ప్రొద్దు తిరుగుడు

ప్రొద్దు తిరుగుడు పువ్వునే సూర్యకాంతం పువ్వు (Sun flower) అంటారు. ఇది బంతి జాతి మొక్కకు చెందినది. ఒకే మొక్కలో అనేక లాభాలనుకునేవారికి అన్నిటికంటే ప్రొద్దుతిరుగుడు పువ్వే మిక్కిలి ముఖ్యమైనది. ఫ్రాన్స్ రాజైన 14వ లూయీ ప్రొద్దుతిరుగుడు పువ్వును చిహ్నంగా పెట్టుకున్నాడు.[1] అందుకే అతను సన్ కింగ్ అని పిలువబడేవాడు. విన్సెంట్ వాన్ గోఘ్ అనే చిత్రకారుడు అనేక సూర్యకాంతి పువ్వుల చిత్రాలను రమణీయంగా రూపొందించాడు.

సూర్యకాంతం పువ్వు
Scientific classification
Kingdom:
Order:
Family:
Genus:
Species:
H. annuus
Binomial name
Helianthus annuus

సోయా బీన్స్, వేరుశనగ ఆముదపు గింజలలాగే ప్రొద్దుతిరుగుడు కూడా నూనె గింజ. దీనిలో పుష్కలంగా ప్రోటీన్లతోపాటు నూనె, కాల్షియం లభిస్తాయి. దీని గింజనుంచి నూనె లభిస్తుంది. శాఖా సంబంధమైన ఈ వెజిటబుల్ నూనెను మార్గరిన్‌లో ఉపయోగిస్తారు. దీనిని దీసెల్ నూనెకు బదులుగా వాడతారు. విత్తనాలను పగలగొట్టి నూనె తీయగా మిగిలిన పిప్పిని కొలిమిలోనూ, బాయిలర్లలోనూ ఇంధనంగా వాడతారు.దీని పిండిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వలన పశువులకు బలమైన ఆహారంగా వినియోగపడుతుంది. ఒలిచిన ప్రొద్దుతిరుగుడు పప్పు పెంపుడు పక్షులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. అనేక విధాలుగా ఉపయోగపడే ఈ ప్రొద్దుతిరుగుడు ఔషధాల తయారీకీ, రంగులు వేయడానికీ ఉపయోగిస్తారు. 1510లో స్పానిష్ పరిశోధకులు మొట్టమొదట న్యూ మెక్సికోలో ఈ మొక్కను చూచి ఆశ్చర్యపడి కొన్ని విత్తనాలను స్పెయిన్‌కు తీసుకుపోయారు. అక్కడినుంచి ఈ విత్తనం మిగిలిన ఐరోపా, రష్యా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికాలకు ప్రాకిపోయింది. ఈనాడు రష్యా దీనిని అతి విస్తారంగా పండిస్తూంది.

ఇది ఏక వార్షిక పంట.సెప్టెంబర్ నుంచి జనవరి వరకు దీనిని నాటుతారు. మేలు రకంగా ఉండాలంటే ఒకసారి పండించిన ప్రదేశంలో తిరిగి మూడు సంవత్సరాల వరకు దీనిని పండించరాదు. దీనిని మొక్కజొన్న, జొన్న, గోధుమ పంటలతో కలిపి కలగలుపు పంటగా కూడా పండించవచ్చు.సాధారణంగా ప్రొద్దుతిరుగుడు పువ్వు 1 నుండి 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అక్కడక్కడ 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ సులభంగా జరగడానికి మొగ్గ విడవడానికి ముందు రక్షక పత్రాలు వంటి స్కేల్ లీవ్స్ సూర్యునివైపు తిరుగుతాయి. మొగ్గ విడవడానికి ఒకటి రెండు రోజులు ముందు మొగ్గ స్థిరంగా తూర్పు దిక్కుగా తిరుగుతుంది. రేకలు వెనుక ఆకుపచ్చ రంగు నుంచి పసుపుపచ్చ రంగుగా మారిన వెంటనే వీటిని కోస్తారు. అప్పుడు గింజలలో తేమ 10 శాతం కంటే తక్కువగా ఉంటుంది. విత్తనాలు రసాయనికంగా మార్చుకోగలిగినప్పుడు సాంకేతికంగా ఇవి దీసెల్ నూనెతో సరిసమానంగా ఉంటుంది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు