నవగ్రహాలు (Nine Planets, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు.

  1. ఖగోళ శాస్త్రములో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు. అయితే ఇటీవలి కాలంలో చివరి గ్రహమైన ప్లూటో గ్రహం కాదని శాస్త్రజ్ఞులు తీర్మానించారు. కనుక ఇప్పుడు ఎనిమిది గ్రహాలు అనే చెప్పడం ఉచితం.
  2. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో జీవితాలపైనా, ఘటనలపైనా ప్రభావం చూపే గ్రహాలు. ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకూ, ఈ నవ గ్రహాలకూ కొంత భేదం ఉంది. సూర్యుడు (సౌరమండలం కేంద్ర నక్షత్రం), చంద్రుడు (భూమికి ఉప గ్రహం).కానీ.,మన ఈ జ్యోతీశ్య శాస్త్రంలో & సంప్రదాయంలో సూర్య, చంద్రులు కూడా గ్రహాలుగా పరిగణింప బడుతాయి !యురేనస్, నెప్ట్యూన్ లు మన ఈ శాస్త్రం లెక్కలోకి రావు. కాని, రాహువు, కేతువు అనే రెండు ఛాయా గ్రహాలను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా గణిస్తారు.

ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం (2006 కు ముందు)

మార్చు
  1. బుధుడు
  2. శుక్రుడు
  3. భూమి
  4. కుజుడు (అంగారకుడు)
  5. బృహస్పతి (గురుడు)
  6. శని
  7. యురేనస్
  8. నెప్ట్యూన్
  9. ప్లూటో (ప్రస్తుతం గ్రహ హోదా కోల్పొయింది - 2006 ఆగస్టులో ఖగోళ విజ్ఙాన శాస్త్రవేత్తలు 'ప్లూటో'ని గ్రహం కాదని, కేవలం సౌరకుటుంబంలో ఒక వస్తువని తీర్మానించారు)

ఈ గ్రహాల పరిమాణం, దూరం వంటి ముఖ్య వివరాలు క్రింది పట్టికలో ఇవ్వడ్డాయి.

గ్రహాల ముఖ్య వివరాలు
పేరు మధ్య అర్ధ వ్యాసం
[a]
మాస్ [a] పరి భ్రమణ అర్ధ వ్యాసం
(Astronomical Unit)
పరిభ్రమణ కాలం
(సంవత్సరాలు)
సూర్యుని వ్యాసంతో
వాలు (Inclination) (° డిగ్రీలు)
Orbital eccentricity భ్రమణ కాలం
(ఓజుఉ)
సహజ ఉపగ్రహాలు వలయాలు వాతారణం
ఉపరితలం ఉన్నవి
(Terrestrial planets)
బుధుడు 0.39 0.06 0.39 0.24 3.38 0.206 58.64 లేవు అత్యల్పం
శుక్రుడు 0.95 0.82 0.72 0.62 3.86 0.007 -243.02 లేవు కార్బన్ డయాక్సైడ్ (CO2), నైట్రోజెన్ (N2)
భూమి [b] 1.00 1.00 1.00 1.00 7.25 0.017 1.00 1 చంద్రుడు లేవు N2, ఆక్సిజెన్ (O2)
కుజుడు 0.53 0.11 1.52 1.88 5.65 0.093 1.03 2 లేవు CO2, N2
వాయు మహా గోళాలు
(Gas Giants)
బృహస్పతి 11.21 317.8 5.20 11.86 6.09 0.048 0.41 63 ఉన్నాయి హైడ్రోజెన్ (H2), హీలియమ్ (He)
శని 9.41 95.2 9.54 29.46 5.51 0.054 0.43 56 ఉన్నాయి H2, He
యురేనస్ 3.98 14.6 19.22 84.01 6.48 0.047 -0.72 27 ఉన్నాయి H2, He
నెప్ట్యూన్ 3.81 17.2 30.06 164.8 6.43 0.009 0.67 13 ఉన్నాయి H2, He
a భూమితో పోలిస్తే Measured relative to the Earth.
b భూమి వ్యాసంలో మరిన్ని వివరాలున్నాయి.

