లోమో
లోమో (ఆంగ్లం: LOMO) రష్యా లోని సెయింట్ పీటర్స్‌బర్గ్ కేంద్రంగా వైద్య పరికరాలు/చలన చిత్రాలకు కావలసిన కటకాలు/పరికరాలు తయారు చేసే సంస్థ [1] . LOMO యొక్క పూర్తి రూపం Leningradskoye Optiko-Mekhanicheskoye Obyedinenie (Ленинградское Oптико-Mеханическое Oбъединение) అనగా లెనిన్ గ్రాడ్ ఆప్టికల్ మెకానికల్ అసోసియేషన్ అని అర్థం. సోవియట్ యూనియన్ యొక్క ప్రఖ్యాత ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డులు లోమో సంస్థకు మూడు లభించినవి.
దస్త్రం:LOMO logo.png | |
స్థానిక పేరు | ЛОМО |
---|---|
పరిశ్రమ | Imaging, Medical |
స్థాపన | పెట్రోగ్రాడ్, రష్యా (1914) |
ప్రధాన కార్యాలయం | సెయింట్ పీటర్స్బర్గ్, Russia |
ఉత్పత్తులు | కటకాలు, వైద్య పరికరాలు, స్టిల్, మూవీ కెమెరాలు, చలన చిత్ర శ్రవణ సాధనాలు |
రెవెన్యూ | 3,27,27,95,000 (2017) |
51,46,71,000 (2017) | |
−33,95,25,000 (2017) | |
Total assets | 13,84,84,34,000 (2017) |
ఉద్యోగుల సంఖ్య | 2,386 |
వెబ్‌సైట్ |
చరిత్ర
మార్చు1914 లో పెట్రోగ్రాడ్ (ఇప్పటి సెయింట్ పీటర్స్బర్గ్) లో కటకాలు, కెమెరాలు తయారు చేసే ఫ్రెంచి-రష్యన్ సంస్థగా స్థాపించబడింది. 1919లో ఇది జాతీయం చేయబడింది. 1921 లో Factory of State Optics (G.O.Z) గా పేరు మార్చబడింది. 1928 లో 9 X 12 కెమెరాను తయారు చేయవలసిందిగా సంస్థ ఆజ్ఙాపించడమైంది.
GOMZ
మార్చురెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పలు సంస్కరణల వలన 1932లో సంస్థను GOMZ (Gosularstvennyi Optiko-Mehanicheskiy Zavod అనగా State Optical-Mechanical Plant) గా మార్చారు.
లోమో సంస్థ లైకా కెమెరా స్ఫూర్తిగా VOOMP I ను తయారు చేసింది. దీనిని అభివృద్ధి చేసి VOOMP II, పయనీర్ కెమెరాలు తయారు చేసింది. ఎస్ ఎల్ ఆర్ కెమెరా అయిన Sport ను తయారు చేసింది.
LOMO
మార్చు1965లో పలు ఇతర సంస్థలను కలుపుకొంటూ GOMZ కాస్తా LOMO అయ్యింది.
టాయ్ కెమెరాల నిర్మాణం
మార్చులుబిటెల్
మార్చురెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సారానికే లోమో సోవియట్ యూనియన్ యొక్క మొట్టమొదటి టి ఏల్ ఆర్ కెమెరా, Komosmolets ను రూపొందించింది. వోయిగ్ట్ ల్యాండర్ బ్రిల్లియంట్ స్ఫూర్తిగా ఈ కెమెరా నిర్మాణం జరిగింది. ఒక సుదీర్ఘమైన యుద్ధం నుండి ఆర్థికంగా చిత్తు అయి అప్పుడప్పుడే కోలుకొంటూన్న దేశానికి ఇది గొప్ప విజయమే. దీనికి మరిన్ని మెరుగులు దిద్ది 1949లో లుబిటెల్ కెమెరా విడుదల చేయడం జరిగింది. లుబిటెల్ అనగా Amateur అని అర్థం. చవకగా లభ్యమయ్యే లుబిటెల్ ఔత్సాహిక ఫోటోగ్రఫర్ల ప్రియతమ కెమెరా అయ్యింది. ఎప్పటికప్పుడు లుబిటెల్ కు లోమో సంస్థ మెరుగులు దిద్దుకొంటూ వచ్చింది.
-
వోయిగ్ట్ ల్యాండర్ బ్రిల్లియంట్ స్ఫూర్తిగా నిర్మించబడ్డ కామ్సోమొలెట్స్ కెమెరా
-
కాంసొమొలెట్స్ కు మెరుగులు దిద్దిన లుబిటెల్ కెమెరా
-
సెల్ఫ్ టైమర్, ఫ్లాష్ సింక్, లెన్స్ ఫిల్టర్లు గల లుబిటెల్ 2
-
మొట్టమొదటి ప్లాస్టిక్ నిర్మాణం చేయబడ్డా లుబిటెల్ 166. అంతకు ముందు లుబిటెల్ లు బేక్ లైట్ తో చేయబడేవి
-
వాతావరణ సూచికలతో విడుదల చేయబడ్డ లుబిటెల్ 166 B మాడల్
-
6 x 6 cm, 6 x 4.5 cm ఫ్రేం మాస్కులు గల లుబిటెల్ 166 యూనివర్సల్
-
త్రీ-డీ ఫోటోలను చిత్రించే స్పుట్నిక్ కెమెరా
లోమో ఎల్ సి ఏ
మార్చుCosina CX-2 స్ఫూర్తిగా రష్యాలో ఒక కెమెరా రూపొందించవలసిందిగా లోమో ఆజ్ఙాపించబడింది. 1981 లో లోమో కాంపాక్ట్ ఆటోమేట్ (LC-A) నిర్మాణం ప్రారంభం అయ్యింది. 1984 లో కెమెరా తయారీ ప్రారంభం అయ్యింది. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత లోమో ఎల్ సి ఏ ఉత్పత్తిలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.
ఆస్ట్రియా కి చెందిన ఒక విద్యార్థి బృందం చెకోస్లోవకియా కు సెలవులకు వెళ్ళి ఒక పురాతన కెమెరా స్టోరులో ఉత్పత్తి ఆగిపోయిన లోమో ఎల్ సి-ఏ కెమెరాను కొనుగోలు చేసి దానితో ఛాయాచిత్రాలు తీసారు. లోమో ఎల్ సి-ఏ తో వీరు తీసిన ఛాయాచిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు రావటం, తర్వాత అది లోమోగ్రఫీ అనే కళా విప్లవాన్ని తీసుకు రావటం, లోమోగ్రఫీ ఒక సంస్థగా ఏర్పడటం జరిగాయి.
1993లో సంస్థ LOMO PLC అయ్యింది.