్కృతిని ప్రపంచం అంతటా వ్యాపించజేస్తూ ఉంది.[9]

పనివేళలు

మార్చు

పార్కు అన్ని రోజులు పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇస్తుంది. ఈ పార్కులో వారాంతాలలో మినహా మిగిలిన రోజులలో ప్రతిరోజు సాయంకాలం 7.15 గంటలకు లేజర్ ప్రదర్శన నిర్వహించబడుతుంది. వారాంతాలలో సాయం కాలం 7.30 గంటలకు, 8.30 గంటలకు రెండుమార్లు ప్రదర్శన నిర్వహించబడుతుంది.[10]

చేరుకోవడం

మార్చు

సెక్రటరియేట్ న్యూ గేట్, హైదరాబాదు, తెలంగాణా 500004.

మూలాలజాబితా

మార్చు
  1. 1.0 1.1 Kamalapurkar, Shwetal (2007-08-25). "Death toll in Hyderabad serial blasts rises to 44". IBNLive.com. Retrieved 2008-08-17.
  2. 2.0 2.1 "Buddha Purnima Project Authority". Hyderabad Urban Development Authority. Archived from the original on October 9, 2007. Retrieved 2008-08-17.
  3. "YSR reiterates promise on housing for the poor". The Hindu. 2006-08-17. Archived from the original on 2008-02-28. Retrieved 2008-08-17.
  4. Amin Jafri, Syed (2007-08-25). "Hyderabad: 42 killed, 50 injured in twin blasts". Rediff.com. Retrieved 2008-08-17.
  5. "Lumbini Park reopens today". The Hindu. 2007-08-30. Archived from the original on 2008-10-06. Retrieved 2008-08-17.
  6. Bhatt, Shankarlal C. (2006-01-01). Land and People of Indian States and Union Territories: In 36 Volumes. Andhra Pradesh (in ఇంగ్లీష్). Gyan Publishing House. ISBN 9788178353586.
  7. "Trial run of laser show begins today". The Hindu. 2005-01-14. Archived from the original on 2007-12-14. Retrieved 2008-08-17.
  8. Singh, Khurshchev (2007-09-13). "Hyderabad Woes: Mecca Masjid, Lumbini Park..." Institute of Defence Studies & Analysis. Retrieved 2008-08-17. [dead link]
  9. Ramanathan, Gayatri (2003-04-03). "Hi-tech entertainments on the anvil for Hyderabad". The Times of India. Retrieved 2008-08-17.
  10. "Lumbini Park". Journeymart. Archived from the original on 2015-07-05. Retrieved 2015-06-22.

వెలుపలి లింకులు

మార్చు

G+ page
GHMC
Tripadvisor