లుబిటెల్
లుబిటెల్ (ఆంగ్లం: Lubitel) లోమో సంస్థచే తయారు చేయబడిన మీడియం ఫార్మాట్ ఫిల్మ్ టి ఏల్ ఆర్ కెమెరాల శ్రేణి [1]. వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే కెమెరాను స్ఫూర్తిగా తీసుకొనబడి ఈ కెమెరా నిర్మించబడింది. లుబిటెల్ అనగా రష్యన్ లో ఔత్సాహికుడు (amateur) అని అర్థం.
లుబిటెల్ కెమెరాలు అప్పటి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం అయిన బేక్ లైట్ తో నిర్మించబడేవి. వాడే కొద్దీ లోపభూయిష్టమైన నిర్మాణం వలన పలు ఆశ్చర్యకర సాంకేతిక తప్పిదాలు ఫోటోలలో దొర్లేవి. ఈ తప్పిదాలే లుబిటెల్ యొక్క కళాత్మక లక్షణాలు గా పరిగణింపబడటంతో లుబిటెల్ కెమెరాలు ప్రత్యేకతను సంతరించుకొన్నవి. Kalimar వంటి సంస్థలు నిర్మించే కెమెరాలు లుబిటెల్ కెమెరాలు గా చెలామణి కావటం లుబిటెల్ పేరుకు ఉన్న డిమాండును తెలుపుతుంది.
బరువు తక్కువగా ఉండటం, దురుసుగా వాడినను (పొరబాటున ఎన్ని మార్లు క్రింద పడినను) ఎటువంటి నష్టం కలగకపోవటం, వాడకం సులువుగా ఉండటం వంటి ప్రత్యేకతలతో లుబిటెల్ కెమెరా ఔత్సాహికులకు/నిపుణులకు ప్రీతిపాత్రమైంది [2].
చరిత్రసవరించు
టి ఎల్ ఆర్ కెమెరాసవరించు
లుబిటెల్ నిర్మాణానికి దాదాపు పదేళ్ళ ముందే టి ఎల్ ఆర్ కెమెరా నిర్మాణం జరిగింది. మొట్టమొదటి టి ఎల్ ఆర్ కెమెరాగా జర్మనీ కి చెందిన రోల్లెకార్డ్ గా (1929) గుర్తించబడింది.
రెండవ ప్రపంచ యుద్ధంసవరించు
రెండవ ప్రపంచ యుద్ధం లో విజయం సోవియట్ యూనియన్ సొంతం అయ్యింది. జర్మనీ యొక్క ఉన్నత శ్రేణి దృశ్యసాధనాలు, ఫోటోగ్రఫీ పరిశ్రమ సోవియట్ చేతులలోకి వచ్చింది. వీటిని జర్మనీ నుండి సోవియట్ కు తరలించడం జరిగింది.
GOMZ స్థాపనసవరించు
1932 లో GOMZ (Gosularstvennyi Optiko-Mekhanicheskii Zavod అనగా State Optical-Mechanical Factory) సెయింట్ పీటర్స్‌బర్గ్ లో స్థాపించబడింది.
KomsomoletSసవరించు
1946 లో వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే టి ఎల్ ఆర్ కెమెరా స్ఫూర్తిగా తీసుకొని లోమో సంస్థ కాంసొమొలెట్ ఎస్ కెమెరాను తయారు చేసింది.[3] ఇదే సోవియట్ యూనియన్ తయారు చేయబడ్డ మొట్ట మొదటి టి ఎల్ ఆర్ కెమెరా కావడం మరో విశేషం.
అప్పటి Communist Youth Organization అయిన Komsomol పేరునే ఈ కెమెరాకు పెట్టబడింది. రష్యన్ లో Kosmomol అనగా Young Communist అని అర్థం. చూడటానికి బ్రిలియంట్ కెమెరాలానే ఉన్నా, అప్పటి ప్లాస్టిక్ అయిన బేక్ లైట్ తో దీని నిర్మాణం జరిగింది. దూసుకెళుతూ ఉన్న సోవియట్ ఫోటో పరిశ్రమకు కాంసొమొలెట్ ఎస్ కెమెరా ఒక నిలువుటద్దంగా గుర్తించబడింది. యుద్ధం తో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప విషయంగానే చెప్పుకోబడింది.
వివరాలుసవరించు
- తయారీ చేయబడ్డ కాలం: 1946 - 1950
- తయారీ చేయబడ్డ కెమెరాలు: 25,000
- B (బల్బ్ మోడ్) 1/25, 1/50, 1/100 షట్టరు వేగాలు
- T-21 80/6.3 గ్రహీత కటకం, 75/4.5 వీక్షక కటకం (రెండు కటకాలు ఒకదానికి మరొకటి అనుసంధానించబడకుండా ఉంటాయి)
- ఫిల్టర్ లు, అనుబంధ కటకాలకు కెమెరాలోనే ప్రత్యేకంగా ఒక చిన్న కంపార్టుమెంటు
లుబిటెల్సవరించు
1949 లో కాంసొమొలెట్ ఎస్ కు మరిన్ని మెరుగులు దిద్ది, మొట్టమొదటిసారిగా లుబిటెల్ కెమెరా విడుదల చేయబడింది. గ్రహీత/వీక్షక కటకాలు పరస్పర అనుసంధానం కలిగి ఉండటం.
