వరంగల్ శ్రీనివాస్

వరంగల్ శ్రీనివాస్ వరంగల్ జిల్లా కళాకారుడు. నటుడు, గాయకుడు, రచయిత బహుముఖ ప్రజ్జశాలి.[1].

Warangal Srinivas
బొడ్డు శ్రీనివాస్
వరంగల్ శ్రీనివాస్
జాతీయతభారతీయుడు
తల్లిదండ్రులుబొడ్డు నర్సయ్య, లింగమ్మ

అసలు పేరు బొడ్డు శ్రీనివాస్.

బాల్యంసవరించు

వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం, తక్కెళ్లపాడు గ్రామం. తల్లిదండ్రులు: బొడ్డు నర్సయ్య లింగమ్మ

కమ్యూనిస్ట్ వామపక్ష భావజాలంసవరించు

అతని అమ్మ, మా మేనత్తలు కూడా జానపదాలను చక్కగా ఆలపించేవారు. దుక్కి దున్నేటప్పుడూ నారు పోసేటప్పుడూ వడ్లు దంచేటప్పుడూ తిరగలి తిప్పేటప్పుడూ జోల పాడేటప్పుడు.. ఇలా పని జరుగుతున్న ప్రతి చోటా ఊళ్లో పాటలు వినే వాడు. అలాంటి వాతావరణంలో పెరిగానడు. పాట వినడమే కాదు, వాళ్లతో పాటు చిన్నప్పట్నుంచే గొంతు కలిపేవాడు. అలా పాట అనేది అతని జీవితంలో భాగం అయిపోయింది. అతని ఏడోతరగతిలోనే సొంతంగా పాట రాశాడు. రాసిన తొలిపాటకే ప్రథమ బహుమతి వచ్చింది. అప్పట్నుంచి అతని రచనా ప్రస్థానం మొదలైంది. పల్లె జానపదాల బాణీలను తీసుకొని ప్రస్తుత సమస్యలపై సొంతంగా పాటలు రాసేవాడు. అలా 93 అణగారిన జాతులపై పాటలు రాశాడు. కమ్యూనిస్ట్, మావోయిస్ట్, సోషలిస్ట్... ప్రజాకళాకారుడు అయ్యాడు. 

ఇతర భాషల్లో పాటలు రాశారుసవరించు

తెలుగు, బెంగాలీ, అస్సామీ, ఒరియా, లంబాడీ, కోయ, గొండు భాషల్లో ఎన్నో పాటలు రాయడమే కాదు, సొంతంగా పాడేవాడు కూడా[2]...

సినీ గీతరచయితగాసవరించు

సినీ రచయితగా తొలి అడుగు వేసింది దాసరి నారాయణ రావు గారి చిత్రం ద్వారానే. ‘అడవి చుక్క’ చిత్రంలో ‘తయ్యుందత్తై.. తయ్యుందత్తై అతడు రాసిన తొలి పాట. అదే సినిమాలో అతడు రాసిన ‘ఎవరు అన్నారమ్మ మేమూ... గరీబోళ్లనీ’ పాటైతే పెద్ద హిట్. అలాగే దాసరిగారి ‘చిన్నా’ చిత్రంలో అతడు రాసిన ‘గువ్వా గువ్వా ఎగిరేటి గువ్వా ఏడికే సిరిసిరి మువ్వా’ పాట విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆర్.నారాయణమూర్తి కూడా అతడు ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చలో అసెంబ్లీ, వేగుచుక్కలు, ఊరు మనదిరా, అడవిబిడ్డలు, వీరతెలంగాణ, పోరు తెలంగాణ, అమ్మమీద ఒట్టు చిత్రాలతోపాటు ‘నిర్భయభారతం’ చిత్రానికి కూడా పాటలు రాశాడు. ఇందులో అడవిబిడ్డలు, వీరతెలంగాణ చిత్రాల్లో నటించాడు కూడా. ఎర్ర సినిమాలే కాక, ఫూల్స్, ఆయుధం, ఈ వయసులో, రెండేళ్ల తర్వాత, రఘుపతి లాంటి వాణిజ్య చిత్రాలక్కూడా పాటలు రాశాడు.

లక్ష్యంసవరించు

గీత రచయితగా అన్ని రకాల పాటలు రాయాలని. డ్యూయెట్స్, ఐటమ్ సాంగ్‌‌లను కూడా రాయాలని. అలాగే... సంగీత దర్శకత్వం వహించాలని కోరికా ఉంది. అతనికి గతంలో ఓసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. త్వరలో ఆ కోరిక తీరాలనేదే అతని్ లక్ష్యం.

మూలాలుసవరించు

https://www.youtube.com/watch?v=3e5K0SpGmKU

బయటి లింకులుసవరించు

https://www.youtube.com/watch?v=C-OXLTsZ4t8

https://www.youtube.com/watch?v=evAk124Wgcg

  1. [1]
  2. [2]