వంగూరి చిట్టెన్ రాజు

వంగూరి చిట్టెన్ రాజు నాటకకర్త, రచయిత, నటుడు, దర్శకుడు. అతను వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకుడు.[1]

జీవిత సంగ్రహం

మార్చు

వంగూరి చిట్టెన్ రాజు 1945 లో కాకినాడలో జన్మించాడు. అక్కడే ఇంజనీరింగ్ చదివి తరువాత బొంబాయి ఐ.ఐ.టిలో ఎం.టెక్. తో పాటు పి.హెచ్.డి పూర్తిచేశాడు. అనంతరం ఉద్యోగరీత్యా అమెరికా చేరుకున్నాడు.[2]

వీరు సుమారు 50 కథలు, 50 వ్యాసాలు, 50 హాస్య నాటికలు, 25 పైగా నాటకాలు రచించాడు.

వీరు రచించిన నాటకాలలోనే కాక, రావి కొండలరావు రచించిన "కుక్కపిల్ల దొరికింది", ఆదివిష్ణు రచించిన కొన్ని నాటకల్లో నటించి కొన్నింటికి దర్శకత్వం వహించాడు. జీ తెలుగులో ప్రసారమవుతున్న "భామ-సత్యభామ" ధారావాహికలో కొన్ని ఎపిసోడ్ లలో నటించాడు.

1976లో అమెరికాలోనే తొలితెలుగు పత్రికలలో ఒకటైన "మధురవాణి" ని ప్రారంభించి సుమారు 25 సంవత్సరాలు నడిపాడు.

వీరు "అమెరికా తెలుగు కథానిక" పేరుతో 14 సంపుటాలను ప్రచురించాడు.[3]

అవార్డులు

మార్చు
  • 2008 లో ఔట్‌స్టాండిగ్ కమ్యూనిటీ పురస్కారం.
  • బాలగంధర్వ పురస్కారం
  • తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం.
  • 2013 - లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం

మూలాలు

మార్చు
  1. https://www.taluk.org/assets/talawardees/LTA/LTA_awardee_2013.png
  2. "The Vanguri Foundation of America Program Endowment in Telugu Studies | Endowments" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
  3. https://lit.andhrajyothy.com/bookreviews/america-telugu-kathanika-14-27929