వరవిక్రయము (సినిమా)

1939 సినిమా
(వరవిక్రయం నుండి దారిమార్పు చెందింది)

ఇదే పేరుతో ప్రసిద్ధిచెందిన వరవిక్రయం నాటకం కూడా చూడండి.

వరవిక్రయం
(1939 తెలుగు సినిమా)
Telugucinemaposter varavikrayam 1939.JPG
వరవిక్రయం సినిమాపోస్టరు
దర్శకత్వం సి.పుల్లయ్య
కథ కాళ్ళకూరి నారాయణరావు
తారాగణం పుష్పవల్లి
శ్రీరంజని సీనియర్
భానుమతి
బలిజేపల్లి లక్ష్మీకాంతకవి
దైతా గోపాలం
కొచ్చర్లకోట సత్యనారాయణ
దాసరి కోటిరత్నం
తుంగల చలపతిరావు
నిర్మాణ సంస్థ ఈస్టిండియా ఫిలిమ్స్
భాష తెలుగు

తెలుగు సినిమా ప్రారంభదశలో సందేశాత్మకంగా వచ్చిన చిత్రాలలో వరవిక్రయము ఒకటి. ఈ చిత్రంతో భానుమతి సినీ జీవితం మొదలయ్యింది.[1]

కథసవరించు

వరకట్న వ్యవస్థ అనే సాఁఘిక దురాచారాన్ని ఎత్తిచూపే చిత్రం ఇది.

వరకట్నానికి వ్యతిరేకి అయనా ఒక రిటైర్డ్ ఉద్యోగి కూతురు 'కాళింది'([[భానుమతి]]) పెళ్ళికోసం అప్పు చేస్తాడు. ఆ పెళ్ళికొడుకు లింగరాజు (బలిజేపల్లి లక్ష్మీకాంత కవి) అనే ఒక ముసలి పినిగొట్టు వడ్డీ వ్యాపారి. అప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నవాడు. కట్నానికి వ్యతిరేకి అయిన కాళింది ఆత్మహత్య చేసుకొంటుంది. కాని లింగరాజు కట్నం తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు కాళింది చెల్లెలు కమల (శ్రీరంజని) లింగరాజును పెళ్ళాడి, పెళ్ళి తరువాత తన భర్తను కోర్టుకీడుస్తుంది.

విశేషాలుసవరించు

మూలాలుసవరించు