వంగపాడు (బేస్తవారిపేట)
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
వంగపాడు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
వంగపాడు (బేస్తవారిపేట) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°30′8.136″N 79°8′25.620″E / 15.50226000°N 79.14045000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | బేస్తవారిపేట |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08406 ) |
పిన్‌కోడ్ | 523 346 |
గ్రామ పంచాయతీ
మార్చువంగపాడు గ్రామం, పిటికాయగుళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం,
2013 జూలైలో వంగపాడు గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో సత్యనారాయణరడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా చినవెంకటరెడ్డి ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ గంగాదేవి సమేత కాటంరాజు ఆలయం
మార్చువంగపాడు సమీపంలోని తర్లుకొండ మోటుదగ్గర వెలసిన ఈ ఆలయంలో తిరునాళ్ళు, 2015,మార్చి-20వ తేదీ శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమైనవి. ముందుగా అర్చకులు ఆలయంలోని మూలవిరాట్టులకు అభిషేకం నిర్వహించారు. వంగపాడు, జె.సి.అగ్రహారం పిటికాయలగుళ్ళ, మల్లాపురం తదితర గ్రామాలనుండి వచ్చిన భక్తులు బొల్లావుల ఊరేగింపు నిర్వహించారు. తరువాత కులుకుభజన, వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నవి. [1]
శ్రీ సాయిబాబా ఆలయం
మార్చుఈ ఆలయం వంగపాడు సమీపంలోని తర్లుకొండ మోటుదగ్గర వెలసినది.