వనస్పతి భారతీయుల ఆహారంలోని ప్రధానమైన కొవ్వు పదార్థం. నూనె గింజల నుండి నూనె తీయడం భారత దేశంలో అనాదిగా కొనసాగుతున్న గ్రామీణ పరిశ్రమ.

డాల్డా

నూనె గింజలు, వనస్పతి ఉత్పత్తులలో ప్రపంచంలో భారత దేశానిదే అగ్రస్థానం. వేరుశెనగ, ఆవాలు, పొద్దు తిరుగుడు గింజలు, సోయా చిక్కుడు, కొబ్బరి ల నుంచి నూనె ఉత్పత్తి చేస్తారు. హైడ్రోజినేషన్ వల్ల మామూలు నూనెల స్థానంలో నెయ్యి ని పోలి ఉండే వనస్పతి తయారవుతుంది.

చరిత్ర

మార్చు

భారత దేశవ్యాప్తంగా వంటశాలలలో కొబ్బరినూనె, నెయ్యి, ఆయా ప్రాంతాలలో దొరికే నూనె ఇళ్లలో వంట, వేపుళ్లకు, తీపి పదార్థములకు వాడేవారు. అయితే నెయ్యి సామాన్య ప్రజలకు నెయ్యి ఖరీదైనవి, వాటిని క్రమం తప్పకుండా కొనలేడు. హైడ్రోజనేటెడ్ నూనెలతో వనస్పతి ని నెయ్యికి బదులుగా డచ్ వ్యాపారులు భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ చౌకైన, ఉపయోగించడానికి సులభమైన, వంటలలో త్వరలో ప్రాచుర్యం పొందింది. ఈ స్థానం రావడం, అమ్మకాలు పెరగడంతో, లీవర్ సోదరులు డచ్ కంపెనీ నుండి హక్కులను కొనుగోలు చేశారు. 1931 లో, వారు భారతదేశంలో వనస్పతి నెయ్యిని ఉత్పత్తి చేయడానికి హిందుస్తాన్ వనస్పతి మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (నేటి హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్) అనే సంస్థను గ్రేటర్ ముంబైలోని సెవ్రీలో ఒక కర్మాగారాన్ని స్థాపించడం, 1937 లో, వనస్పతిని విక్రయించడానికి, దాదా అండ్ కో ( భారతదేశంలో ఉత్పత్తిని ప్రవేశపెట్టిన అసలు డచ్ సంస్థ), హిందుస్థాన్ లీవర్ లోని 'ఎల్' కలయికతో డాల్డా బ్రాండ్ ప్రవేశపెట్టబడింది.

వనస్పతి నెయ్యి (డాల్డా) ను వినూత్నంగా మార్కెట్ చేశారు. ఉత్పత్తిని మార్కెటింగ్ చేసే ప్రకటనల సంస్థ లింటాస్, ఈ సంస్థ భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మీడియా అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ సృష్టించిన ఘనత ఈ సంస్థదే. వారు ప్రకటనకు చేసిన ప్రక్రియ నగరరాలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు ( స్టాల్స్) లో పురుషులు డాల్డాను ఉపయోగించి రుచికరమైన స్నాక్స్ తయారు చేసి, వాటిని బాటసారులకు ఇవ్వడం, లఘు చిత్ర ప్రదర్శనలు (షార్ట్ ఫిలిమ్స్) ను థియేటర్లలో ప్రదర్శించారు. మోటారు వ్యానులలో కరపత్రాలను ప్రజలకు ఇవ్వడం, వనస్పతి చిన్న చిన్న డబ్బాలను విక్రయించడం, వనస్పతి నెయ్యి వాసన చూడటానికి, తాకడానికి,రుచి చూడటానికి ప్రజలను ప్రోత్సహించారు, గ్రామాలలో డాల్డా గురించి కథకులను చెప్పిచడం, అన్ని రకాల ( పెద్దవి, చిన్నవి) వేర్వేరు ప్యాక్ పరిమాణాలను ఉపయోగించి వినియోగదారులకు అందించడం లక్ష్యంగా చేసుకున్నారు. హోటళ్లు , రెస్టారెంట్లకు డబ్బాలలో ఇవ్వడం తో తమ వ్యాపారాన్ని అతి తొందరలో భారతదేశం లో సుస్థిర స్థానము ఏర్పాటు చేసుకున్నారు . దీనితో వినియోగదారులకు దేశ వా లి నెయ్యికి రుచికరమైన ప్రత్యామ్నాయం గా మారడం జరిగింది. దేశ వాలి నెయ్యి కొనలేని వారు, ఈ వనస్పతి నెయ్యి చాలా చౌక ధరలకు అదే రుచిని ఇస్తుందని నమ్మారు. అనతికాలంలోనే 'డాల్డా' అనే పేరు, వనస్పతి అనే పేర్లు మారుమోగిపోయాయి. భారతదేశంలో సాధారణ పదంగా మారిన మొదటి బ్రాండ్ పేర్లలో ఇది ఒకటి గ నిలిచింది. వనస్పతి నెయ్యి ( డాల్డా) మార్కెట్ లో ఆధిపత్యం 1980 సంవత్సరాల వరకు కొనసాగింది. 1950వ దశకంలో, ఇది 'తప్పుడు' నెయ్యి - వాస్తవానికి, దేశీ నెయ్యి కల్తీ అని, ఆరోగ్యానికి హానికరం అనే కారణంతో దీనిని నిషేధించాలని అపవాదులు రావడం జరిగింది. దేశవ్యాప్త సర్వే లో ( ఒపీనియన్ పోల్) నిర్వహించినప్పటికీ అసంపూర్తి ఫలితాలు వచ్చాయి. నెయ్యి కల్తీని నిరోధించడానికి మార్గాలను సూచించడానికి నియమించిన కమిటీ కూడా ఎటువంటి పరిష్కారాలను సూచించ లేక పోయింది. కొన్ని రోజులు ఈ వివాదం సద్దుమణిగింది కానీ 1990వ దశకంలో 'జంతు' కొవ్వు ఉందని ఆరోపణలు రావడం జరిగింది.[1]