భారత జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం

మార్చు

జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.

  1. సూర్యుడు
  2. చంద్రుడు
  3. అంగారకుడు (మంగళగ్రహం)
  4. బుధుడు
  5. గురువు
  6. శుక్రుడు
  7. శని
  8. రాహువు
  9. కేతువు

నవ గ్రహాల పూజ

మార్చు

నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.

నవగ్రహాల విశేషాలు

మార్చు

జ్యోతిష్య సంప్రదాయంలో నవ గ్రహాల గుణాలనూ, సంకేతాలనూ తెలిపే ఒక పట్టిక క్రింద ఇవ్వబడింది.

పేరు ఆంగ్లంలో బొమ్మ యంత్రము గుణము సూచిక
సూర్యుడు (सूर्य) Sun దస్త్రం:Surya planet.jpg దస్త్రం:Surya Yantra.jpg సత్వము ఆత్మ, రాజయోగం, పదోన్నతి, పితృయోగం.
చంద్రుడు (चंद्र) Moon దస్త్రం:Chandra img.jpg దస్త్రం:Chandra Yantra.jpg సత్వము మనసు, రాణి యోగం, మాతృత్వం.
కుజుడు (मंगल) Mars దస్త్రం:Kuja.jpg దస్త్రం:Mars yantra.jpg తామసము శక్తి, విశ్వాసం, అహంకారం
బుధుడు (बुध) Mercury దస్త్రం:Budh°planet.jpg దస్త్రం:Budha Yantra.jpg రజస్సు వ్యవహార నైపుణ్యం
బృహస్పతి, గురువు (बृहस्पति) Jupiter   దస్త్రం:Guru Yantra.jpg సత్వము విద్యా బోధన
శుక్రుడు (शुक्र) Venus దస్త్రం:Shukra planet.jpg దస్త్రం:Shukra Yantra.jpg రజస్సు ధనలాభం, సౌఖ్యం, సంతానం
శని (शनि) Saturn దస్త్రం:Shani planet.jpg దస్త్రం:Shani yantra.jpg తామసం పరీక్షా సమయం. ఉద్యోగోన్నతి, చిరాయువు
రాహువు (राहु) Head of Demon Snake
Ascending/North Lunar Node
తామసం తన అధీనంలో ఉన్నవారి జీవితాన్ని కలచివేసే గుణం
కేతువు (केतु) Tail of Demon Snake
Descending/South Lunar Node
దస్త్రం:Ketu.jpg తామసం విపరీత ప్రభావాలు
 
బ్రిటిష్ మ్యూజియమ్లో నవగ్రహ విగ్రహాలు - (ఎడమ నుండి) సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి
 
బ్రిటిష్ మ్యూజియమ్లో నవగ్రహ విగ్రహాలు - (ఎడమ నుండి) శుక్రుడు, శని, రాహువు, కేతువు

నవగ్రహాల ఆలయాలు

మార్చు

నవగ్రహ అలయలు మొత్తంగా తమిళనాడులో ఉన్నాయి. అవి

  1. అంగారక గ్రహనికి గాను వైదీస్వరన్ కొయిల్
  2. బుధ గ్రహానికి గాను తిరువంగాడ్
  3. శుక్ర గ్రహానికి గాను కంజనూర్
  4. కేతు గ్రహానికి గాను కీల్రుమ్పల్లమ
  5. గురు గ్రహానికి గాను ఆలంగుడి
  6. శని గ్రహానికి గాను తిరునల్లారు
  7. రాహువు గ్రహానికి గాను తిరునాగేశ్వరమ్
  8. చంద్ర గ్రహానికి గాను తిన్గలూరు
  9. సూర్య గ్రహానికి గాను సూరియానార్ కొయిల్

నవగ్రహ ధ్యాన శ్లోకములు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

నవగ్రహాలను స్తుతించే ఒక బహుళ ప్రచారంలో ఉన్న శ్లోకం

ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
రవి
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
చంద్ర
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
కుజ
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
బుధ
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
గురు
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
శుక్ర
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
శని
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
రాహు
అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
కేతు
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్