లోమోగ్రఫీ (ఆంగ్లం:Lomography) అనేది అనలాగ్ ఫోటోగ్రఫీ లో ఏర్పడ్డ ఒక కళా ఉద్యమము. 1992 లో మొదట ఒక చిన్న సమూహంగా మొదలైన ఈ కళా ఉద్యమం, తర్వాతి కాలంలో Lomographische AG అనే ఒక అంతర్జాతీయ సంస్థగా ఏర్పడి అనలాగ్ ఫోటోగ్రఫీ ని వ్యాపింపజేసింది. [1]

అసలైన లోమో ఎల్ సి-ఏ కెమెరా. కనుమరుగౌతోన్న ఈ కెమెరాను మొదట వియన్నా కు చెందిన ఒక విద్యార్థి బృందం కాపాడారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న డిమాండు వలన, సోవియట్ యూనియన్ విఛ్ఛిన్నంతో ఈ కెమెరా తయారీ ధరలు పెరిగాయి. పెరిగిన విక్రయ ధరల గురించి లోమోగ్రఫర్లు వ్లాదిమిర్ పుతిన్ కు విన్నవించుకొన్నారు. అందుబాటు ధరలకు లభ్యమయ్యేలా కెమెరాను తయారు చేయాలని ఆయన లోమో సంస్థను ఆజ్ఙాపించారు. తయారీ ని చైనా కు తరలించటంతో సమస్యకు తెరపడింది. ఈ కెమెరాయే లోమోగ్రఫీకి బీజాలు వేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న అనలాగ్ ఫోటోగ్రఫీకి ప్రాణవాయువులను అందించి, రక్షించి, విస్తరించేలా ఈ కెమెరాయే చేసిందని BBC.com పేర్కొంది. Non-Lomography అనే మరొక శైలి కళా ఉద్యమానికి కూడా ఈ కెమెరాయే కారకం అయ్యింది.

లోమోగ్రఫీ ఎటువంటి ప్రణాళిక లేని, మెళకువలు పాటించనవసరం లేని, ఆకస్మిక ఛాయాచిత్రకళకు అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంది. వర్ణ వైరుధ్యం (Color Contrast) ను ఫోటోలలో పెంచటం, లోమోగ్రఫీ కెమెరాల ప్లాస్టిక్ కటకాలలో లోపాలు, కావాలనే చేసే తప్పుడు బహిర్గతం అమరిక వంటి (అవ)లక్షణాలను లోమోగ్రఫీ యొక్క ప్రత్యేక కళాత్మక విలువలుగా పరిగణించబడతాయి.

అయితే ఇటువంటి అవలక్షణాలే లోమోగ్రఫీ నియమాలు కావటం ఒక ఎత్తైతే, ఇవే నియమాల జాబితాలో "ఏ నియమం పాటించకపోవటం" కూడా ఒక నియమమే కావటం మరొక ఎత్తు. ఫలితంగా, లోమోగ్రఫీ కెమెరాలను లోమోగ్రఫీ శైలి లో కాకుండా, మామూలుగా ఉపయోగించటం వలన Non-Lomography (నాన్ లోమోగ్రఫీ) అనే మరొక శైలి మొదలు అయ్యింది.

చరిత్ర

మార్చు

లోమో ఎల్ సి-ఏ కెమెరా

మార్చు

జపాన్ కు చెందిన కోసినా సి ఎక్స్ 2 అనే కెమెరా వలెనే సోవియట్ లోని ఔత్సాహిక ఫోటోగ్రఫర్ల కొరకు ఒక కెమెరా తయారు చేయవలసిందిగా 1982lO రష్యా లోని సెయింట్ పీటర్స్‌బర్గ్కి చెందిన లోమో పి ఎల్ సి అనే సంస్థకు ప్రభుత్వం నుండి ఆజ్ఞలు వచ్చాయి. [2]. 1984 తో తయారీ మొదలైంది. ఈ కెమెరాకు Lomo Compact-Automat (LC-A) గా పేరు పెట్టటం జరిగింది. జేబులో ఇమిడిపోయే పరిమాణం, ఫోటోగ్రఫీలో సాంకేతిక అంశాలు తెలియవలసిన అవసరం లేకపోవటం, దీంతో తీసిన ఫోటోలలో ఇతర కళాత్మక లక్షణాలు రావటంతో ఇది సోవియట్ ప్రజల మన్ననలను చూరగొంది. ఆనతి కాలంలో ఇతర కమ్యూనిస్టు దేశాలకు ఎగుమతి కూడా ప్రారంభం అయ్యింది.