వివాదాలు

మార్చు

వనస్పతి నెయ్యి ( డాల్డా) పై వచ్చిన ఆరోపణలకు 1950 వ దశకంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పిలుపునిచ్చిన దేశవ్యాప్త ఒపీనియన్ పోల్ అసంపూర్తిగా ముగిసింది. నెయ్యి కల్తీని నివారించే మార్గాలను సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. డాల్డా కు ప్రధాన పోటీదారులు ఎవరూ లేకపోవడంతో, సంస్థ ఈ వివాదంలో చిక్కుకున్నది. తిరిగి 40 సంవత్సరాల తరువాత, మళ్ళీ, 1990 లలో, డాల్డాలో జంతువుల కొవ్వు ఉందని, అది వినియోగానికి పనికిరాదని ఆరోపించారు. ఈ కాలంలో ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడే అనేక స్పష్టమైన లేదా శుద్ధి చేసిన చమురు బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో రావడంతో, డాల్డా గట్టి పోటీని ఎదుర్కొని, క్రమేణా మార్కెట్ వాటాను చాలా త్వరగా కోల్పోయింది. తద్వారా, హెచ్ యుఎల్ ఈ బ్రాండ్ ను అమెరికన్ ఫుడ్, అగ్రి మేజర్ బంగేకు సుమారు 90 కోట్ల రూపాయలకు విక్రయించింది.[2]

పునరుద్ధణ

మార్చు

పేరొందిన డాల్డా బ్రాండ్ పునరుద్ధరణకు మార్గం అమెరికన్ కంపెనీ బంగేకు సులభం కాదు. అయితే స్వచ్ఛతకు చిహ్నంగా బ్రాండ్ ను తిరిగి స్థాపించడం ,వినియోగదారుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడం, సవాలు గా మారింది. తిరిగి పేరు రావడానికి బంగే సంస్థ అనేక ప్రకటనలు, ఉత్పత్తి విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది.[2]

  • డాల్డాను బ్రాండ్ గా ఏర్పాటు చేయడం, భౌగోళికంగా వివిధ రకాల శుద్ధి చేసిన నూనెలను విక్రయించడం (సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామోలివ్ మొదలైనవి)
  • తల్లి ఆనందాన్ని చాటిచెప్పే 'డబ్బా ఖలీ పేట ఫుల్ క్యాంపెయిన్'
  • ' భారతదేశపు ప్రఖ్యాతి గాంచిన కిచెన్ కింగ్ సంజీవ్ కపూర్ తో ఘర్ కా ఖానా' ప్రచారం
  • ఒరిస్సా రథయాత్రలో యాత్రికులతో కలిసి దల్దా పాల్గొన్న 'భజన్ సే భోజన్ తక్' ప్రచారంలో ప్రపంచ ప్రఖ్యాత ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తో బొమ్మలు వేయించడం .
  • 'డయల్ డి' ప్రచారంలో డాల్డా ప్రజలను వారి అంతర్గత చెఫ్ను కనుగొనమని ,ఓటింగ్ ఆధారంగా వారిలో విజేతను ఎన్నుకోవడానికి వంటకాలను పంచుకోమని ప్రజలను ఆకర్షించారు

పునరుద్ధరణ వ్యూహాలతో 2017-18 నుంచి 2018-19 వరకు కంపెనీ 53.52 శాతం ఈబీఐటీడీఏ వృద్ధిని, 8.05 శాతం నికర విలువ వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆస్తులు వాటి ప్రస్తుత అప్పులకు 1.6 రెట్లు ఉన్నాయి, కంపెనీ రుణం కొంతకాలంగా స్థిరమైన క్రిసిల్ రేటింగ్ కలిగి ఉంది.

మూలాలు

మార్చు
  1. Sriram, Malathy (2016-04-16). "The Dalda story". BLoC (in ఇంగ్లీష్). Retrieved 2023-03-24.
  2. 2.0 2.1 "Dalda: The rise, fall, and revival of The Vanaspati ghee". The Strategy Story (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-02-06. Retrieved 2023-03-24.