లోతుకుంట, హైదరాబాదు

(లోతకుంట నుండి దారిమార్పు చెందింది)

లోతుకుంట తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలానికి చెందిన పట్టణ ప్రాంతం.[1] ఇది సికింద్రాబాదుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది.

లోతుకుంట
సమీప ప్రాంతాలు
Nickname: 
అల్వాల్
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500015
Vehicle registrationటి.ఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

నివాసప్రాంతం సవరించు

ఈ ప్రాంతంలో వివిధ రకాల వస్తువులు, నిత్యావసరాలకు ఎలాంటి సమస్య లేకపోవడంతో అనేకమంది ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఇది నివాస వర్తక వ్యాపార కేంద్రంగా విరసిల్లుతుంది.

వాణిజ్యం సవరించు

కంటోన్మెంట్ ను సమీపంలో ఉన్న ఈ లోతుకుంటలో వివిధ రాకల రెస్టారెంట్లు, థియేటర్లు, ఇతర వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇది బొల్లారంకు, రాష్ట్రపతి నిలయంకు అనుసంధానించబడి ఉంది.

రవాణావ్యవస్థ సవరించు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లోతుకుంట నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. అంతేకాకుండా లోతుకుంటకు 7 కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషను, 12 కిలోమీటర్ల దూరంలో బేగంపేట విమానాశ్రయం, 40 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి.

స్కైవే నిర్మాణం సవరించు

హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ జూబ్లీ బస్టాండ్‌ నుంచి లోతుకుంట వరకు 6 కి.మీ మేర స్కైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కైవే నిర్మాణం వల్ల ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం కావడంతోపాటు కరీంనగర్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయి.[2]

మూలాలు సవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 249, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).

వెలుపలి లంకెలు సవరించు