వంకా రవీంద్రనాథ్
(వంక రవీంద్రనాథ్ నుండి దారిమార్పు చెందింది)
వంకా రవీంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2023 మార్చిలో జరిగిన ఎన్నికలకు స్థానిక సంస్థల కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1] వంకా రవీంద్రనాథ్ మార్చి 17న 460 ఓట్లతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2]
వంకా రవీంద్రనాథ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 మే 02 - 01 మే 2029 | |||
నియోజకవర్గం | ఉమ్మడి కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 28 డిసెంబరు 1961 పేకేరు, ఇరగవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) | ||
తల్లిదండ్రులు | వంకా సత్యనారాయణ, నాగమణి | ||
జీవిత భాగస్వామి | వంకా రాజకుమారి | ||
సంతానం | రఘువీర్, రవళి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చువంకా రవీంద్రనాథ్ 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. అతను అనంతరం రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిశీలకుడిగా పనిచేసి 2019లో చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేసి 2023లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటా నుండి 460 ఓట్లతో ఎమ్మెల్సీగా ఎన్నికై[3], మే 15న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
- ↑ Sakshi (17 March 2023). "'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
- ↑ Eenadu (21 February 2023). "వంక.. కవురు". Archived from the original on 6 June 2023. Retrieved 6 June 2023.