వివరాలుసవరించు
- తయారీ చేయబడిన కాలం: 1949 - 1956
- తయారీ చేయబడిన కెమెరాలు: 10,00,000 పైగా
- షట్టరు వేగం: 1/10 నుండి 1/200
- కటకాలు: T22 75/4.5 గ్రహీత కటకం, 60/2.8 వీక్షక కటకం
- సూక్ష్మరంధ్రం f/2.8 వరకు విశాల కోణం కలిగి ఉండటం.
లుబిటెల్ 2సవరించు
G Barkovski అనే వ్యక్తి మరిన్ని మెరుగులు దిద్దటంతో లుబిటెల్ 2 అవతరించింది. లుబిటెల్ 2 నుండి నేం ప్లేట్ లు రష్యన్ తో బాటు ఆంగ్లంలో కూడా తయారు చేయబడ్డాయి.
వివరాలుసవరించు
- తయారు చేయబడ్డ కాలం: 1955 - 1980
- తయారు చేయబడ్డ కెమెరాలు: 20,00,000
- సెల్ఫ్ టైమరు, ఫ్ల్యాష్ సింక్ లు లభ్యం
GOMZ పేరు LOMO గా మార్పుసవరించు
1965 లో దీనినే LOMO (Leningradskoe Optiko Mekhanichesko Obedinenie అనగా Leningrad Optical-Mechanical Union) గా మార్చారు.
లుబిటెల్ 166సవరించు
1976 నుండి లుబిటెల్ 166 విక్రయించబడింది. దీనిని పూర్తి ప్లాస్టిక్ తో తయారు చేసారు. 1980 లో మాస్కో లో జరిగిన ఒలింపిక్స్ స్మృతిగా మరొక వేరియంట్ తయారీ కూడా జరిగింది.
వివరాలుసవరించు
- తయారు చేయబడ్డ కాలం: 1976 - 1986
- తయారు చేయబడ్డ కెమెరాలు: 70,000 వరకు
- ఫిలిం కౌంటరు లభ్యం
- ఫిలిం ను ముందుకు తిప్పటం, షట్టరు ను బిగించటం తో అనుసంధానం
లుబిటెల్ 166Bసవరించు
1980 నుండి లుబిటెల్ 166B విక్రయించబడింది. ముందు కెమెరా కంటే చక్కని ఫోకస్ తో ఎక్కువ వర్ణ సంతృప్తత (Color Saturation) ఉండేలా ఫోటోలు వచ్చేవి.
వివరాలుసవరించు
- తయారు చేయబడ్డ కాలం: 1980 - 1990
- తయారు చేయబడ్డ కెమెరాలు: 9,00,000
- ఫిలిం కౌంటర్ స్థానే వాతావరణ సూచికలను బట్టి బహిర్గత అమరికలు
లుబిటెల్ 166 యూనివర్సల్సవరించు
లుబిటెల్ శ్రేణి లో నిర్మించబడ్డ చిట్టచివరి మోడల్.
వివరాలుసవరించు
- తయారు చేయబడ్డ కాలం: 1983 - 1993
- తయారు చేయబడ్డ కెమెరాలు: 4,00,000
- 6 x 6 cm, 6 x 4.5 cm ఫిలిం లకు మాస్క్ లు జతచేయబడ్డాయి
స్పుట్నిక్ స్టీరియోసవరించు
రెండు వేర్వేరు గ్రహీత కటకాలు ఒకదాని ప్రక్కన మరొకటి ఉండటం వలన స్వల్ప కోణ భేదంతో రెండు ఫోటోలు తీయబడతాయి. వీటిని త్రీ-డీ అద్దాలతో చూచినతో త్రీ-డీ అనుభూతి కలుగుతుంది.
వివరాలుసవరించు
- తయారు చేయబడ్డ కాలం: 1955 - 1973
- తయారు అయిన కెమెరాలు: 4,00,000
లుబిటెల్ కెమెరాలతో తీయబడిన ఫోటోలుసవరించు
లుబిటెల్ కెమెరాతో రెడ్ స్కేల్ ఫిలిం పై తీసిన ఫోటో
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ లుబిటెల్ చరిత్ర గురించి లోమోగ్రఫీ.కాం
- ↑ తన ప్రత్యేకతలతో ఔత్సాహికులకు/నిపుణులకు సమస్థాయిలో ప్రీతిపాత్రమైన లుబిటెల్ కెమెరా (లోమోగ్రఫీ కాం)
- ↑ "కాంసొమొలెట్ ఎస్ కెమెరా గురించి లోమోగ్రఫీ.కాం". Archived from the original on 2015-09-11. Retrieved 2018-11-13.