తగ్గిన డిమాండు

మార్చు

ఆసియా ఖండం లో తయారయ్యే కెమెరాలు మరింత అభివృద్ధి చెంది ఉండటం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం వలన పెరిగిన తయారీ ధరలు, రష్యా ఆర్థిక వ్యవస్థ చితికిపోవటంతో లోమో ఎల్ సి-ఏ కెమెరా డిమాండి పడిపోయింది. దీంతో తయారీ కూడా నామమాత్రంగా సాగింది.

లోమోగ్రఫీ కి బీజాలు వేసిన లోమో ఎల్ సి-ఏ కెమెరా

మార్చు

1991 లో వియన్నాకు చెందిన ఒక విద్యార్థి సమూహానికి రూపొందించిన లోమో ఎల్ సి-ఏ అనే కెమెరా దొరికినది. పరిపూర్ణ స్వయంచాలితమైన (Fully Automatic) ఈ కెమెరాతో ఛాయాచిత్రాలు సాంకేతికంగా సరిగా వచ్చేవి కావు. వ్యూఫైండర్ లో కనబడే దృశ్యం ఛాయాచిత్రంలో వచ్చే దృశ్యం వేర్వేరుగా ఉండేవి. ఫోటోల లో విగ్నెటింగ్ ఏర్పడేది. తీవ్రత పెంచబడిన రంగుల వలన వివిధ రంగుల మధ్య భేదాలు అధికంగా ఏర్పడేవి. ఈ కెమెరా సృష్టించే ఛాయాచిత్రాలలోని విచిత్రమైన రంగులు, ఒక్కోమారు మసకబారినట్టు ఏర్పడే లక్షణాలు ఉండేవి. వియన్నా విద్యార్థులు తమకి దొరికిన ఈ కెమెరాతో తీసిన ఛాయాచిత్రాలని వియన్నాలో ప్రదర్శించటం, వాటికి ప్రశంసల వర్షం కురవటం తో లోమోగ్రఫీ ఒక కళా ఉద్యమంగా ఏర్పడింది.

లోమోగ్రఫీ అవతరణ

మార్చు

వియన్నా విద్యార్థులు అంతర్జాతీయ లోమోగ్రఫిక్ సంఘం (Lomographic Society International) ను 1992 లో ఏర్పరచారు. లోమో ఎల్ సి-ఏ కెమెరా పై విస్తృత పరిశోధనలు చేయటమే కాక దీని మూలాలు తెలుసుకొనుటకై రష్యా బయలుదేరారు. 1995 నుండి సోవియట్ యూనియన్ వెలుపల ఎల్ సి-ఏ కెమెరాలని విక్రయించే ఏకైక సంస్థగా లోమోగ్రఫీ అవతరించటమే కాక ఈ శ్రేణిలోనే అనేక అసాంఖ్యిక కెమెరాలు, ఫిలింలు, ఫోటోగ్రఫీకి సంబంధించిన ఇతర పరికరాలని స్వంతంగా తయారు చేసే సంస్థగా ఏర్పడింది. అప్పటి సెయింట్ పీటర్స్బర్గ్ యొక్క అప్పటి డిప్యూటీ మేయర్, భవిష్యత్ ప్రధాని, రాష్ట్రపతి అయిన వ్లాదిమిర్ పుతిన్తో నగరంలోని లోమో కార్మాగారాన్ని మూసివేయకుండా ఉండే విధంగా పన్ను రాయితీ కొరకు కూడా లోమోగ్రఫీ సంస్థ ఒప్పందం కుదుర్చుకొంది.

లోమోగ్రఫీ సంఘ సేవ

మార్చు

లోమోగ్రఫీ యొక్క సాంకేతిక అంశాలని అందించటమే కాకుండా ఆఫ్రికా దేశాలలోని అనేక స్వచ్ఛంద సంస్థల సేవా కార్యక్రమాలకి తనవంతు కృషి చేసింది.

 
Lomo LC-A కెమెరా నుండి తీయబడ్డ ఒక ఛాయాచిత్రము

నూతన శకాన్ని ప్రారంభించిన లోమోగ్రఫీ

మార్చు

లోమో ఎల్ సి-ఏ తో బాటు లోమోగ్రఫీ పలు పురాతన కెమెరాలను సరిక్రొత్త సౌకర్యాలను సమకూర్చి పునర్నిర్మించింది. లోమోగ్రఫీని వ్యాపింపజేస్తూ పలు నూతన కెమెరాలు ఫిలిం లు, కటకాలు పలు ఇతర ఫోటోగ్రఫీ పరికరాలను రూపొందించింది. [3]

లోమోగ్రఫీ కెమెరాల చిత్రమాలిక

మార్చు

లోమోగ్రఫీ కెమెరాలతో తీయబడ్డ ఛాయాచిత్రాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు