వరిగొండ కాంతారావు
వరిగొండ కాంతారావు ప్రముఖ కవి, రచయిత.
వరిగొండ కాంతారావు | |
---|---|
జననం | వరిగొండ కాంతారావు 1953, మార్చి 14 |
వృత్తి | విశ్రాంత ఉద్యోగి |
ఉద్యోగం | భారతీయ జీవిత భీమా సంస్థ |
ప్రసిద్ధి | కవి, రచయిత |
పదవి పేరు | విస్తరణాధికారి |
మతం | హిందూ |
భార్య / భర్త | వరిగొండ సూర్యప్రభ |
పిల్లలు | కొమాండూరు పద్మశైలజ, వరిగొండ కృష్ణకిశోర్, కాసర్ల సత్యసురేఖ |
తండ్రి | వరిగొండ రాజగోపాలరావు |
తల్లి | వరిగొండ సత్యవతి |
వెబ్‌సైటు | |
https://vkantharao.wordpress.com/ |
జీవిత విశేషాలు
మార్చుఇతడు 1953, మార్చి 14వ తేదీన జన్మించాడు.[1] సత్యవతి, వరిగొండ రాజగోపాలరావులు ఇతని తల్లిదండ్రులు. బి.కాం, ఎల్.ఎల్.బి చదివాడు. భారతీయ జీవిత భీమా సంస్థలో విస్తరణాధికారిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వరంగల్లులో నివాసం. ఇతని భార్య పేరు సూర్యప్రభ. ఇతనికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రచనలు
మార్చు- ఉద్యానం (కవితా సంపుటి) - 1990
- ఝరి (కవితా సంపుటి) - 2002
- దోస్తాన (కథా సంపుటి) - 2002
- సంద్రం (కవితా సంపుటి) - 2003
- గగనం (కవితా సంపుటి) - 2004
- ఏలికకొక లేఖ (గేయ శతకం) - 2006
- అనలానిలము (కవితా సంపుటి) - 2007
- వినగనేర్తువ భాజపా! (గేయ శతకం) - 2009
- భరతసుతుడా మేలుకో! (గేయ ద్విశతకం) - 2010
- స్వీయ ప్రకటనమ్ (ద్విశతకం) - 2011
- ప్రణవం (కవితా సంపుటి) - 2012
- తల్లి భారతి (గేయ ద్విశతి) - 2013
- వాడు ఓటును నాకు వేసెను! (గేయ శతకము) - 2014
- పంచాంగాన్ని నమ్మడమెలా! - ఒక ఆలోచన - 2014
- ముదమునందగ మోది వచ్చెను (గేయ శతకము) - 2015
సాహిత్య, సామజికరంగాలలో సేవ
మార్చుఇతడు హనుమకొండలో ఉన్న శ్రీరాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయమునకు కార్యదర్శిగా సేవలను అందిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి కార్యవర్గ సభ్యుడిగా, సాహితీ సమితి, శ్రీలేఖ సాహితి, సహృదయ సాహితీ సమితి వంటి సంస్థలలో సభ్యుడిగా, డా.నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టుకు సలహామండలి సభ్యుడిగా, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్(న్యూఢిల్లీ) జీవిత సభ్యుడిగా కొనసాగుతున్నాడు. పర్చా రంగారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు సభ్యుడిగా ఉన్నాడు.
పురస్కారాలు
మార్చు- ముళ్ళపూడి సూర్యనారాయణమూర్తి జాతీయ సాహిత్య పురస్కారము
- కాకతీయ విశ్వవిద్యాలయ గ్రంథాలయ సంఘం వారిచే ఉత్తమ గ్రంథాలయ సేవకుడిగా సత్కారం
- తడకమడ్ల సంప్రదాయ సాహిత్య పురస్కారం మొదలైనవి.
బిరుదులు
మార్చు- అభినవ కాళోజీ
- కాకతీయ కవిరాజు
మూలాలు
మార్చు- ↑ కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి (2011-10-20). "కదిలించే కలాలు". నేటినిజం.