లోగుట్టు పెరుమాళ్ళకెరుక

[1]

లోగుట్టు పెరుమాళ్ళకెరుక
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాణం ఎస్.భావనారాయణ
తారాగణం శోభన్ బాబు,
రాజశ్రీ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
వాణిశ్రీ,
ప్రభాకర రెడ్డి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ గౌరీ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

లోగుట్టు పెరుమాళ్ళకెరుక ఫిబవరి,3,1966లో విడుదలైన తెలుగు సినిమా. దర్శక నిర్మాత వై.వి.రావు బావ ఎస్.భావనారాయణ నిర్మించిన ఈ సినిమాతో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకునిగా పరిచయ్యాడు.[2] ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతం కాలేదు. శోభన్ బాబు చిత్రరంగంలో నిలదొక్కుకుంటన్న దశలో తను సోలో హీరోగా నటించిన తొలిచిత్రాల్లో ఒకటైన ఈ చిత్రం, విజయవంతమై ఉంటే తనకు క్రైంహీరో ఇమేజ్ స్థిరపడి ఉండేదని శోభన్ బాబు ఆ తరువాత దశలో ఒక ముఖాముఖిలో చెప్పుకున్నాడు.[3]

చిత్రకథ

మార్చు

నగరంలో కిడ్నాపులు ఎక్కువగా జరుగుతుంటాయి. గుమ్మడి పురప్రముఖుడు. కిడ్నాపులు అరికట్టటానికి ప్రయత్నిస్తూ, కిడ్నాపర్లను పట్టుకున్నవారికి పదివేలు బహుమతి ప్రకటిస్తాడు. పోలీసు ఆఫీసరు శోభన్ బాబు ఒక పెయింటరుగా నగరంలో ప్రవేశిస్తాడు. గుమ్మడి కూతురు అతన్ని ప్రేమిస్తుంది. ఆమె కోరికమీద గుమ్మడి శోభన్ని తన గెస్ట్ హౌస్‌లో ఉండమంటాడు. ప్రభాకర రెడ్డి కూతుర్ని కిడ్నాప్ చేస్తామని లేదా డబ్బు ఇమ్మని బెదిరింపు వస్తుంది. ప్రభాకర్ రెడ్డి పోలీసులను, ప్రవేటు డిటెక్టివులను నమ్మి డబ్బు ఇవ్వడు. అమ్మాయై కిడ్నాప్ ఔతుంది. రాజశ్రీ తండ్రి కిడ్నాపర్ల వల్ల ప్రాణాలు కోల్పోతాడు. ఆమె కిడ్నాపర్లను పట్టుకొనే ప్రయత్నంలో ఉంటుంది. ఒక సారి శోభన్ బాబు సహాయం పొంది,ఇద్దరి ఆశయం ఒకటే అని తెలుసు కుంటారు. వీళ్ళను శోభన్ ప్రేయసి అపార్ధం చేసుకుంటుంది. చిత్రం చివరలో గుమ్మడే కిడ్నాపర్ ముఠా లీడరు అని తెలుస్తుంది

పాటలు

మార్చు
  1. ఇలాగే ఇలాగే ఉండనీ హృదయములే పరవశమై - సుశీల,ఘంటసాల - రచన: వీటూరి
  2. ఓ పిల్లా నీ మనసే ఏమన్నది బ్రతుకంతా నవ్వాలంటు కలగన్నది - ఎస్. జానకి, రచన: వీటూరి
  3. పంతొమ్మిదివందల డెభై మోడల్ అమ్మాయీ - ఘంటసాల, ఎస్. జానకి - రచన: వీటూరి
  4. ఆవో రేమియ్యా దేఖో రెజియ్యా, శిష్ట్లా జానకి, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
  5. చూసావా నాన్న కన్ను మూశావా నాన్న , ఎస్.జానకి, రచన: వీటూరి
  6. దారికాచి వీలుచూచి కాదు , పి బి. శ్రీనివాస్ , ఎస్.జానకి, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం.రచన: వీటూరి .
  7. మైరా వెంకన్నదొర , ఎస్ జానకి , శీర్గాలి గోవిందరాజన్ , పిఠాపురం, పట్టాభి, రచన: వీటూరి.

మూలాలు

మార్చు
  1. మద్రాసు ఫిలిమ్‌ డైరీ 1967-68. 1966 లో విడుదలైన చిత్రాలు. గోటేటిబుక్స్. p. 18.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-11. Retrieved 2009-07-31.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-30. Retrieved 2009-07-31.