వరుదు కల్యాణి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు

వరుదు కల్యాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021 నవంబరు 12న స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైంది.[1]

వరుదు కల్యాణి
వరుదు కల్యాణి


ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2 డిసెంబర్ 2021 - 1 డిసెంబర్ 2027

వ్యక్తిగత వివరాలు

జననం 30 ఆగష్టు 1979
అలుదు గ్రామం, సారవకోట మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు వరుదు బాబ్జిరావు, పరిమళ
జీవిత భాగస్వామి గేదల లక్ష్మణ్ సురేష్
సంతానం సిద్ధార్థ, గౌతమ్‌
పూర్వ విద్యార్థి బీఎస్సీ ఎం.బి.ఎ
మతం హిందూ మతము

జననం, విద్యాభాస్యం

మార్చు

వరుదు కల్యాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, సారవకోట మండలం, అలుదు గ్రామంలో వరుదు బాబ్జిరావు, పరిమళ దంపతులకు జన్మించింది. ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఎస్సీ (అగ్రికల్చర్), ఎంబీఏ పూర్తి చేసి చేసారు.[2]

రాజకీయ జీవితం

మార్చు

వరుదు కల్యాణి 2000లో ప్రముఖ వ్యాపార వేత్త, సంఘ సేవకుడు, వెలమ సామజిక వర్గ నాయకుడు అయిన తన తండ్రి వర్ధు బాబ్జీ రావు గారి చొరవతో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 2001లో సారవకోట జెడ్పిటిసిగా పోటీ చేసి గెలిచింది. వరుదు కల్యాణి 2009లో టీడీపీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరి శ్రీకాకుళం జిల్లా మహిళారాజ్యం కన్వీనర్ గా నియమితురాలైంది. ఆమె 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి పి.ఆర్.పి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయింది. పిఆర్పి కాంగ్రెస్ లో విలీనమైన తరువాత ఈమె 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.

వరుదు కల్యాణి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా, తరువాత అరకు పార్లమెంటు ఎన్నికల ఇన్‌చార్జిగా, విజయనగరం పార్లమెంటు ఇన్‌చార్జిగా పనిచేసింది. ఆమె 2019 ఎన్నికల ముందు అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండడంతో ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించింది.[3] ఆమె కొన్ని కారణాల వల్ల పోటీ నుండి తప్పుకొని తరువాత విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పర్యవేక్షకురాలిగా పనిచేసింది. ఆమెను 2021 నవంబరు 12న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[4] వరుదు కల్యాణి 2021 నవంబరు 21న నామినేషన్ దాఖలు చేయగా[5], 2021 నవంబరు 27న ఏకగ్రీవంగా ఎన్నికై[6], 2021 డిసెంబరు 8న శాసనమండలి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసింది.[7].

మూలాలు

మార్చు
  1. Sakshi (12 November 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  2. Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 డిసెంబరు 2021. Retrieved 31 December 2021.
  3. Sakshi (9 April 2019). "మహిళలు, యువత మద్దతు జగన్‌కే." Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  4. AndhraJyothy (13 November 2021). "కల నెరవేరింది". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  5. Andhrajyothy (21 November 2021). "ఎమ్మెల్సీ పదవులకు వంశీకృష్ణ, కళ్యాణి నామినేషన్‌". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  6. Prajasakti (27 November 2021). "'స్థానిక' ఎమ్మెల్సీలుగా వంశీకృష్ణ, కల్యాణి ఏకగ్రీవం | Prajasakti". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  7. Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.