తుంగల చలపతిరావు

తుంగల చలపతిరావు, రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు. ఈయన, కపిలవాయి రామనాథశాస్త్రి, జొన్నవిత్తుల శేషగిరిరావు, దైతా గోపాలంలతో కలిసి బెజవాడ నాట్యమండలి పేరు మీద నాటకాలు వేసేవారు.[1][2]

కళాప్రస్థానంసవరించు

1935లో చలపతిరావు, దాసరి కోటిరత్నం, బి.వి.రామానందంలతో కలిసి ' భారత లక్ష్మి ఫిలిమ్స్ ' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి కలకత్తాలో సతీ సక్కుబాయి అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కోటిరత్నం సక్కుబాయిగా, చలపతిరావు కృష్ణునిగా నటించారు.[3] తెలుగు చలనచిత్రాలలో మొట్టమొదటి కృష్ణుని వేసిన తొలినటుల్లో చలపతిరావు ఒకడు. నాటకాల్లో దాసరి కోటిరత్నం పురుషపాత్రలు వేస్తే ఆమెకు జంటగా తుంగల చలపతిరావు స్త్రీ పాత్రలు వేసేవారట. ఈయన రంగస్థలంపై మంచి గాయకుడుగా కూడా పేరుతెచ్చుకున్నాడు.

దివిసీమలోని శ్రీకాకుళంలో జన్మించిన తుంగల చలపతిరావు దైతాగోపాలం దర్శకత్వంలో 'సక్కుబాయి' పాత్రలో శిక్షణ పొంది ఆ ఒక్క పాత్రలోనే అసామాన్య ఖ్యాతి గడించారు. 1935లో బి.వి.రామానందం 'సతీ సక్కుబాయి'ని సినిమాగా తీయాలని ఆ నాటక సమాజాన్నంతా కలకత్తా తీసికొని వెళ్ళారు. ఆ చలన చిత్రంలో తుంగల చలపతిరావు కృష్ణుడుగాను, నాటకాల్లో కృష్ణుడు వేషం వేసే డి. కోటిరత్నం సక్కుబాయిగాను నటించారు. 1938లో సి. పుల్లయ్య తీసిన 'మోహినీ భస్మాసుర' చలన చిత్రంలో నారదుడుగా నటించారు. అలా చలనచిత్రాలలో నటిస్తూ మరోప్రక్క సక్కుబాయి నాటకాన్ని ఏ.వి.సుబ్బారావు, రేలంగి, కె. శివరావు, దాసరి కోటిరత్నం ప్రభృతులతో కలిసి ప్రదర్శించేవారు. వరవిక్రయం, పాండురంగ విఠల్‌ చిత్రాలలో పనిచేశారు.

మరణంసవరించు

ఆయన 35 సంవత్సరాలైనా నిండకుండానే 1942, మార్చి 29న గుంటూరుజిల్లా మంగళగిరిలో నటిస్తూ సక్కుబాయి పాత్రలో భక్తి తన్మయంతో పాండురంగనిలో ఐక్యమయ్యే సన్నివేశంలో ఆయన కూడా ఐక్యమైపోయారు.[4]

నటించిన సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. సు'స్వరాల' మాల - పెండ్యాల Archived 2010-12-31 at the Wayback Machine - తెలుగుసినిమా.కామ్
  2. నారదపాత్రకు జీవం పోసిన 'తుంగల', (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 21 ఆగస్టు 2017, పుట.14
  3. "శిరా కదంబం: మొదటి మహిళా చిత్ర నిర్మాత". Archived from the original on 2012-02-04. Retrieved 2010-06-13.
  4. దివి సీమ దివ్వెలు - ఆంధ్రప్రభ సెప్టెంబరు 23, 2010[permanent dead link]