లోక్ నాయక్ ఫౌండేషన్

"లోక్ నాయక్ ఫౌండేషన్", ఇది భారతదేశంలో గొప్ప సాహితీ వేత్తలను గుర్తించి వారిని గౌరవించడానికి ఏర్పడిన సంస్థ . దీనికి అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ .

లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

భారతీయ సాహిత్య రంగంలో అసాధారణమైన విజేతలను గుర్తించడానికి, వారిని లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాలతో సత్కరించడం కోసం లోక్నాయక్ ఫౌండేషన్ సృష్టించబడింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్.టి.రామారావు, హిందీ కవి డాక్టర్ హరివంశ రాయ్ బచ్చన్ (నటుడు అమితాబ్ బచ్చన్ తండ్రి) ల గౌరవ చిహ్నంగా వార్షిక సాహిత్య సాధన పురస్కారాలను జనవరి 18 న ప్రదానం చేస్తారు.ఈ ఇద్దరు కూడా జనవరి 18 న కన్నుమూశారు, అందువల్ల ఆ రోజుకు ప్రాముఖ్యత ఇచ్చి పురస్కారాలను ప్రదానం చేస్తారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీతలను ప్రతి సంవత్సరం నవంబరు 24 న డాక్టర్ లక్ష్మి ప్రసాద్ యర్లగడ్డ పుట్టినరోజున ప్రకటిస్తారు. ఈ పురస్కారం ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ తెలుగు రచయిత లేదా కవి లేదా తెలుగు సాహిత్యం కోసం సేవ చేసిన ఘనత పొందిన వ్యక్తికి ఇవ్వబడుతుంది.[1] ఈ పురస్కారాలను 2005 నుండి ప్రదానం చేస్తున్నారు. విజేతలకు లక్షా ఇరవై ఐదు వేల రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందజేస్తారు.

పురస్కార విజేతలు మార్చు

లోక్‌నాయక్ పురస్కారాన్ని పొందిన కొందరు వ్యక్తులు:

  1. మాలతీ చందూర్ దంపతులు - 2005
  2. బోయి భీమన్న - 2006
  3. వాసిరెడ్డి సీతాదేవి - 2007
  4. కాళీపట్నం రామారావు - 2008
  5. రావూరి భరద్వాజ - 2009
  6. ఆవంత్స సోమసుందర్ - 2010
  7. సి.వి.సుబ్బన్న శతావధాని - 2011
  8. జానమద్ది హనుమచ్ఛాస్త్రి - 2012
  9. వంగూరి చిట్టెన్ రాజు - 2013
  10. పోపూరి లలిత కుమారి (వోల్గా) - 2014
  11. గొల్లపూడి మారుతీరావు [2] - 2015
  12. గరికిపాటి నరసింహారావు[3] - 2016
  13. గోరటి వెంకన్న[4] - 2017
  14. మీగడ రామలింగస్వామి[5] - 2018
  15. అంపశయ్య నవీన్[6] - 2019
  16. దూపాటి విజయ్ కుమార్ - 2020[7]
  17. లావు రత్తయ్య - 2020 జీవన సాఫల్య పురస్కారం.[7]

మూలాలు మార్చు

  1. "Loknayak Foundation". www.loknayakfoundation.com. Retrieved 2020-04-15.
  2. Reporter, Staff (2014-11-25). "Loknayak Foundation Award for Gollapudi". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-04-15.
  3. "Loknayak Foundation". www.loknayakfoundation.com. Retrieved 2020-04-15.
  4. "Lok Nayak Foundation award for Goreti Venkanna". The Hindu (in Indian English). Special Correspondent. 2016-11-25. ISSN 0971-751X. Retrieved 2020-04-15.{{cite news}}: CS1 maint: others (link)
  5. "Lok Nayak Foundation Award for Meegada". The Hindu (in Indian English). Special Correspondent. 2017-11-25. ISSN 0971-751X. Retrieved 2020-04-15.{{cite news}}: CS1 maint: others (link)
  6. India, The Hans (2018-11-25). "Ampasayya Naveen bags Lok Nayak Award-2019". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-15.
  7. 7.0 7.1 "18న లావు రత్తయ్యకు లోక్‌నాయక్ పురస్కారం". Telugu News International - TNILIVE (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-10. Retrieved 2020-04-15.

బాహ్య లంకెలు మార్చు