వరద్వినాయక దేవాలయం

మహారాష్ట్రలోని మహ్ద్ గ్రామంలోని వినాయక దేవాలయం
(వరద వినాయక మందిరం, మహాడ్ నుండి దారిమార్పు చెందింది)

వరద్వినాయక దేవాలయం, మహారాష్ట్ర, పూణే జిల్లాలోని కర్జాత్, ఖోపోలి సమీపంలోని ఖలాపూర్ తాలూకాలో ఉన్న మహ్ద్ గ్రామంలోని వినాయక దేవాలయం.[1][2] వినాయకుడి అష్టవినాయక దేవాలయాలలో ఇదీ ఒకటి. ఈ దేవాలయాన్ని 1725లో పేష్వా జనరల్ రామ్‌జీ మహాదేవ్ బివాల్కర్ నిర్మించాడు.[3]

వరద్వినాయకుడు
వరద్వినాయకుడి విగ్రహం
వరద్వినాయకుడి విగ్రహం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:మహారాష్ట్ర
జిల్లా:పూణె జిల్లా
ప్రదేశం:మహ్ద్, ఖలాపూర్ తాలూకా

దేవాలయ చరిత్ర

మార్చు

1690లో ప్రక్కనే ఉన్న సరస్సులో స్వయంబు వినాయకుని విగ్రహం కనుగొనబడింది. 1725లో ఈ దేవాలయాన్ని సుభేదార్ రామ్‌జీ మహాదేవ్ బివాల్కర్ నిర్మించాడు.[3] ఈ దేవాలయంలోని వినాయక విగ్రహం తూర్పు ముఖంగా ఉండగా, అతని తొండం ఎడమవైపుకు తిరిగి ఉంటుంది. ఈ దేవాలయంలో ఉన్న నూనె దీపం 1892 నుండి నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది. ఈ దేవాలయంలో మూషిక, నవగ్రహ దేవతలు, శివలింగ విగ్రహాలు కూడా ఉన్నాయి. దేవాలయం 4 వైపులా 4 ఏనుగు విగ్రహాలు ఉన్నాయి. ఈ అష్ట వినాయకుని దేవాలయంలో భక్తులు గర్భగృహంలోకి ప్రవేశించి వ్యక్తిగతంగా విగ్రహానికి పూజలు చేస్తారు. ఏడాది పొడవునా భక్తులు వరద్వినాయకుడిని సందర్శిస్తారు. మాఘ చతుర్థి వంటి పండుగల సమయంలో ఈ దేవాలయంలో విపరీతమైన రద్దీ ఉంటుంది.

మూలాలు

మార్చు
  1. Grewal, Royina (2009-07-20). Book of Ganesha (in ఇంగ్లీష్). Penguin UK. ISBN 978-93-5118-091-3.
  2. Kundu, Mousumi. WeaverMag Volume 8 | November Edition | Monomousumi Services (in ఇంగ్లీష్). Monomousumi Services.
  3. 3.0 3.1 ''Varad Vinayak Ganpati Mandir, Mahad: Varadvinayak, Varadavinayaka, is one of the Ashtavinayak temples of the Hindu deity Ganesha. It is located in Madh village situated in Khalapur taluka near Karjat and Khopoli of Raigad District, Maharashtra, India. The temple was built (restored) by Peshwa General Ramji Mahadev Biwalkar in 1725AD. The idol of this temple Varada Vinayak is a swayambu (self originated) and was found in the adjoining lake in an immersed position in 1690 AD. This temple is said to be built in 1725AD by Subhedar Ramji Mahadev Biwalkar. The temple premises are on one side of a beautiful pond. The idol of this temple faces the east and has his trunk turned to the left. There is an oil lamp in this shrine which is said to be burning continuously since 1892. Devotees visit the Varadvinayak shrine throughout the year. During festivals like the Magha Chaturthi huge crowds can be seen in this temple.'' SOCIO-ECONOMIC GROWTH OF TOURISM NEED FOR SUSTAINABLE DEVELOPMENT IN RAIGAD DISTRICT: A GEOGRAPHICAL ANALYSIS