వంగవీటి రాధాకృష్ణ

వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. 2014లో వైఎస్సార్సీపీ లో చేరి ఎన్నికల్లో ఓడిపోయాడు. 2019లో తెలుగుదేశం పార్టీలో చేరాడు.

వంగవీటి రాధాకృష్ణ

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004- 2009
ముందు కోట శ్రీనివాసరావు
తరువాత రవి యలమంచిలి
నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1968
పెనమలూరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ
ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు వంగవీటి రంగా, రత్నకుమారి
జీవిత భాగస్వామి పుష్పవల్లి
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఏలేశ్వరపు జగన్‌ మోహన్‌ రాజు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2008లో ప్రజా రాజ్యం పార్టీలో చేరి[2] 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయాడు.

వంగవీటి రాధాకృష్ణ 2014 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓడిపోయాడు. ఆయన 2015లో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా,[3] విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేశాడు. ఆయనకు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో క్రమంగా వైసీపీకి దూరం అవుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 20 జనవరి 2019లో వీడి తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4][5][6]

వ్యక్తిగత జీవితం

మార్చు

పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో 2023 సెప్టెంబర్ 3న వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిల నిశ్చితార్థ వేడుక జరిగింది. పుష్పవల్లి నర్సాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె. వంగవీటి రాధా వివాహం అక్టోబర్ 22న విజయవాడ సమీపంలో మురళి రిసార్ట్స్ లో జరిగింది.[7][8]

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (29 March 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, తెరమరుగైన తెలుగు రాష్ట్రాల నేతలు, వారి వారసులు". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  2. The New Indian Express (22 December 2008). "Vangaveeti Radha joins Praja Rajyam Party". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  3. Sakshi (18 May 2016). "వంగవీటి రాధాకు సిటీ పగ్గాలు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  4. The Hindu (14 March 2019). "Vangaveeti Radha joins TDP" (in Indian English). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  5. HMTV (14 March 2019). "టీడీపీలో చేరిన వంగవీటి రాధా...టీడీపీలో చేరిన వైసీపీ నేతకు ఎమ్మెల్సీ అవకాశం..." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  6. Andhra Jyothy (27 December 2021). "కథ మారిందా.. వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యలు దేనికి సంకేతం!?". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  7. Hindustantimes Telugu. "వైభవంగా వంగవీటి రాధా, పుష్పవల్లి నిశ్చితార్థ వేడుక". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  8. Andhra Jyothy (3 September 2023). "వంగవీటి రాధా-పుష్పవల్లిల నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే..!?". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.