వత్సవాయి (ఇంటిపేరు)

వత్సవాయి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.

చరిత్ర

మార్చు

కాకతి గణపతిదేవ చక్రవర్తి కాలంలో సామంతునిగా ఉండి మహాదాతగా సుప్రఖ్యాతి పొందిన సాగి పోతరాజుకు మాచరాజు అనే సోదరుడు ఉండేవాడు. మాచరాజు కుమారుడు ఎరపోతరాజు ప్రతాపరుద్ర చక్రవర్తి సేనానుల్లో ఒకనిగా ఉండి మహమ్మదీయులతో జరిగిన యుద్ధాల్లో మరణించారు. అతని కుమారుల్లో తెలుగు రాజు రేకపల్లి దుర్గాన్ని, రామరాజు వత్సవాయి దుర్గాన్ని మహమ్మదీయ పాలనకు లోబడి కొంతకాలం రేచర్ల సింగమనాయుడు వంటి తిరుగుబాటు దారులతో పోరాడుతూండేవారు. వీరిలో సాగి రామరాజు వత్సవాయి కోటను పరిపాలించడంతో వారి తదనంతరకాలంలో వాళ్ళ ఇంటిపేరు సాగి నుంచి వత్సవాయిగా మారింది.[1] ఈ వివరాలన్నీ రామరాజుకు అంకితంగా వ్రాసిన రామవిలాసంలో ఉన్నాయి.

ప్రముఖ వ్యక్తులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.